eenadubusiness.com

ప‌ద‌వీవిర‌మ‌ణ చేసిన ఉద్యోగుల‌కు స‌త్క‌రించి వీడ్కోలు

జీహెచ్ఎంసీలో నేడు ప‌ద‌వీవిర‌మ‌ణ చేసిన 24మంది ఉద్యోగుల‌కు క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి ఘ‌నంగా స‌త్క‌రించి వీడ్కోలు జ‌రిపారు. నేడు ప‌ద‌వీవిర‌మ‌ణ చెందినవారిలో అసిస్టెంట్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ స్థాయి నుండి 4వ త‌ర‌గ‌తి ఉద్యోగుల వ‌ర‌కు ఉన్నారు. ఈ ప‌ద‌వీవిర‌మ‌ణ వీడ్కోలు స‌మావేశంలో అద‌న‌పు క‌మిష‌న‌ర్ సి.ఎన్‌.ర‌ఘుప్ర‌సాద్‌, సీపీఆర్ఓ వెంక‌ట‌ర‌మ‌ణ‌, జాయింట్ క‌మిష‌న‌ర్ స‌త్య‌నారాయ‌ణ‌లు పాల్గొన్నారు.