eenadubusiness.com

తానా సాహిత్య సమావేశంలో ఉపకులపతులు

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జూన్‌ 27న జరిగిన వర్చువల్‌  సమావేశంలో ‘‘ఉభయ తెలుగు రాష్ట్రేతర విశ్వవిద్యాలయాలలో తెలుగు భాష, సాహిత్య, పరిశోధనా విజ్ఞాన సదస్సు విజయవంతంగా జరిగింది. ఇందులో పలువురు విశ్వవిద్యాలయాల కులపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తానా అధ్యక్షులు జయశేఖర్‌ తాళ్లూరి తెలుగు భాష, సాహిత్య పరిరక్షణ, పర్వ్యాప్తి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర సంస్థలతో, విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయడానికి తానా ఎల్లప్పుడూ ముందువరుసలో ఉంటుందని పేర్కొన్నారు.  తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్‌ తోటకూర, మైసూరు విశ్వవిద్యాలయం, మైసూరు  పూర్వ తెలుగు శాఖాసంచాలకులు ఆచార్య డా. ఆర్‌.వి.ఎస్‌. సుందరం, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, నెల్లూరు యోజన నిర్దేశకులు ఆచార్య డా. దిగుమర్తి మునిరత్నం నాయుడు, మద్రాస్‌ విశ్వవిద్యాలయం, చెన్నై తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య డా. విస్తాలి శంకర్‌ రావు, ఆలిఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయం, ఆలిఘర్‌ తెలుగు శాఖాధ్యక్షులు సహాయ ఆచార్యులు డా. పటాన్‌ ఖాసిం ఖాన్‌, మధురై కామరాజ్‌ విశ్వవిద్యాలయం, మధురై  తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య డా. జొన్నలగడ్డ వెంకట రమణ, బెంగళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు  తెలుగు శాఖాధ్యక్షురాలు ఆచార్య డా. కొలకలూరి ఆశాజ్యోతి, ఢల్లీి విశ్వవిద్యాలయం, న్యూఢల్లీి తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య డా. గంప వెంకట రామయ్య కర్ణాటక రాజ్య సార్వత్రిక విశ్వవిద్యాలయం, మైసూరు తెలుగు శాఖాధిపతి ఆచార్య డా. మొగరాల రామనాథం నాయుడు బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి తెలుగు శాఖాచార్యులు ఆచార్య డా. భమిడిపాటి విశ్వనాథ్‌  తదితరులు ఇందులో ప్రసంగించారు. హాస్యావధాని, ప్రముఖ పాత్రికేయులు హాస్య బ్రహ్మ డా. టి. శంకర నారాయణ  తన హాస్య ప్రసంగం చేశారు.