పేటీఎం, భారతదేశపు ప్రముఖ చెల్లింపులు మరియు ఆర్థిక సేవల సంస్థ మరియు QR, సౌండ్‌బాక్స్ మరియు మొబైల్ చెల్లింపుల మార్గదర్శకుడు, భారతదేశ వ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలను అందుబాటులోకి తెచ్చి ఇన్-స్టోర్ చెల్లింపులలో అగ్రగామిగా తన స్థానాన్ని పదిలపరుచుకుంటూనే ఉంది. పేటీఎం పయనీర్డ్ సౌండ్‌బాక్స్ అనేది ఒక వినూత్న ఆడియో డివైజ్, ఇది పేటీఎం QR ద్వారా స్వీకరించబడిన ప్రతి చెల్లింపు సమయంలో తక్షణ వాయిస్ నోటిఫికేషన్‌లతో వ్యాపారులకు సహాయపడుతుంది, ఉదాహరణకు పేటీఎం QR ద్వారారూ. 20 స్వీకరించినట్లైతే ‘పేటీఎంలో రూ. 20 వచ్చింది’ వంటి నోటిఫికేషన్‌ను పొందుతారు.
ప్రస్తుతం, ఈ డివైజ్ తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ, మరాఠీ, మలయాళం, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ మరియు ఒడియా వంటి 10భాషలలో నోటిఫికేషన్‌లనుఅందిస్తుంది. ఇది చెల్లింపులను ట్రాక్ చేయడానికి వ్యాపారులను తోడ్పడుతుంది మరియు తప్పుడు నిర్ధారణలు మరియు కస్టమర్ మోసాన్ని నిరోధిస్తుంది.
ఇన్-స్టోర్ చెల్లింపులలో తన నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ, పేటీఎం ఇటీవల వ్యాపారుల కోసం రెండు కొత్త డివైజులు–పేటీఎం పాకెట్ సౌండ్‌బాక్స్ మరియు పేటీఎం మ్యూజిక్ సౌండ్‌బాక్సులను ప్రారంభించి, చిన్న దుకాణాలకు సాంకేతికతను అందించాయి. భారతదేశంలో తయారు చేయబడిన, పేటీఎం ఆల్-ఇన్-వన్ పాకెట్ సౌండ్‌బాక్స్ అనేది నిరంతరం తిరుగుతూ ఉండే వ్యాపారుల కోసం మొట్టమొదటి డివైజ్. మరో తెలివిగల స్వదేశీ డివైజ్, పేటీఎంమ్యూజిక్ సౌండ్‌బాక్స్ వ్యాపారాన్ని వినోదంతో మిళితం చేస్తుంది.
పేటీఎం సౌండ్‌బాక్స్‌ని ఎలా ఆర్డర్ చేయాలి?
- బిజినెస్ యాప్ కోసం పేటీఎంతెరిచి, సౌండ్‌బాక్స్ విభాగానికి వెళ్లండి
- తాజా డివైజ్ ఎంపిక కోసం శోధించి, దానిపై క్లిక్ చేయండి
- అభ్యర్థన ఫారంను పూరించండి మరియు తగిన ఉత్పత్తి వెర్షన్ కోసం ఆర్డర్ చేయండి
- సౌండ్‌బాక్స్ త్వరలో మీ ఇంటి వద్దకే డెలివరీ చేయబడుతుంది
పేటీఎం సౌండ్‌బాక్స్‌ని ఎలా ఆపరేట్ చేయాలి?
- డివైజ్ యొక్క ఎడమ వైపున రబ్బరు హాచ్‌ని తెరవడం ద్వారా బాక్స్‌తో అందుకున్న SIM కార్డ్‌ని ఇన్‌సర్ట్ చేయండి
- లైట్ ఇండికేటర్ ఎరుపు మరియు నీలం రంగులోకి మార్చడానికి పవర్ బటన్‌ను ఎక్కువసేపు నొక్కండి
- చెల్లింపులను ఆమోదించడానికి డివైజ్ యాక్టివేట్ చేయబడుతుంది
- సహాయం కోసం మాన్యువల్లో అందించిన యాక్టివేషన్ సూచనలను అనుసరించండి
PM నరేంద్ర మోడీ యొక్క ‘మేక్ ఇన్ ఇండియా’ విజన్‌ని ముందుకు తీసుకెళ్తూ, పేటీఎంయొక్క సౌండ్‌బాక్స్ 100% దేశీయంగా అభివృద్ధి చేయబడింది. సౌండ్‌బాక్స్‌తో సహా పేటీఎంచెల్లింపు పరిష్కారాలను విస్తృతంగా స్వీకరించడం వల్ల భారతదేశంలో మొబైల్ చెల్లింపులకు పేటీఎంపర్యాయపదంగా మారింది.