eenadubusiness.com

ఆ వార్త చూసి షాకయ్యాను!: వైఎస్ జగన్

తన భార్య భారతిని నిందితురాలిగా చేరుస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చార్జ్ షీట్ ను దాఖలు చేసిందంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి షాకయ్యానని వైకాపా అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. చివరకు కుటుంబ సభ్యులను కూడా వదలని స్థాయికి రాజకీయాలు దిగజారడం చూస్తుంటే బాధనిపిస్తోందని జగన్ ట్వీట్ చేశారు. భారతీ సిమెంట్స్ కేసులో ఈడీ జగన్ సతీమణిని నిందితురాలిగా చేర్చిందంటూ ఈ ఉదయం వార్తలొచ్చిన సంగతి విదితమే. ఇదిలా ఉంచితే, అక్రమాస్తుల కేసు విచారణకు జగన్ ఈ ఉదయం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.