బలవంతపు భూసేకరణను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. రైతులు ఇస్తేనే ప్రభుత్వం భూములు తీసుకోవాలని సూచించారు. వైజాగ్ స్టీల్ ప్లాంటుకు భూములు ఇచ్చిన రైతులు నేటికీ పరిహారం కోసం ఎదురు చూస్తున్నారని విమర్శించారు. రైతులకు ఇష్టం లేకుండా భూములు తీసుకుంటే వారికి అండగా ఉండి పోరాటం చేస్తానని చెప్పారు. భూములను కొద్దిమంది చేతుల్లో పెట్టడాన్ని జనసేన వ్యతిరేకిస్తుందని పవన్ చెప్పారు. అవసరానికి మించి భూములు తీసుకోవద్దన్నారు. అసైన్డ్ భూములకూ భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవసరానికి మించి రాజధాని కోసం భూసేకరణ జరుగుతోందన్నారు. భూసేకరణ చేస్తారని ఎన్నికలకు ముందు తెలిస్తే నేను వేరేలా ఉండేవాడినని పవన్ చెప్పారు. మద్దతిచ్చేవాడిని కాదన్నారు.
అభివృద్ధికి వ్యతిరేకమని తెలిస్తే తాను టిడిపికి మద్దతు ఇచ్చి ఉండేవాడిని కాదని పవన్ అన్నారు. భూసేకరణ చేస్తే ఎదురు తిరగండని రైతులకు సూచించారు. భూసేకరణ జరిగితే చెప్పండని, మీతో కలిసి నేను కూడా ఆందోళన చేస్తానని చెప్పారు. భూములు లాక్కోవడానికి చూస్తే నేను ప్రాణాలు ఇచ్చేందుకు ముందు ఉంటానని తెలిపారు. అవసరానికి మించి భూమిని తీసుకుంటే జనసేన ముందుండి పోరాడుతుందన్నారు. పంట భూములను బీడు భూములుగా చూపడం సరికాదని పవన్ అన్నారు. పోలీసులను, అధికారులను మనం నెగిటివ్‌గా చూడవద్దని రైతులకు సూచించారు. వాళ్లు ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసేవారు మాత్రమే అన్నారు. కొందరి చావులు, ఏడుపులతో రాజధాని వద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. రైతుల అభివృద్ధికి అడ్డంకి కాదని, కానీ రైతులను ఏడిపించిన వారు నాశనం అవుతారన్నారు. భూములను నాశనం చేస్తే సర్వనాశనం అవుతారని మండిపడ్డారు.
ప్రభుత్వాలు భూదాహాలను తగ్గించుకోవాలని పవన్ అన్నారు. సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళ్లడాన్ని జనసేన సహించదని చెప్పారు. రాజ్యాంగం అందరికీ సమానమని, ఎవరూ.. ఎవరికీ బానిసలు కాదన్నారు. రైతులు వాళ్ల భూముల్లోకి రావడానికి ఆధార్ కార్డులను చూపించాలనడం దారుణం అన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని, అండగా ఉంటానని చెప్పారు. పోలీసుల తూటాకు ముందు నా గుండె చూపుతానని చెప్పారు. నేను మీకు రెండు మూడు గంటల దూరంలోనే ఉంటానని చెప్పారు. ‘అమ్మా మీరు ప్రశాంతంగా నిదుర పోండి, మీకు అన్యాయం జరిగితే నేను వస్తాను, మహా అయితే 3-4 గంటల దూరంలో ఉంటాను’ అని పవన్ అన్నారు.
????????? ??? ????????? ???????? ???? ?????? ??????????