eenadubusiness.com

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 10 మిలియన్ల మంది  బస్సు ప్రయాణాన్ని ఎంచుకున్నారు: అభిబస్ వెల్లడి

భారతదేశంలోని ప్రముఖ ఆన్‌లైన్ బస్-టికెటింగ్ ప్లాట్‌ఫామ్ అభిబస్, ఈ పొడిగించిన స్వాతంత్ర్య దినోత్సవ వారాంతంలో బస్సు ప్రయాణంలో ఆశ్చర్యకరమైన పెరుగుదలను చూసింది. దాదాపు 10 మిలియన్ల మంది ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి బస్సులను ఎంచుకున్నారు. ఈ పీక్ ట్రావెల్ సీజన్‌లో అధిక విమాన ప్రయాణ ఖర్చులు, రైలు టిక్కెట్ల పరిమిత లభ్యత వంటి అంశాల కలయిక వల్ల బస్సు ప్రయాణంలో పెరుగుదల ఎక్కువగా చోటుచేసుకుంది. ఉదాహరణకు, ఆగస్టు 15వ తేదీన హైదరాబాద్ నుండి గోవాకు రౌండ్-ట్రిప్ రైలు టిక్కెట్ల ధర సుమారుగా రూ. 10,000 ఉండగా, బస్సు ప్రయాణికులు అదే గమ్యస్థానానికి దాదాపు రూ. 2,000లకు చేరుకోవచ్చు. ఈ అంశం బస్సు ప్రయాణాన్ని మరింత పొదుపైంది గా ఎంపిక చేస్తుంది.

హైదరాబాద్ – బెంగుళూరు, హైదరాబాద్ – గోవా, బెంగుళూరు – చెన్నై, చెన్నై – కోయంబత్తూర్, లక్నో – దిల్లీ, దిల్లీ – డెహ్రాడూన్ వంటి ప్రధాన నగరాలను కలిపే వాటితో సహా ప్రముఖ మార్గాలలో బస్సు ప్రయాణంలో పెరుగుదల  గణనీయంగా చోటు చేసుకుంది. అంతేగాకుండా, పొడిగించిన వారాంతంలో ఇతర మార్గాలలో గణనీయమైన 30% వృద్ధి కనిపించింది.

ఈ స్వాతంత్ర్య దినోత్సవ వారాంతంలో ఇంత భారీ సంఖ్యలో ప్రయాణాలను సులభతరం చేసినందుకు మేం సంతోషిస్తున్నాం. బస్సు ప్రయాణం సౌలభ్యం, అందుబాటు ధర, లభ్యత దీనిని సాధ్యం చేయడంలో కీలక పాత్ర పోషించాయి” అని అభిబస్ సీఓఓ రోహిత్ శర్మ తెలిపారు. “అక్టోబర్ – నవంబర్ నెలల్లో రాబోయే పండుగ సందర్భాలలో ఇలాంటి ధోరణులు వస్తాయని మేం ఎదురు చూస్తున్నాం” అని అన్నారు.

77వ స్వాతంత్ర్య దినోత్సవ వారాంతం  మిలియన్ల మంది భారతీయులకు బస్సు ప్రయాణం పట్ల గల శాశ్వత  ఆకర్షణను కనబర్చింది. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్న, సమర్థవంతమైన రవాణా విధానాన్ని అందిస్తుంది. ప్రయాణ రంగం అభివృద్ధి చెందుతూనే ఉన్నందున, అభిబస్ తిరుగులేని ప్రయాణ అనుభవాలను అందించడానికి కట్టుబడి ఉంది. కొత్త గమ్యస్థానాలను సులభంగా అన్వేషించడానికి ప్రయాణీకులను శక్తివంతం చేస్తుంది.

2008లో స్థాపించబడిన అభిబస్ వివిధ బస్సు సర్వీసుల కోసం భారతదేశంలోని ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ ఫామ్‌లలో ఒకటిగా అవతరించడంలో విజయం సాధించింది. ixigo గ్రూప్‌లో భాగమైన కంపెనీ బస్ టిక్కెట్ బుకింగ్ విభాగంలో మార్కెట్ వాటా పరంగా రెండవ అతిపెద్ద సంస్థగా ఉంది.