ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతో టీమ్ లీజ్ ఎడ్ టెక్ భాగస్వామ్యం
ఆంధ్రప్రదేశ్, నవంబర్ 2022 : ఆంధ్రప్రదేశ్ లో ఎంతగానో ప్రసిద్ధి చెందిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్ యు) తన దూరవిద్య విద్యార్థులకు సాంకేతిక ఆధారిత విద్యాభ్యాసం, ఉపాధి పొందడంలో నాణ్యతకు సంబంధించిన సేవలను అందించేందుకు టీమ్ లీజ్ ఎడ్ టెక్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. భవిష్యత్ కు సన్నద్ధంగా ఉండేలా, ఉపాధి పొందడంలో పోటీదాయకతను అలవర్చుకునేందుకు వీలుగా అవసరమైన డిజిటల్ నైపుణ్యాలను పొందేందుకు విద్యార్థులను సిద్ధం చేయడం యూనివర్సిటీ లక్ష్యం.
ఈ భాగస్వామ్యంలో భాగంగా యూనివర్సిటీకి చెందిన సిడిఇ (సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్) విద్యార్థులు ఆన్ లైన్ లెర్నింగ్ మొబైల్ అప్లికేషన్ కు యాక్సెస్ పొందగలుగుతారు. ఈ మొబైల్ యాప్ రీడింగ్ మెటీరియల్, యూనివర్సిటీ ప్రొఫెసర్ల ప్రి- రికార్డెడ్ వీడియోలు, సెల్ఫ్ అసెస్ మెంట్ టెస్ట్స్ లతో కూడిన డిజిటైజ్డ్ వెర్షన్ ను కలిగిఉంటుంది. ఏవైనా సందేహాలు ఉన్న పక్షంలో ఫ్యాకల్టీని సంప్రదించే అవకాశం కూడా ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా విద్యార్థులు యూనివర్సిటీ ఫ్యాకల్టీతో లైవ్ సెషన్స్ లో కూడా పాల్గొనవ చ్చు.
విద్యార్థులకు సపోర్ట్ సర్వీసెస్ అందించేందుకు గాను టీమ్ లీజ్ ఎడ్ టెక్ భాగస్వామ్యంతో యూనివర్సిటీ ఒక ప్రత్యేక కాల్ సెంటర్ ను కూడా నెలకొల్పనుంది. యూజీసీ సిఫారసు చేసిన 4 క్వాడ్రంట్ అప్రోచ్ ప్రకా రం, ప్రపంచస్థాయి అభ్యసన అనుభూతిని విద్యార్థులకు అందించేందుకు అధిక నాణ్యమైన ఆడియో-విజువల్ కంటెంట్ ను రూపొందించే ప్రక్రియను కూడా యూనివర్సిటీ చేపట్టింది. ఈ భాగస్వామ్యంతో యూనివర్సిటీ, తన సీడీఈ విద్యార్థులకు అప్రెంటిష్ షిప్, ఉపాధి అవకాశాలను కూడా అందించాలని భావిస్తోంది.
ఈ సందర్భంగా టీమ్ లీజ్ ఎడ్ టెక్ వ్యవస్థాపకులు, సీఈఓ శంతను రూజ్ మాట్లాడుతూ, ‘‘ఎఎన్ యు వంటి యూనివర్సిటీతో అనుబంధం మాకెంతో గర్వకారణం. ‘‘యూనివర్సిటీ దూర విద్య విద్యార్థులకు మేం సాంకేతిక సేవలు, ఉపాధి అవకాశాలు అందిస్తాం. దేశంలో దూరవిద్యకు సంబంధించి నూతన ప్రమాణాలు నెలకొల్పడంలో యూనివర్సిటీకి తోడ్పడుతాం’’ అని అన్నారు.
విశ్వవిద్యాలయంఉపాధ్యక్షులుప్రొఫెసర్రాజశేఖర్పాట్టేటిఈసందర్భంగామాట్లాడుతూ, అత్యున్నతస్థాయివిద్యనుఅందించడం, విజయవంతమైనకెరీర్కు, భవిష్యత్ఉద్యోగాలకుసన్నద్ధులుగాచేసేనైపుణ్యాలనుఅందించడమేఎప్పుడూఆచార్యనాగార్జునయూనివర్సిటీఏకైకలక్ష్యంగాఉంటోంది’’ అనిఅన్నారు.
యూనివర్సిటీ సీడీఈ డైరెక్టర్ డాక్టర్ నాగరాజు భట్టు మాట్లాడుతూ, ‘‘అందరికీ విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఈ ఆశయ సాధనలో టీమ్ లీజ్ ఎడ్ టెక్ తో భాగస్వామ్యం మాకెంతో ఆనందదాయకం’’ అని అన్నారు.