eenadubusiness.com

మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో ఫ్లాట్ ఫారంల మార్పులు

హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో ఫ్లాట్ ఫారంలలో అధికారులు మార్పులు చేసారు . ఈ బస్ స్టాండ్ నుండి ప్రతీరోజు దేశం లోని అన్ని ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు వెళ్లే బస్సుల ప్లాట్‌ఫారంలను మార్చడం జరిగింది. ఈ విషయాన్నీ అధికారాలు ప్రయాణికులకు ముందుగానే తెలియజేస్తున్నారు. ఎక్కడెక్కడ ఏయే బస్సులు ఆగుతాయనే అంశంపై ప్లాట్‌ఫారం నంబర్లు, ఆగే బస్సుల వివరాలతో కూడిన ఓ జాబితాను మీడియా కు తెలియజేశారు . ఈ కింది జాబితాను బట్టి ఏ ఫ్లాట్ ఫాం మీదకు ఏ బస్సు వస్తుందో మీరు తెలుసుకోవచ్చు.
* 1 నుంచి 5 ప్లాట్‌ఫారం వరకు: గరుడ, గరుడ ప్లస్‌, వెన్నెల, అమరావతి, ఐరావత్‌ బస్సులన్నీ నిలపనున్నారు. * 6 నుంచి 7 వరకు: బెంగళూరు వెళ్లే టీఎస్‌ఆర్టీసీ బస్సులు * 8వ ప్లాట్‌ఫారం: బెంగళూరు వెళ్లే కేఎస్‌ఆర్టీసీ బస్సులు * 9వ ప్లాట్‌ఫారం: అనంత పురం, ధర్మవరం, పుట్టపర్తి బస్సులు * 10 నుంచి 11 వరకు: ఖమ్మం, భద్రాచలం, మణుగూరు వెళ్లే బస్సులు * 12వ ప్లాట్‌ఫారం: సత్తుపల్లి, రాజమహేంద్రవరం, పోలవరం వెళ్లే బస్సులు * 13వ ప్లాట్‌ఫారం: కుంట, బైలాదిల్లా, జగదల్‌పూర్‌ బస్సులు * 14 నుంచి 15 వరకు: నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ బస్సులు * 16 నుంచి 17 వరకు: గుంటూరు, నరసారావుపేట, చిలకలూరిపేట వెళ్లే బస్సులు * 18 నుంచి 22 వరకు: యాదగిరిగుట్ట, వరంగల్‌ * 23వ ప్లాట్‌ఫారం: శ్రీశైలం వెళ్లే బస్సులు * 24 నుంచి 25 వరకు: అచ్చంపేట, కల్వకుర్తి బస్సులు * 36వ ప్లాట్‌ఫారం: రాయ్‌చూర్‌ బస్సులు * 27 నుంచి 31 వరకు: మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట, హుబ్లీ * 32 నుంచి 34 వరకు: నాగర్‌కర్నూలు, కొల్లాపూర్‌, షాద్‌నగర్‌ * 35 నుంచి 36 వరకు: విజయవాడ, తెనాలి, ఏలూరు (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు * 37 నుంచి 38 వరకు: విజయవాడ, తెనాలి, ఏలూరు (ఏపీఎస్‌ఆర్టీసీ) బస్సులు * 39వ ప్లాట్‌ఫారం: విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు * 40వ ప్లాట్‌ఫారం : విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (ఏపీఎస్‌ఆర్టీసీ) బస్సులు * 41 నుంచి 42 వరకు: గద్వాల్‌, కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు * 43 నుంచి 45 వరకు: కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (ఎపీఎస్‌ఆర్టీసీ) బస్సులు * 46 నుంచి 47 వరకు: మెదక్‌, బాన్సువాడ, బోధన్‌ వెళ్లే బస్సులు * 48 నుంచి 52 వరకు: జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, కరాడ్‌, షోలాపూర్‌, పుణె, ముంబయి, (టీఎస్‌ఆర్టీసీ, ఎంఎస్‌ఆర్టీసీ) బస్సులు * 53 నుంచి 55 వరకు : సిద్దిపేట, వేములవాడ, కరీంగనర్‌, మంచిర్యాల, అసీఫాబాద్‌ బస్సులు * 56 నుంచి 58 వరకు: నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నాగ్‌పూర్‌, అమరావతి బస్సులు * 59 నుంచి 61 వరకు: మంచిర్యాల, ఒంగోలు, చెన్నై బస్సులు * 62వ ప్లాట్‌ఫారం: దేవరకొండ * 63 నుంచి 65 వరకు: పరిగి, వికారాబాద్‌, తాండూరు బస్సులు * 66 నుంచి 75 వరకు: ఎలైటింగ్‌ పాయింట్లు * 76 నుంచి 79 వరకు: సిటీ సర్వీస్‌ బస్సులు