eenadubusiness.com

ప్రధాని మోదీతో తెలంగాణా సీఎం కేసీఆర్ భేటీ

మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. సుమారు గంట పాటు ఈ సమావేశం జరిగింది. కొత్త జోనల్ వ్యవస్థ, హైకోర్టు విభజన సహా పలు కీలక అంశాలపై చర్చించారు. హైకోర్టు విభజన, కాళేశ్వరానికి ఆర్థిక సాయం, రక్షణ భూముల కేటాయింపు సహా 10 అంశాలపై సీఎం కేసీఆర్ మోదీకీ వినతి పత్రాలు అందజేశారు. జిల్లాకో నవోదయ విద్యాలయం ఏర్పాటు, వేగంగా కొత్త రైల్వేలైన్ల నిర్మాణంపైనా విజ్ఞప్తి చేశారు. విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీని కోరారు. సీఎం వెంట రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.