- 3,823 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 76 గంటలు 35 నిమిషాల్లో పూర్తి చేసిన వేగవంతమైన ఈవీప్రయాణం
- ప్రయాణంలో20 రికార్డులు సాధనభారతదేశంలోని వేగవంతమైన మరియు విస్తృతమైన ఈవీఛార్జింగ్ నెట్‌వర్క్‌ను ప్రదర్శన
కన్యాకుమారి:భారతదేశపు అగ్రగామి ఈవీతయారీ సంస్థ మరియు దేశ ఈవీవిప్లవానికి పునాది వేసిన టాటా.ఈవీ, కర్వ్.ఈవీమోడల్‌తో దేశపు ఉత్తర నుండి దక్షిణ చివర వరకూ వేగవంతమైన ఈవీప్రయాణాన్ని పూర్తి చేసింది. కేవలం 76 గంటలు 35 నిమిషాల్లో కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 3,823 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తిచేసి, గత రికార్డును (నెక్సాన్ఈవీమ్యాక్స్) 19 గంటలు తగ్గించడంతో కొత్త రికార్డు సృష్టించింది. ప్రయాణంలో 20 జాతీయ రికార్డులను కూడా నెలకొల్పింది.
ఈ విశేషమైన ప్రయాణాన్ని కేవలం 16 ఛార్జింగ్ స్టాప్‌లతో పూర్తి చేయడం విశేషం. 2023లో నెక్సాన్ ఈవీమ్యాక్స్ కోసం ఛార్జింగ్ సమయం 28 గంటలు ఉండగా, ఇప్పుడు అది కేవలం 17 గంటలకు తగ్గడం టెక్నాలజీలోని అభివృద్ధిని స్పష్టం చేస్తోంది. అంతేకాదుభారతదేశం అంతటా వేగవంతమైన ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణ కూడా ఈ విజయానికి కారణం.
ఈ ప్రయాణానికి శ్రీనగర్‌లో జమ్మూ &కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఫిబ్రవరి 25, 2025 న ఉదయం 4:00 గంటలకు ప్రారంభమైన కర్వ్.ఈవీ ప్రయాణంమార్గమధ్యలో వివిధ వాతావరణ పరిస్థితులు,భిన్నమైన భౌగోళిక మార్గాలు, ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్ సౌకర్యాలను వినియోగించుకుని, ఫిబ్రవరి 28, 2025రోజున ఉదయం 8:35 గంటలకు కన్యాకుమారిలోని ఎంపీశ్రీ విజయ్ వసంత్ చేతులమీదుగా స్వాగతించబడింది.
ఈ ప్రయాణం గురించి టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మెబిలిటీ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శ్రీ వివేక్ శ్రీవాత్స మాట్లాడారు. “ఈ ప్రయాణం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలతో ఎంత సులభంగా, సమర్థంగా, మరియు ఆనందంగా ప్రయాణం చేయవచ్చో తెలియజేయడమే మా లక్ష్యం. రోజుకు సుమారు 1,200 కిలోమీటర్ల ప్రయాణ లక్ష్యంతో 55కెడబ్ల్యూహెచ్బ్యాటరీ మరియు ఏసిటిఐ.ఈవీ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడిన కర్వ్.ఈవీ దీర్ఘకాల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మరియు అలసట లేకుండా చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 18,000 ఛార్జింగ్ స్టేషన్లు ఉండటంతోప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల్లో వేగవంతమైన ఛార్జింగ్ నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. ఈ ప్రయాణం టాటా ఈవీటెక్నాలజీ పరిపక్వతను మాత్రమే కాకుండా ఐసిఈ వాహనాలతో సమానంగా దీర్ఘ ప్రయాణాలను పూర్తి చేయగల సామర్థ్యాన్ని కూడా నిరూపించింది. ఈ రికార్డు భవిష్యత్ ఈవీకొనుగోలుదారులలో విశ్వాసాన్ని పెంచుతుందనే నమ్మకం ఉంది.”