eenadubusiness.com

మ‌హా గ‌వ‌ర్న‌ర్‌, చీఫ్ జ‌స్టీస్‌ల‌కు మేయ‌ర్ గ్రీన్ ఛాలెంజ్‌

*గ్రీ*న్ ఛాలెంజ్‌లో భాగంగా న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ నేడు త‌న నివాసంలో కూతురు ఉషాశ్రీ తో క‌లిసి మొక్క‌లు నాటారు. మొక్క‌లు నాట‌డంతో పాటు మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆర్‌.విద్యాసాగ‌ర్‌రావు, తెలంగాణ‌, ఏపి హైకోర్టు చీఫ్ జ‌స్టీస్ రాధాకృష్ణ‌న్‌, సినీ న‌టి ద‌గ్గుపాటి రాణా, అల్లు అర్జున్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. మారెడ్డి శ్రీ‌నివాస్‌రెడ్డి విసిరిన‌ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా నేడు ఉద‌యం త‌న నివాసంలో మేయ‌ర్ రామ్మోహన్ మొక్క‌లు నాటారు. నాట‌డంతో పాటు వీటి ప‌రిర‌క్ష‌ణ‌కు కూడా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, ఈ సంద‌ర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో హరిత క‌వ‌రేజ్‌ను పెంపొందించ‌డానికి ప్ర‌స్తుత హ‌రిత‌హారంలో 40ల‌క్ష‌ల మొక్క‌ల‌ను నాట‌డంతో పాటు ఉచితంగా పంపిణీ చేప‌ట్టామ‌ని పేర్కొన్నారు