eenadubusiness.com

కరోనా సెకండ్‌వేవ్‌: ప్రజలకు కేంద్రం తీపికబురు!

కరోనా సెకండ్‌ వేవ్‌ ఇప్పటికే దేశంలో కల్లోలం సృష్టిస్తోంది. సామాన్య ప్రజల నుంచి వీఐపీల వరకు అనేక మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ మహమ్మారి విజృంభణ వలన దేశంలో ఉపాధి అవకాశాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇప్పటికే అనేక మంది సొంత రాష్ట్రాలకు తిరిగి వలస పోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం, పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన పథకం కింద పేదలకు తీపికబురు అందించింది.

ఈ పథకంలో భాగంగా ప్రతి ఒక్క లభ్దిదారునికి మే, జూన్‌ నెలలో 5 కిలోల చొప్పున ఆహర ధాన్యాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. దీంతో, దాదాపు 80 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. ఆహర ధాన్యాల కోసం కేంద్రం తొలిదశలో రూ. 26 వేల కోట్లను ఖర్చుచేయనున్నట్లు ప్రకటించింది.