హైదరాబాద్, ఇండియా, మార్చి 2025:దక్షిణాసియాలో అతిపెద్ద ప్రైవేట్ లైఫ్ సైన్స్ మౌలిక సదుపాయాల యజమాని మరియు ఆపరేటర్ అయిన నెయోవాంటేజ్ ఇన్నోవేషన్ పార్క్, బయోఏషియా 2025లో భాగంగా ప్రదర్శనలో పాల్గొనటంతో తెలంగాణలో విశ్వస్థాయి లైఫ్ సైన్స్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో తన నిబద్ధతను ప్రదర్శించింది.
బయోఏషియాలో భాగంగా, నెయోవాంటేజ్ ఇన్నోవేషన్ పార్క్ బాయోఏషియా ప్రతినిధి బృందానికి ప్రత్యేక ప్రాంగణ సందర్శనను నిర్వహించింది. ఈ బృందంలో ప్రభుత్వ మరియు పరిశ్రమ ప్రతినిధులు, శ్రీ జయేష్ రంజన్, ఐఏఎస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఐటీ &ఈసీ మరియు వాణిజ్య, పరిశ్రమల విభాగం, శ్రీ శక్తి నాగప్పన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈఓ, డాక్టర్ కాథ్రిన్ మిసెరా-లాంగ్, జర్మనీ కాన్సుల్ జనరల్, శ్రీమతి అమితా దేసాయి, జర్మనీ గౌరవ కాన్సుల్ పాల్గొన్నారు. ఈ సందర్శనలో బిల్డింగ్ 3600తో పాటు ప్రముఖ బయోటెక్, లైఫ్ సైన్సెస్ కంపెనీల కోసం రూపుదిద్దుకున్న మౌలిక సదుపాయాలను వీక్షించారు. ఇటీవల పార్క్‌లో అనేక ప్రముఖ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇది శాస్త్రీయ పురోగమన కేంద్రంగా స్థిరపడుతోంది.
ఈ సందర్శనలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన సంఘటన మిల్టెనీ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభించారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి సిజిటి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సిఓఇ), ప్రత్యేకంగా సెల్ అండ్ జీన్ థెరపీ పరిశోధన మరియు తయారీ కోసం రూపొందించబడింది. ఈ కేంద్ర ప్రారంభం భారతదేశపు అత్యాధునిక బయోఫార్మాస్యూటికల్ నూతన ఆవిష్కరణల ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. మిల్టెనీ బయోటెక్ నుండి డాక్టర్ బోరిస్ స్టోఫెల్, సీఈఓ, శ్రీమతి ప్రియ హింగోరాని, మేనేజింగ్ డైరెక్టర్, మిల్టెనీ బయోటెక్ ఇండియా మరియు వారి సీనియర్ మేనేజ్‌మెంట్ బృందం మరియు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రాంగణంలో వృక్షారోపణ కార్యక్రమం కూడా నిర్వహించారు.
“భారతదేశంలోని లైఫ్ సైన్స్ రంగం అభివృద్ధికి మేము మద్దతు అందించడంలో గర్విస్తున్నాము. బయోటెక్ మరియు ఫార్మాస్యూటికల్ సంస్థలకు అనుగుణంగా ఉన్న ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అందించడమే మా లక్ష్యం,” అని లైట్ హౌస్ కాన్టన్ రియల్ ఎస్టేట్ వ్యాపార అధిపతి మరియు నెయోవాంటేజ్ ఇన్నోవేషన్ పార్క్స్ ప్రాజెక్ట్ మరియు వ్యాపార అభివృద్ధి అధిపతి శ్రీ అతుల్ భద్వాజ్ అన్నారు. “మిల్టెనీ బయోటెక్ సౌకర్యాల ప్రారంభం మరియు మా విస్తరణ చర్యలు, నూతన చికిత్సలు మరియు ఆరోగ్య సంస్కరణలకు అనుకూల వాతావరణాన్ని అందించేందుకు మేము చేసిన కృషికి నిదర్శనం.”