eenadubusiness.com

ఫనాటిక్స్ తన హైదరాబాద్ ఆఫీస్ లో 100 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోనుంది


హైదరాబాద్ కార్యాలయంలో చేర్చుకునే 100 మంది ఐటీ నిపుణుల్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ప్రోడక్ట్ మేనేజర్లు, ఆన్ లైన్ ప్రొడక్షన్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ లు ఉంటారు
హైదరాబాద్ లోని ఒక ప్రైమ్ లొకేషన్ లో నూతన, ఆధునిక, అప్ గ్రేడ్ చేయబడిన కార్యాలయం
కొత్త గా నియమితులయ్యే వారికి స్వాగతం పలుకనుంది

అగ్రగామి అంతర్జాతీయ డిజిటల్ స్పోర్ట్స్ వేదిక ఫనాటిక్స్ 2022లో భారత దేశంలోని హైదరాబాద్ కార్యాలయం కోసం తన టెక్ వర్టికల్ లో సుమారుగా 100 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోనుంది. భారతదేశంలో ఫనాటిక్స్ ఒకే ఒక ఉద్యోగితో 2018లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. 2022 చివరి నాటికి హైదరాబాద్ లో సంస్థ కోసం 250 మంది పని చేసేలా చూసుకోవాలని భావిస్తోంది. విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా ఫనాటిక్స్ తన వర్క్ స్పేస్ ను కూడా అప్ గ్రేడ్ చేసింది. నగరంలోనే మరింత విశాలమైన, మెరుగైన ప్రాంతానికి మారింది. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో సాలార్ పురియా సత్వ నాలెడ్జ్ సిటీ పార్క్ కాంప్లెక్స్ లో ఎనిమిదో అంతస్తులో నూతన కార్యాలయానికి మారినది. దేశం నలుమూలల నుంచి నిపుణులను చేర్చుకోవడం ద్వారా తన సాంకేతిక సామర్థ్యాలను పటిష్ఠం చేసుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం ఫనాటిక్స్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ప్రోడక్ట్ మేనేజర్లకు సంబంధించి వివిధ టెక్ ఉద్యోగాలను అందిస్తోంది. ఈ డిజిటల్ స్పోర్ట్స్ ప్లాట్ ఫామ్ జూనియర్ మొదలుకొని సీనియర్ లెవల్ పొజిషన్స్, టెక్నికల్ ప్రోడక్ట్ మేనేజ ర్లు, ఆన్లైన్ ప్రొడక్షన్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ లను క్యాంపస్ ప్లేస్ మెంట్, వర్చువల్ హైరింగ్ ప్రక్రియ ద్వారా నియమించుకోనుంది. కంపెనీ సరళమైన హైరింగ్ ప్రక్రియలను అనుసరిస్తూ, నిపుణులైన టెక్ సిబ్బందిని దేశం నలుమూలల నుంచి తీసుకోనుంది. హైదరాబాద్ లో అధిక సంఖ్యలో ఐటీ నిపుణులు ఉన్నందున అది కంపె నీ నియామకాలకు ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటిగా ఉండనుంది.
నూతన, ఆధునిక వర్క్ స్టేషన్ హైదరాబాద్ లోని నూతన భవనంలో ఎన్నో వసతులతో నెలకొంది. నిపుణు లైన టెక్ సిబ్బంది బృందాలకు అవసరమైన సదుపాయాలతో కూడి ఉంటుంది. అత్యాధునిక ఏవీ ఫిట్టింగ్స్, మల్టీపర్పస్ ట్రైనింగ్ రూమ్స్, మోడిష్ బ్రేక్ రూమ్స్ ఉన్నాయి. ఎక్స్ పాన్సివ్ కొలాబొరేటివ్ ఏరియా, టెక్ టూ ల్స్ కలగలసి పాప్ అప్ మీటింగ్స్ ను ఎంతో సౌకర్యవంతమైనవిగా చేస్తాయి. కార్యాలయం నలుమూలల
నుంచి హైదరాబాద్ నగర అందాలను వీక్షించడం వర్క్ బ్రేక్స్ అనుభూతిని మరింత మెరగుపరుస్తుంది.
ఈ సందర్భంగా ఫనాటిక్స్ ఇండియా – జీఎం, అనిల్ గురిజాల మాట్లాడుతూ, ‘‘మా వినూత్న, అధునాతన టెక్ ప్లాట్ ఫామ్ ద్వారా మేం రేపటి తరపు డిజిటల్ స్పోర్ట్స్ ప్లాట్ ఫామ్ ను నిర్మిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా క్రీడాభి మానులకు ఎన్నో రకాల ఉత్పాదనలు, సేవలను అందించేందుకు అది మాకు వీలు కల్పిస్తుంది. మా సేవలను విస్తరించేందుకు, మా ఈకో సిస్టమ్ ను మరింతగా వృద్ధి చేసేందుక మేం టెక్ నిపుణులతో కూడిన పటిష్ఠ జట్టు ను ఏర్పరచుకుంటున్నాం. అన్ని స్థాయిల్లో నియామకాలు చేపడుతూ, వారికి వృద్ధి అవకాశాలను అందించనున్నాం. రాబోయే కాలం మాకెంతో ఉజ్వలంగా ఉండనుంది. కంపెనీలో వృద్ధి చెందుతున్న బృందం మా వినూత్న సాంకేతిక మౌలికవసతులను పెంచుతూ అంతర్జాతీయ టెక్ సంస్థలకు దీటుగా పని చేయనుంది’’ అని అన్నారు.
ఫనాటిక్స్ దేశవ్యాప్తంగా ఐటీ నిపుణులకు నాణ్యమైన అవకాశాలను అందించనుంది. అంతర్జాతీయ స్థాయి ఎక్స్పోజర్ కు అది వాగ్దానం చేస్తుంది. అదే సమయంలో ఈ సంస్థ తన కార్యకలాపాల సామర్థ్యాలను మెరుగు పరుచుకునేందుకు ఏటా అంతర్జాతీయంగా వందల మిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చించనుంది.
ఫనాటిక్స్ 2018లో ఏర్పడిన హైదరాబాద్ బృందం అనేక రెట్లుగా వృద్ధి చెందింది. హైదరాబాద్ లోని ఇండియా టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ లో ప్రస్తుతం 170 మంది సిబ్బంది పని చేస్తున్నారు. రాబోయే రెండేళ్లకు కంపెనీ వృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా నియామక ప్రక్రియ ఉండనుంది. కంపెనీ వృద్ధిలో భారతీయ జట్టు ప్రయత్నాలు కీలకపాత్ర వహించాయి.
2018లో హైదరాబాద్ లో కార్యాలయం నెలకొల్పడం ద్వారా భారతదేశంలో వేళ్లూనుకున్న సంస్థ పటిష్ఠ వృద్ధి ని సాధించింది. ఫనాటిక్స్ ప్రస్తుతం దీని అధునాతన టెక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను బలోపేతం చేసేందుకు నిర్విరా మంగా కృషి చేస్తున్న పటిష్ఠ బృందాన్ని కలిగిఉంది.