eenadubusiness.com

[40] ఘనంగా బోనాలు ఉత్సవాన్ని నిర్వహించిన హెచ్ఎండిఎఉద్యోగులు

హైదరాబాద్ మహా నగర అభివృధ్ధి లో హెచ్ఎండఎ పాత్ర కీలకమని, ఉద్యోగులందరూ అందుకు అనుగుణంగా తమ నైపుణ్యాన్ని పెంచుకుని అకుంఠిత దీక్షతో పనిచేయాలని మెట్రోపాలిటన్ కమీషనర్ టి.చిరంజీవులు కోరారు.
తార్నాకా లోని కేంద్ర కార్యాలయంలో హెచ్ఎండీఎ తెలంగాణా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నేడిక్కడ ఘనంగా బోనాలు ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సంధర్భంగా ఉద్యోగులనుద్దేశించి మెట్రోపాలిటన్ కమీషనర్ మాట్లాడుతూ హెచ్ఎండీఎ కు పూర్వ వైభవాన్ని పునరిద్ధరించడంలో ఉద్యగులందరూ సమిష్ఠిగా కృషిచేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం కూడా హెచ్ఎండీఎ ఉద్యోగుల కృషిని గుర్తించి ఏ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వని విధంగా ఓ నెల జీతాన్ని బోనస్ గా ఇవ్వనుందని, త్వరలో మునిసిపల్ శాఖా మంత్రి కే.తారాక రామారావు ఉత్తమ ప్రతిభ కనబరచిన ఉద్యోగులను అభినందిస్తారని అన్నారు.
అలాగే ప్రత్యేక సంస్కృతీ సాంప్రదాయాలు కలిగి ఉన్న తెలంగాణాలో బతుకమ్మ మరియు బోనాలు ఉత్సవాలను వైభవంగా జరుగుకుంటామని మన సాంప్రదాయాలను కొనసాగించుకోవడం ఎంతైనా అవసరమని ఆయన అన్నారు. ప్రాచీనంతో పాటు ఆధునికత కూడా అవసరమని, మారుతున్న కాలంతో పాటు ఆధునిక ఐటి పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని పారదర్శకంగా పని చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని కోరారు. గత రేండున్నరేళ్ళలో హెచ్ఎండీఎ సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని పౌర సేవలందించడంలో హెచ్ఎండీఎ ఉద్యోగులందరూ ముందుండాలని హితవు పలికారు.
కార్యక్రమంలో బిజేపి నాయకుడు హిమాయత్ నగర్ ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి,తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పద్మాచారి, హెచ్ఎండీఎ తెలంగాణా ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కృష్ణ మూర్తి, కుమార స్వామి, హెచ్ఎండీఎ ఉన్నతాధికారులు అరుణ,శ్రీనివాస్, శరత్ చంద్ర,గంగాధర్, సుబ్రమణ్యం, జి.నరేంద్ర, శ్రీమతి రాజేశ్వరి, తదితరులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సంధర్భంగా, పోతరాజుల విన్యాసాలతో తీసిన బోనాల ఊరేగింపులో హెచ్ఎండీఎపాల్గొన్నారు.