*కొల్లూరు లో జీ హెచ్ ఎం సి చేపట్టిన మెగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల పురొగతి పై సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి కె.టీ.ఆర్.*
**ప్రెస్‌నోట్: 2** రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి కెటీఆర్ కొల్లూర్ డబుల్ బెడ్ రూమ్ ఇల్ల నిర్మాణం మంచి పురోగతి లో సాగడం పట్ల సంతృప్తిని వ్యక్తం చెసారు. రూ.1354.59 కోట్ల వ్యయం తో కొల్లూరు లో నిర్మిస్తున్న ఇల్ల నిర్మాణాలను మంత్రి కెటీఆర్, నగర మెయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్హెంసి కమీషనర్ జనార్దనరెడ్డి లతో కలసి నేడు ఆకస్మికంగా తనీఖీ చెసారు. కొల్లూరు ఇల్లను నాణ్యతా ప్రమాణాలతో నిర్మిచడo, ఇల్ల నిర్మానాలలొ అడికారులు మంచి టీం వర్క్ తో పనిచేయడం పట్ల సంతృప్తిని వ్యక్తం చెసారు. కొల్లూరు మేఘా ఇల్ల నిర్మాణానికి సాంకేతిక సలహాలందిస్టున్న జె.ఎన్.టీ.యు అడ్యాపకులు, సైట్ ఇంజనీర్లతొ మంత్రి కెటీఆర్ సమావేశమయ్యారు. కొల్లురు ఇల్ల కాలనీ ని దేశం లొనె మోడల్ కాలనీగా రూపొందించాలని, అన్ని మౌలిక సదుపాయాలను పూర్తి స్టాయిలో కల్పించాలని మంత్రి ఆదేశించారు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్టికి టైమ్ లైన్ ణూ నిర్డెశించుకొని వెల్లాలని సూచించారు. దెశం లో బలహీన వర్గాలకు ఉచితం గా 15,660 డబుల్ బెడ్ రూమ్ ఇల్ల నిర్మాణాలు ఒకే దగ్గర నిర్మించిన దాఖలాలు లేవని,ఇంతటి ప్రతిస్టాకరమైన ప్రాజెక్ట్ ను మోడల్ సిటీ గా రూపొందించ నున్నట్టు మున్సిపల్ శాఖా మంత్రి వెల్లడించారు.
*కొల్లూరులో మెగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం*
ఒకే చోట 15,600 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపడుతుంది జీహెచ్ఎంసి.
చిన్నపాటి నగరాన్ని రూపొందించే ఈ మెగా డబుల్ బెడ్‌రూం సిటీ నిర్మాణాన్ని రామచంద్రపురంలోని కొల్లూరు గ్రామంలో నిర్మిస్తోంది.
మొత్తం నిరుపేద లబ్దిదారులకు ఉచితంగా నిర్మించనున్న ఈ డిగ్నిటీ హౌజింగ్‌ను కొల్లూరులో 124 ఎకరాల స్థలంలో రూ. 1354.59 కోట్ల వ్యయంతో 15,660 ఇళ్ల నిర్మాణాన్ని చేపడ్తున్నారు.
మొత్తం 117 మౌజింగ్ బ్లాకుల్లో ఎస్-9, ఎస్+10, ఎస్+11 అంతస్థుల్లోనిర్మించనున్న ఈ కాలనీని దేశంలోనే ఆదర్శవంతమైన, మరెక్కడా లేనివిధంగా అన్ని సౌకర్యాలతో నిర్మించడం ద్వారా మోడల్ సిటీగా మారనుంది.
*కొల్లూరు మెగా డబుల్ బెడ్‌రూం కాలనీ విశేషాలు*
* 124 ఎకరాల్లో 15,660 డబుల్ బెడ్‌రూం ఇళ్లను రూ. 1354.59 కోట్ల వ్యయంంతో నిర్మాణం.
* ఒకొక్క ఇల్లు 580 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఎస్+9, ఎస్+10, ఎస్+11 అంతస్తులలో 117 బ్లాకుల్లో నిర్మాణం.
* ఒకొక్క ఇంటికి రూ. 7.90లక్షల వ్యయం. మరో 75వేల రూపాయలతో మౌలిక సుదుపాయల కల్పన.
కొల్లూరు డబుల్ బెడ్‌రూం కాలనీలో సౌకర్యాలు
* అంతర్గత సి.సి రోడ్లు, స్టార్మ్ వాటర్ డ్రైయిన్లు.
* మంచినీటి సరఫరా
* అంతర్గత డ్రైనేజీతో పాటు సీవరేజ్ ప్లాంటు (ఎస్.టి.పి) నిర్మాణం.
*వీధి విద్యుత్ దీపాలు.
* ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ ఏర్పాటు.
* కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం.
* కమ్యునిటీ కాంప్లెక్స్
* పాఠశాల, అంగన్‌వాడి కేంద్రాల ఏర్పాటు
* బస్టాప్, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, పెట్రోల్ బంక్ నిర్మాణం.
* వివిధ మతాల ప్రార్థనా కేంద్రాల ఏర్పాటు.
* షియల్ వాల్ సాంకేతిక పద్దతిలో నిర్మాణం.
* మొత్తం 15,660 డబుల్ బెడ్ రూమ్‌లు కలిపి 96,75,100 చదరపు అడుగుల విస్తీర్ణం.
* నిర్మాణం 15 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యం.
* ప్రతి బ్లాకుకు రెండు మెట్ల దారి. ప్రతి మెట్ల దారి 3మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం.
* ప్రతి బ్లాకుకు 8మందిని తీసుకెళ్లే కెపాసిటి కలిగిన రెండు లిఫ్టుల ఏర్పాటు.
*ప్రెస్‌నోట్: 2* ————————————————————————————————————— – *సీపీఆర్ఓ జీహెచ్ఎంసీ చే జారీచేయనైనది.**