eenadubusiness.com

రిఫ్రెష్డ్ బ్రాండ్ ఐడెంటిటీని ఆవిష్కరించిన ఎక్స్ ట్రా మార్క్స్

‘ఎక్స్ ట్రా మార్క్స్ – ది లెర్నింగ్ యాప్’ తో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ వేదికగా తన స్థానం పటిష్ఠం చేసుకునే ప్రయత్నం


‘ ‘ఇన్ – స్కూల్’, ‘ఆఫ్టర్ – స్కూల్’ డిజిటల్ లెర్నింగ్ స్థితిగతులకు అనుగుణంగా కంప్లీట్ లెర్నింగ్ సొల్యూషన్స్’ అందించాలన్న తన ఉద్దేశాన్ని విస్తరించడానికి విజువల్ ఉనికి రీఇమేజిన్
విద్యాత్మక కోర్సుల అన్ని విభాగాలను కవర్ చేసేందుకు వీలుగా కె12, జెఇఇ, నీట్ యాప్స్ కూడా ‘ఎక్స్ ట్రా మార్క్స్ – ది లెర్నింగ్ యాప్’ తో సమ్మిళితం


భారతదేశ అత్యంత విశ్వసనీయ ఎడ్ టెక్ అగ్రగామి అయిన ఎక్స్ ట్రా మా ర్క్స్ తన నూతన లోగో, విజువల్ ఐడెంటిటీ, కేటగిరీ పొజిషనింగ్ లను నేడిక్కడ ఆవిష్కరించింది. బ్రాండింగ్ లో నూతన విజువల్ అసెట్స్ కీలకంగా ఉన్నాయి. నూతనంగా రూపొందించిన లోగో లాంటివి వీటిలో ఉ న్నాయి. వన్ – స్టాప్ లెర్నింగ్ యాప్ సొల్యూషన్ – అనేది ఎక్స్ ట్రా మార్క్స్ విలువలైన – ఫన్ ఎంగేజిం గ్, ఇంటిగ్రేటెడ్, ఇంక్లూజివ్ లను – డిజిటల్ లెర్నింగ్ కు ఆధునిక ధోరణితో ప్రతిబింబిస్తుంది. ఈ నూతన బ్రాండింగ్ ఇప్పటికే అన్ని అంతర్గత, బహిర్గత కమ్యూనికేషన్ విధానాల్లో అమలైంది. ‘ది లెర్నింగ్ యాప్’ తాజా వెర్షన్ ఐఒఎస్, ఆండ్రాయిడ్ ఉపకరణాల యూజర్లకు లభ్యమవుతుంది.

విమానం మాదిరిగా లోగో కొత్త అవతారం మరింత వ్యక్తిగతీకృత, సృజనాత్మక, సంపూర్ణ అభ్యసన అను భూతి ద్వారా విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల కలలు నిజం చేసేందుకు తోడ్పడాలన్న బ్రాండ్ ఆకాం క్షను ప్రతిబింబిస్తుంది. ఈ బ్రాండ్ కలర్ స్కీమ్ ఇప్పుడు మరింత గాఢమైన నారింజరంగుతో ఉంటుంది. నేర్చుకోవడం పట్ల పిల్లల్లో ఉత్సుకతను రేకెత్తించడం, నూతన భావనల పట్ల వారి మక్కువ లాంటివాటిని ప్రతిఫలిస్తుంది.

ఈ సందర్భంగా ఎక్స్ట్రామార్క్స్ సీఈఓ రిత్విక్ కుల్శ్రేష్ఠ మాట్లాడుతూ, ‘‘మహమ్మారి ప్రారంభం నేప థ్యంలో యావత్ ఎడ్ టెక్ విభాగం మరింతగా పరిణామం చెందింది. నూతన తరం విద్యార్థులను ఆకర్షిం చింది. మారుతున్న మార్పులకు అనుగుణంగా పరిణామం చెందే అవకాశాన్ని ఇది మాకు అందించింది. చేకూర్పు, సహజంగానే ఉండే నేర్చుకునే నైపుణ్యం, సమగ్ర టెక్ ఎనేబుల్డ్ లెర్నింగ్ సొల్యూషన్స్ ను వృద్ధి చేసేందుకు ఎక్స్ ట్రా మార్క్స్ కు గల కట్టుబాటును ఇది పునరుద్ఘాటిస్తుంది. మా నూతన ఐడెంటిటీ అనేది నేర్చుకోవడం పట్ల విద్యార్థికి గల అభిరుచి, నూతన భావనల పట్ల గల మక్కులను ప్రతిబింబిస్తుంది. మా లోగోను, ది లెర్నింగ్ యాప్ ను రీబూట్ చేయడం అనేది అన్ని వయస్సుల విద్యార్థులకు మేం అందించే విలువను స్పష్టంగా ప్రతిఫలిస్తుంది – సృజనాత్మకంగా, బహుముఖంగా, భవిష్యత్ సన్నద్ధకంగా, ఆధుని కంగా అది ఉంటుంది’’ అని అన్నారు.