దొడ్డిదారిన ఎస్టీ జాబితాలో చేరిన లంబాడాలను తొలగించాలంటు ఆదివాసీలు ‘సుప్రీం’ కోర్టులో వేసిన రిట్‌ను స్వీకరించడంతో ఆదివాసీల్లో ఆనందోత్సాహలు పెల్లుబికాయి. సోమవారం సుప్రీంకోర్టు ఆదివాసీలు వేసిన రిట్‌ను స్వీకరించడంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలకు తాఖీదులు జారీ చేయడం హర్షణీయమని ఆదివాసీ నాయకులు అర్క కమ్ము, సార్‌మెడి తుంరం జుగాధిరావు, తుడుం దెబ్బ మండల శాఖ అధ్యక్షుడు మెస్రం నాగ్‌నాథ్‌లు హర్షం వ్యక్తం చేశారు. ముత్నూర్‌లో ఆదివాసీలు గ్రామ పటేల్ హెరకుంర్ర జంగు ఇంటినుంచి డోలు వాయిస్తు, లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని నినాదాలు చేశారు. గ్రామంలోని కుమురం భీం విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి భీంకు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీలు టపాసులను కాల్చారు.