eenadubusiness.com

రూ. 104 కోట్ల గణనీయ ఆదాయం ఆర్జించిన ఐథింక్ లాజిస్టిక్స్

 2024-25 సంవత్సరానికి అంతర్జాతీయ ఆదాయ వాటా విస్తరణపై దృష్టి  

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశ లాజిస్టిక్స్ సంస్థలలో ఒకటైన ఐథింక్ లాజిస్టిక్స్  ముందెన్నడూ లేనంత అత్యుత్తమ ఆదాయాన్ని సాధించింది.

ముంబైకి చెందిన ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ సొల్యూషన్స్ కంపెనీ అయిన ఐథింక్ లాజిస్టిక్స్, 2023-24  ఆర్థిక సంవత్సరంలో రూ.104 కోట్ల గణనీయ ఆదాయం సాధించింది. ఈ ఆదాయంలో గణనీయంగా 94.7 శాతం దేశీయ మార్కెట్ నుంచి వచ్చింది. ఈ విధమైన భారీ ఆదాయం భారత దేశం అంతటా సంస్థ పటిష్ట ఉనికిని చాటిచెబుతోంది. పశ్చిమ ప్రాంతం నుంచి అత్యధిక రాబడి రావడం విశేషం.

ఐథింక్ లాజిస్టిక్స్ తన అంతర్జాతీయ ఉనికిని మెరుగుపరుచుకోవడం కొనసాగిస్తోంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది. తాను నిర్దేశించుకున్న గ్లోబల్ కార్యకలాపాల ఆధారంగా, కంపెనీ తన విదేశీ  ఆదాయంలో 8 రెట్ల వృద్ధిని సాధించడానికి సిద్ధంగా ఉంది. ఈ మొత్తాన్ని రూ.4 కోట్ల నుండి రూ.30 కోట్లకు పెంచే లక్ష్యంతో ఉంది. ఈ విధమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం సంస్థ తన విదేశీ లాజిస్టిక్స్ సామర్థ్యాలకు  మరింత పదునుపెట్టేందుకు, వాటిని విస్తరించేందుకు చేపట్టిన విస్తృత వ్యూహంలో భాగం. 

గత సంవత్సరంలో గణనీయ వృద్ధిని సాధించడానికి మేం మా శక్తికి మించి కృషి చేశాం.  ఈ వేగాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని మేం భావిస్తున్నాం” అని ఐథింక్ లాజిస్టిక్స్ సహ వ్యవస్థాపకుడు జైబా సారంగ్ అన్నా రు. ” 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా సంచలనం కలిగించగల షిప్పింగ్ సంబంధిత వ్యవస్థను సృష్టించడంపై మేం మా దృష్టిని పెట్టాలనుకుంటున్నాం. మేం కచ్చి తత్వం, సౌలభ్యం, విస్తారమైన నెట్‌వర్క్‌ ను అందించడానికి అంకితభావంతో ఉన్నాం. FedEx వంటి లాజిస్టిక్స్ అగ్రగామి సంస్థలు,   ONDC వంటి భారతీయ డిజిటల్ వాణిజ్య మార్గదర్శకులతో భాగస్వామ్యం కలిగి ఉండటం ప్రపంచవ్యాప్తంగా లాజిస్టిక్స్ పరిశ్రమలో మా సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. గ్లోబల్ మార్కెట్‌లో మమ్మల్ని ప్రత్యేకంగా ఉంచుతుంది’’ అని అన్నారు.

ఐథింక్ లాజిస్టిక్స్ తన వినియోగదారు కేంద్రిత విధానానికి ప్రసిద్ధి చెందింది. అగ్రశ్రేణి లాజిస్టిక్స్ సేవలను అందించడానికి ఏఐ ఆధారిత సాధనాలు, మల్టీఫంక్షనల్ డాష్బోర్డ్తో సహా అధునాతన టెక్నాలజీలను ఉప యోగిస్తుంది. టెక్నాలజీలు కార్యాచరణ సామర్థ్యాలు, కస్టమర్ సంతృప్తిని పెంపొందించడంలో కీలకమైనవి. పరిశ్రమలో వినియోగదారులు ఇష్టపడే పేర్లలో ఐథింక్ లాజిస్టిక్స్ ఒకటిగా ఉండేలా చూస్తాయి. ముఖ్యంగా, Connect+ వంటి కంపెనీ యొక్క వినూత్న ఉత్పత్తులు, ప్రొప్రైటరీ WISMO (వేర్ ఈజ్ మై ఆర్డర్) టెక్నాలజీ ఇమెయిల్ వంటివి SMS మరియు WhatsApp వంటి కమ్యూనికేషన్ ఛానెల్లతో ఆర్డర్ ట్రాకింగ్ను తిరుగు లేనివిధంగా ఏకీకృతం చేయడం ద్వారా క్లయింట్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. అంతేగాకుండా, ఐథింక్ లాజిస్టిక్స్ తన సేమ్ డే మరియు నెక్స్ట్ డే డెలివరీ ఆప్షన్లతో ఆధునిక వినియోగదారుల డిమాండ్ను తీరు స్తుంది. ఆన్లైన్ ప్రపంచంలో ఆఫ్లైన్ అనుభవాన్ని అందిస్తుంది.  కస్టమర్లు తమకు వీలైన సమయాల్లో తమ ఆర్డర్లను స్వీకరించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఇది కస్టమర్ లాయల్టీని కొనసాగించడంలో, లావాదేవీని మధ్యలోనే వదిలేయడాన్ని తగ్గించడంలో కీలకమైంది.

అంతర్జాతీయ కార్యకలాపాలను అధికం చేయడం, లాజిస్టిక్స్ సేవల అన్ని విభాగాలలో రాణించడాన్ని కొనసాగిం చడంపై దృష్టి సారించడంతో పాటుగా, అత్యుత్తమ సేవా నాణ్యతను అందించడానికి, ప్రపంచవ్యాప్తంగా పటిష్ఠ భాగస్వామ్యాలను నిర్మించడానికి ఐథింక్ లాజిస్టిక్స్ కట్టుబడి ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయంలో రూ. 200 కోట్లకు  దూసుకుపోగలమని కంపెనీ అంచనా వేస్తోంది. తన వ్యూహాత్మక విస్తరణ ప్రణాళి కలు,  కార్యాచరణ శ్రేష్ఠతపై కంపెనీకి గల విశ్వాసాన్ని ఇది సూచిస్తుంది.