eenadubusiness.com

సినారెకు ఘన నివాళులు

మహాకవి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డికి పలువురు ప్రముఖులు, ఎన్నారైలు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన కవిత్వం అజరామరమైనదని ఈ సందర్భంగా వక్తలు శ్లాఘించారు. డా సినారె 4వ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ సారస్వత పరిషత్తు, వంశీ – డా సినారె విజ్ఞాన పీఠం, కేతవరపు పౌండేషన్‌, సంతోషం ఫిలిం న్యూస్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన అంతర్జాల సదస్సులో సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి  అధ్యక్షోపన్యాసం చేస్తూ.. డా సినారె పండితులలో పండితుడు, కవులకే కవి, పరిశోధకులకే పరిశోధకుడు అన్నారు.. సినారె శబ్ద పుష్టి, శబ్ద సిద్ధి అనితర సాధ్యమని తెలిపారు. తెలుగు సాహిత్యాన్ని బోధించడంలో ఆయన ఆదర్శప్రాయులని అన్నారు. సారస్వత పరిషత్తు అధ్యక్షునిగా పరిషత్తును పునరుజ్జీవింప చేశారు. డల్లాస్‌లో ఉన్న ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్‌ శ్రీనివాస రెడ్డి ఆళ్ళ,  అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