- రూ.400+ కోట్ల ఒప్పందం కింద మిల్కీ మిస్ట్‌కు రోజుకు 100KL అధిక నాణ్యత గల, పూర్తిగా ట్రేసబుల్ (మూలం గుర్తించదగిన) పాలను సరఫరా చేయనున్న మిల్క్‌లేన్.
- 95% చెల్లింపులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు పంపబడతాయి, ఇది న్యాయమైన ధర, పారదర్శకత, ఆర్థిక చేకూర్పును నిర్ధారిస్తుంది.
- మిల్క్‌లేన్దేశంలోనే మొదటిసారిగా స్టెయిన్‌లెస్ స్టీల్ డబ్బా పంపిణీ వ్యవస్థ కింద100% బల్క్ మిల్క్ కూలర్ (BMC) మోడల్ మరియు కఠినమైన పరీక్షా ప్రమాణాలను ఉపయోగిస్తుంది.
ఇన్నోటెర్రా యొక్క పాడి, పశువుల మేత వ్యాపార సంస్థ అయిన మిల్క్‌లేన్, మిల్కీ మిస్ట్ యొక్క విస్తరిస్తున్న ఉత్పత్తి శ్రేణికి అధిక-నాణ్యత, 100%మూలం గుర్తించదగిన (ట్రేసబుల్) పాలను సుస్థిరదాయకంగా సరఫరా చేయడానికి భారతదేశంలోని అత్యంత వినూత్నమైన పాల బ్రాండ్‌లలో ఒకటైన మిల్కీ మిస్ట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. మిల్క్‌లేన్ తన పటిష్ఠ రైతుల నెట్‌వర్క్,కఠినమైన నాణ్యత నియంత్రణను ఉపయోగించి ప్రీమియం పాలను సరఫరా చేస్తుంది. మరో వైపున మిల్కీ మిస్ట్ తన అధునాతన ప్రాసెసింగ్ టెక్నాలజీని, మార్కెట్ పరిధిని ఉపయోగించి అత్యుత్తమ పాల ఉత్పత్తులను అందిస్తుంది. ఈ సహకారం ముడి పాల నాణ్యత, సరఫరా గొలుసు పారదర్శకత, కార్యాచరణ సామర్థ్యం వంటి కీలకమైన పరిశ్రమ సవాళ్లను పరిష్కరిస్తుంది. అంతిమంగా రైతులు, వినియోగదారులు ఇద్దరికీ ప్రయోజనం చేకూరుస్తుంది.
రూ. 400+ కోట్ల ఒప్పందం ప్రకారం, మిల్క్‌లేన్ మూడు సంవత్సరాలకు పైగా కాలానికి మిల్కీ మిస్ట్‌కు రోజుకు 100 కిలోలీటర్ల ప్రీమియం పాలను సరఫరా చేస్తుంది. ఈ భాగస్వామ్యం 10,000+ మంది రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది.న్యాయమైన ధర, అధిక పోషకాహార పశువుల దాణా ఉత్పత్తులను పొందేలా చేస్తుంది. మిల్కీ మిస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాలకు అధిక స్వచ్ఛత కలిగిన పాలు మాత్రమే చేరేలా చూసుకోవడానికి, మిల్క్‌లేన్ తన100% బల్క్ మిల్క్ కూలర్ (BMC) మోడల్ ఆపరేషన్లు, వినూత్నమైన స్టెయిన్‌లెస్ స్టీల్ డబ్బా పంపిణీ వ్యవస్థను, సేకరణ కేంద్రాలలో కఠినమైన యాంటీబయాటిక్స్,కల్తీ పదార్థాల పరీక్షలతో సహా కఠినమైన నాణ్యత నియంత్రణ ప్రోటోకాల్‌లను ఉపయోగిస్తుంది. అంతేగాకుండా,రియల్-టైమ్ సరఫరా గొలుసు ట్రాకింగ్ పాల సేకరణలో పూర్తి ట్రేసబిలిటీ, పారదర్శకత,సుస్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది.
విలువ ఆధారిత పాల ఉత్పత్తిలో అగ్రగామి అయిన మిల్కీ మిస్ట్, 75 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పూర్తిగా ఆటోమేటెడ్ పెరుండురై సౌకర్యంలో ప్రతిరోజూ 1.5 మిలియన్ లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తుంది. సుస్థిరత్వానికి కట్టుబడి, ఇది తన కార్యకలాపాలలో పవన, సౌర శక్తిని అనుసంధానిస్తుంది. మిల్క్‌లేన్‌తో భాగస్వామ్యం అధిక-నాణ్యత, గుర్తించదగిన పాలను పొందే దాని సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది, భారతదేశ పాడి పరిశ్రమ రంగంలో దాని నాయకత్వాన్ని బలోపేతం చేస్తుంది.
