eenadubusiness.com

రెండు వాహనాలకు నిప్పంటించిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు మరో విధ్వంసానికి తెరలేపారు. సుక్మా ఎస్పీ అభిషేక్ మీనా వివరాలను వెల్లడించారు.. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పోలంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంకేర్‌లంక – పూసవాడ మార్గం మధ్యలోఆదివారం [12ఆగస్టు నాడు ] మావోయిస్టులు రెండు ట్రావెల్ వ్యాన్‌లను అడ్డుకున్నారు. డ్రైవర్లను దించి వాహనాలకు నిప్పటించారు. నాలుగు రోజులుగా మావోయిస్టులు దంతేవాడ, సుక్మా జిల్లాల్లో వరుస దాడులకు పాల్పడుతూ ఉనికిని చాటుకుంటున్నారు. ఈ నెల 6వ తేదీన సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనకు ప్రతిగా మావోయిస్టులు ఇలాంటి విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ వెల్లడించారు.