శ్మశానవాటికలను పూర్తిస్థాయిలో ఆధునీకరించడంతో పాటు బాధతోవచ్చేవారికి స్వాంతన లభించే స్థలాలుగా ఉండాలి.* అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పలు మార్లు అధికారులకు సూచించారు. దీనితో గ్రేటర్ హైదరాబాద్‌లోని గ్రేవ్‌యార్డ్‌లన్నింటినీ ఆధునీకరించింది. జీహెచ్ఎంసి నిధులతో ఈ శ్మశానవాటికలను అభివృద్ది చేయడం , కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటీ క్రింద కూడా పలు ప్రైవేట్ సంస్థలతో అభివృద్ది చేయించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. సీ.ఎస్.ఆర్ పథకంలో భాగంగా రాయదుర్గ్‌లోని శ్మశానవాటికను ఫినిక్స్ సంస్థ మహాప్రస్థానం పేరుతో వైఫై, ఇంటర్నెట్, కెఫెటేరియాతో సహా సర్వహంగులతో రూపొందించింది. ఈ మహాప్రస్థానం సూపర్‌హిట్ కావడంతో నగరంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న 24శ్మశానవాటికను ఆధునీకరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. పనులను చేపట్టి వీటిలో 17 శ్మశానవాటికల అభివృద్ది పనులను రూ.*1771.81 లక్షలతో *పూర్తిచేశారు. ఈ 17 శ్మశానవాటికలను అత్యంత ఆధునికమైన వసతులతో ప్రధానంగా ప్రహరీగోడల నిర్మాణం, చితిమంటల ఫ్లాట్‌ఫామ్‌ల నిర్మాణం, అస్తికలను భద్రపరిచే సౌకర్యం, ప్రార్థనం గది, వెయిటింగ్ ఏరియా, సెట్టింగ్ గ్యాలరీ, పార్కింగ్ సౌకర్యం, నడకదారి, ఆఫీస్ ప్లేస్, వాష్ ఏరియా, ఎలక్ట్రిఫికేషన్, హరితహారం, ల్యాండ్ స్కేపింగ్‌లను చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు, మేయర్ బొంతు రామ్మోహన్‌లు శ్మశానవాటిక అభివృద్దిపై బొంతు రామ్మోహన్ క్షేత్రస్థాయి తనిఖీలు కూడా నిర్వహిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు మొదటి దశలో రూ. 17.72 కోట్లతో చేపట్టిన మోడల్ గ్రేవ్‌యార్డ్‌లలో 17 పూర్తయ్యాయని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు. బల్కంపేట రూ. 75.45 లక్షల వ్యయం, గోపనపల్లి రూ. 154.00 లక్షలు, జె.పి.కాలనీ రూ. 65.93 లక్షలు. తారానగర్ రూ. 95.00 లక్షలు, మియాపూర్ (ముస్లీం) రూ. 53.30 లక్షలు, మూసాపేట్ రూ. 91.25 లక్షలు, గౌతమ్‌నగర్ (ముస్లీం) రూ. 25.67 లక్షలు, గౌతమ్‌నగర్ (హిందూ) రూ. 50.00 లక్షలు, ఎస్.పి.నగర్ (హిందూ) రూ 118.08 లక్షలు, మచ్చబొల్లారం (హిందూ) రూ. 136.00 లక్షలు, రాంరెడ్డి నగర్ (ముస్లీం) రూ. 49.50 లక్షలు, పంజాగుట్ట రూ. 307.76 లక్షలు, దేవునికుంట రూ. 146.60 లక్షలు, దోమల్‌గూడ వినాయక్‌నగర్ రూ. 95.44 లక్షలు, శివరాంపల్లి గ్రేవ్‌యార్డ్ రూ. 45.36 లక్షలు, అంబర్‌పేట్ మోహినిచెరువు రూ. 165.70 లక్షలు,. మోక్షవాటిక రూ. 96.57 లక్షలు. రెండవ దశలో రూ. 640.85 లక్షల వ్యయంతో చేపట్టిన ఏడు శ్మశానవాటికల అభివృద్ది పనులు మరో 3నెలల్లో పూర్తవుతాయని డా.బి.జనార్థన్‌రెడ్డి వెల్లడించారు. రెండవ దశలో మల్లాపూర్ హిందూ గ్రేవ్‌యార్డ్ రూ. 80.03లక్షలు, జమాలీకుంట రూ. 147.85లక్షలు, స్వర్ణమార్గం, సీతాల్‌మాత రూ. 187.00లక్షలు, తారానగర్ (హిందూ) రూ. 59.50 లక్షలు, సాయినగర్ లాలాపేట రూ. 74.28 లక్షలు, ఆర్యన్ గ్రేవ్‌యార్డ్ రూ. 49.13 లక్షలు, క్రిష్టియన్ గ్రేవ్‌యార్డ్ రూ. 43.03 లక్షలతో అభివృధ్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు.