eenadubusiness.com

భారతదేశంలో ఈవీ త్రీ-వీలర్ ఫైనాన్సింగ్ ల్యాండ్‌స్కేప్‌ను మార్చడానికి  కలసి పని చేయనున్న ఈకోఫై, టీవీఎస్ మోటార్ కంపెనీ  

~ఈ భాగస్వామ్యం ఈవీ త్రీవీలర్ రంగం వృద్ధి పథాన్ని పెంచుతుంది~

ఎవర్‌సోర్స్ క్యాపిటల్ మద్దతు కలిగి, భారతీయ రిటైల్ రంగంలో క్లైమేట్ ఫైనాన్స్ అంతరాన్ని తొలగించేందుకు అంకితమైన భారతదేశ  అగ్రగామి గ్రీన్-ఓన్లీ ఎన్బీఎఫ్సి ఈకోఫీ,  ద్విచక్ర,  త్రిచక్ర విభాగాల్లో పనిచేసే ప్రము ఖ అంతర్జాతీయ వాహన తయారీ సంస్థ టీవీఎస్  మోటార్ కంపెనీతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది.  వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్  త్రీవీలర్ విభాగంలో  ఈ వ్యూహాత్మక సహకారం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ స్వీకరణను పెంచడం,  దేశవ్యాప్తం గా సుస్థిరమైన చలనశీలతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సహకారం గురించి ఈకోఫీ సహ వ్యవస్థాపకుడు ఎండీ, సీఈఓ రాజశ్రీ నంబియార్ మాట్లాడుతూ, ‘‘టీవీఎస్  మోటార్ కంపెనీతో ఈ భాగస్వామ్యం క్లీన్ ఎనర్జీ భవిష్యత్తుకు మా నిబద్ధతతో సంపూర్ణంగా జతకట్టింది.  ప్యాసిం జర్, కార్గో త్రిచక్ర వాహనాలకు సంబంధించి సమగ్ర ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించడానికి ఈ భాగస్వామ్యం మాకు సహాయం చేస్తుంది. టీవీఎస్  మోటార్  విస్తృత  పరిశ్రమ అనుభవం, పటిష్ఠ పంపిణీ నెట్‌వర్క్, స్థిరపడిన బ్రాండ్ ఖ్యాతిని ఉపయోగించుచుకోవ డం ద్వారా  ఈవీ ఫైనాన్సింగ్ రంగంలో గణనీయమైన ప్రభావాన్ని చూప డానికి ఈకోఫీ సిద్ధంగా ఉంది.  మేం మా ఫైనాన్సింగ్ కార్యకలాపాలను వృద్ధి చేస్తున్న క్రమంలో మా విస్తరణ ప్రయాణం 2025 ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన వృద్ధిని సాధిస్తుందని మేం భావిస్తున్నాం’’ అని అన్నారు.

టీవీఎస్ మోటార్ కంపెనీ కమర్షియల్ మొబిలిటీ బిజినెస్ హెడ్ రజత్ గుప్తా మాట్లాడుతూ, ‘‘ఈకోఫీతో కలిసి పని చేయడం వల్ల మా తయారీ నైపుణ్యాన్ని వారి వినూత్న ఆర్థిక సేవలతో కలపవచ్చు.  ఈ సహకారంతో మేం వృ ద్ధిని పెంపొందించడం, వినూత్నతలను ప్రోత్సహించడం, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ సెగ్మెంట్‌లోని మా కొనుగోలుదారులకు అసమాన విలువను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది సుస్థిర చలనశీలత పరిష్కారాలను అందించాలనే మా నిబద్ధతకు అనుగుణంగా ఉంది’’ అని అన్నారు.

ఈకోఫీ, టీవీఎస్ మోటార్ కంపెనీ కలసి టీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాలను మరింత అందుబాటులోకి, సరసమైన ధరకు అందించడానికి అనుకూలీకరించిన ఫైనాన్సింగ్ పథకాలను ప్రారంభిస్తున్నాయి. ఈ అనుకూల ఆఫర్లు ఈవీ  స్వీకరణను ప్రోత్సహించడం, భారత్ లో ఈవీ  ఫైనాన్సింగ్ భవిష్యత్తును పునర్నిర్వచించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.