వరుసగా నాల్గవ సంవత్సరం ప్రదర్శనకు ప్రత్యేక భాగస్వామి అయిన సెంచురీ మ్యాట్రెసెస్
భారతదేశంలో 35 సంవత్సరాలకు పైగా స్లీప్ సొల్యూషన్స్ పరిశ్రమలో విశ్వసనీయయతకు మారుపేరయిన సెంచురీ మ్యాట్రెస్,బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కోసం తన ప్రత్యేక భాగస్వామి స్పాన్సర్‌షిప్‌ను ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. వరుసగా నాల్గవ సంవత్సరం తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరుస్తూ, టాప్-టైర్ స్లీపింగ్ సొల్యూషన్స్ మరియు ప్రీమియం-క్వాలిటీ మ్యాట్రెస్‌లను డెలివరీ చేస్తున్నప్పుడు ప్రేక్షకులలో బ్రాండ్ గుర్తింపు పొందాలనే లక్ష్యం కలిగి ఉంది.
గతంలో బిగ్ బాస్ సీజన్‌లను స్పాన్సర్ చేసిన ఈ సహకారం వల్ల, సెంచురీ మ్యాట్రెస్, హైదరాబాద్ మార్కెట్‌లో బ్రాండ్ రీకాల్‌లో గణనీయమైన పెరుగుదలను సాధించింది. ప్రస్తుత స్పాన్సర్‌షిప్ ఏర్పాటు అనేది, బిగ్ బాస్ తెలుగు ఫ్రాంచైజీకి సెంచురీ మ్యాట్రెస్ యొక్క నిబద్ధతను మరియు కస్టమర్‌లకు సుఖనిద్ర అనుభవాలను అందించడంలో దాని అంకితభావాన్ని పటిష్టం చేసే దీర్ఘకాలికసాంగత్యముగా నిలిచించి. అదనంగా, ఈ సీజన్‌లో, సెంచురీ మ్యాట్రెస్, పి.వి.సింధు గారిచే టి.వి.సి.ప్రచారాన్ని ఆవిష్కరిస్తోంది, ఇది దాని సృజనాత్మక ప్రకటనల చిత్రానికి విమర్శకుల నుండి గణనీయమైన ప్రశంసలను పొందింది. ఈ ప్రచారం కాపర్-ఇన్ఫ్యూజ్డ్ నిద్ర వలన కలిగే ప్రయోజనాలను నొక్కి చెబుతుంది, మెరుగైన నిద్ర మనయొక్క పనితీరును మెరుగుపరుస్తుందని హైలైట్ చేస్తుంది.
సెంచురీ మ్యాట్రెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఉత్తమ్ మలాని గారు, మాట్లాడుతూ, “గత సీజన్‌లో, బిగ్ బాస్‌తో మా మునుపటి సహకారం గణనీయమైన ప్రయోజనాలను అందించింది. మేము మా ప్రారంభ భాగస్వామ్యం యొక్క సానుకూల ఫలితాల ఆధారంగా ప్రస్తుత సీజన్ కోసం మా స్పాన్సర్‌షిప్‌ను పునరుద్ధరించాము. ఈ పునరుద్ధరించబడిన అసోసియేషన్ ద్వారా, మేము మరింత గొప్ప బ్రాండ్ రీకాల్ రేట్లను సాధించడం మరియు వాటిని పెరిగిన ఆదాయం మరియు వృద్ధి అవకాశాలుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నాము´ అని అన్నారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని 400 అవుట్‌లెట్‌లు మరియు 200 బ్రాండ్ స్టోర్‌ల నుండి మరియు భారతదేశం అంతటా 4500+ బహుళ బ్రాండ్ డీలర్‌లలో సెంచురీ మ్యాట్రెస్ తన ఉనికిని కలిగి ఉంది. 2025 నాటికి తన ఉనికిని కనీసం 100 ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.