ఈ భాగస్వామ్యం గురించి మిల్క్‌లేన్ మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ శర్మ మాట్లాడుతూ, ‘‘మిల్కీ మిస్ట్‌తో మా భాగస్వామ్యం పాడి పరిశ్రమలో పారదర్శకత, సుస్థిరత్వం, రైతు మద్దతు కోసం మా ఉమ్మడి దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. తన విస్తరిస్తున్న విలువ-ఆధారిత పాల పోర్ట్‌ఫోలియో కోసం 100% ఎండ్-టు-ఎండ్ ట్రాక్ చేయగల, అధిక-నాణ్యత ప్రీమియం పాల సరఫరాతో మిల్కీ మిస్ట్‌కు మద్దతు ఇవ్వాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. పాడి రంగం అస్థిరమైన కొవ్వు, ఎస్ఎన్ఎఫ్స్థాయిలు, యాంటీబయాటిక్ కాలుష్యం, అఫ్లాటాక్సిన్ ప్రమాదాలతో పోరాడుతోంది.ఇవి ఉత్పత్తి నాణ్యత, భద్రతను ప్రభావితం చేస్తాయి. మిల్క్‌లేన్ ఈ సవాళ్లను సాంకేతికతతో నడిచే విధానంతో పరిష్కరిస్తుంది. 10,000+ రైతుల నెట్‌వర్క్, 150+ వ్యూహాత్మకంగా ఉంచబడిన బీఎంసీలు, కేంద్ర ప్రయోగశాలలలో 40+ పరీక్షలతో నాలుగు-స్థాయిల నాణ్యత హామీని ఉపయోగిస్తుంది. ఈ భాగస్వామ్యం కొత్త పరిశ్రమ ప్రమాణాలను నిర్దేశిస్తుందని మేం విశ్వసిస్తున్నాం.పాల ప్రాసెసింగ్‌లో మిల్కీ మిస్ట్ ఆవిష్కరణతో సోర్సింగ్‌లో మిల్కీ మిస్ట్ యొక్క నైపుణ్యాన్ని మిళితం చేస్తుంది’’ అని అన్నారు.
విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి పెట్టడం, ఈ భాగస్వామ్యం తమ కార్యకలాపాలను ఎలా బలోపేతం చేస్తుందో వివరిస్తూ, మిల్కీ మిస్ట్ డెయిరీ సీఈఓ డాక్టర్ కె రత్నం మాట్లాడుతూ, “వినియోగదారులకు వినూత్న, అధిక-నాణ్యత, విలువ ఆధారిత పాల ఉత్పత్తులను అందించడానికి మేం కట్టుబడి ఉన్నాం. మిల్క్‌లేన్‌తో ఈ భాగస్వామ్యం మా వినియోగదారులకు అత్యున్నత భద్రత, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ కఠినంగా పరీక్షించబడిన, ప్రీమియం పాల సుస్థిర సరఫరాను మేంఅందుకుంటామని నిర్ధారిస్తుంది. అంతేగాకుండా,సరసమైన ధర, శాస్త్రీయంగా రూపొందించబడిన పశువుల దాణాతో సహా మిల్క్‌లేన్ యొక్క రైతు-కేంద్రీకృత విధానం పాల పర్యావరణ వ్యవస్థను బలపరుస్తుంది – ఉత్పత్తిదారులకు, తుది వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. మేం మా ఉత్పత్తి శ్రేణిని, మార్కెట్ పరిధిని విస్తరిస్తున్నప్పుడు, ఈ భాగస్వామ్యం పరిశ్రమలో మా స్థానాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది’’ అని అన్నారు.
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు, వినియోగదారుగా ఉన్నందున, ఉత్పత్తి నాణ్యత, సరఫరా గొలుసు సమగ్రతను నిర్వహించడం చాలా కీలకం. మిల్కీ మిస్ట్, మిల్క్‌లేన్ మధ్య ఈ భాగస్వామ్యం పారదర్శకత, రైతు సంక్షేమం, భారతీయ గృహాలకు సురక్షితమైన, అధిక-నాణ్యత గల పాల ఉత్పత్తులను ఎక్కువగా పొందడం కోసం పరిశ్రమ ప్రమాణాలను పెంచుతుంది.