భారతదేశపు మొట్టమొదటి,దేశీయంగా నిర్మించిన ఏఐఎడ్యుకేషన్ సూట్ “అలఖ్ ఏఐ”ని ఆవిష్కరించిన ఫిజిక్స్ వాలా: 2 నెలల కన్నా తక్కువ వ్యవధిలో రికార్డు స్థాయిలో 1.5 మిలియన్ల వినియోగదారులను చేరుకుంది
భారతదేశపు ప్రముఖ ఎడ్-టెక్ ప్లాట్‌ఫారమ్ఫిజిక్స్ వాలా (Physics Wallah),తన ఫ్లాగ్‌షిప్ కార్యక్రమం విశ్వాస్ దివస్ సందర్భంగా అద్భుతమైన విద్యా సాంకేతిక కార్యక్రమాల శ్రేణిని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ‘‘విద్యలో నూతన యుగం’’ (పఢాయీ కా నయా అందాజ్) అనే థీమ్‌కు అనుగుణంగా, భారతదేశంలోని లక్షలాది మంది విద్యార్థులు నేర్చుకునే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు ఫిజిక్స్‌వాలాతన లక్ష్యంలో ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంది. నేర్చుకోవడాన్ని మరింత వ్యక్తిగతీకరించిన, ప్రభావవంతమైన, ఆకర్షణీయంగా చేసేందుకు హామీ ఇచ్చే ఆవిష్కరణలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రయత్నంలో ప్రధానమైనది ఫిజిక్స్ వాలా2.0 కాగా, సాంకేతిక పరిజ్ఞానం, భవిష్యత్తు విధానాలకు అనుగుణంగా ఇది అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యార్థుల ఫలితాలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తుంది. వినూత్న సాంకేతికతలను అందుబాటులోకి తీసుకువస్తూనే, ఫిజిక్స్ వాలా దాదాపు అన్ని ఆన్‌లైన్ కోర్సుల ఫీజులపై 80% వరకు తగ్గింపును ప్రకటించింది. కోర్సు ఫీజులను భరించలేని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశలో అడుగులు వేస్తోంది.
విద్యా విధానంలో వ్యక్తిగతీకరణను మెరుగుపరచేందుకు ఫిజిక్స్ వాలాతన అతిపెద్ద ప్రకటన ‘‘అలఖ్ ఏఐ’’. దీన్ని డిసెంబరు 2023 చివరిలో దేశీయంగా నిర్మించి, అందుబాటులోకి తీసుకువచ్చిన ఏఐపవర్‌హౌస్. రెండు నెలల కన్నా తక్కువ వ్యవధిలో, ఇది ఇప్పటికే 1.5 మిలియన్లకు పైగా వినియోగదారులను ఆకర్షించింది. అలఖ్ ఏఐదిగువ పేర్కొన్న ఆఫర్లను అందిస్తోంది:
ఏఐగురు: వ్యక్తిగతీకరించిన ట్యూటర్
ఏఐగురు అనేది 24/7 వ్యక్తిగత ఏఐట్యూటర్ మరియు అసిస్టెంట్. ప్రతి విద్యార్థికీ ఉండే ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా అభ్యాస అనుభవాన్ని మెరుగుపరచేందుకు అనువుగా దీన్ని తయారు చేశారు. ఏఐగురు అనేది అకడమిక్, నాన్-అకడమిక్, ప్రోడక్ట్-సంబంధిత లేదా సపోర్ట్-సంబంధితమైన వివిధ రకాల విద్యార్థుల ప్రశ్నలకు ఒన్-స్టాప్ సొల్యూషన్‌గా పనిచేస్తుంది. దానికి ఉన్న సంభాషణా స్వభావంతో విద్యార్థులు దానిని విశ్వసనీయ మార్గదర్శిగా పరిగణిస్తున్నారు. కోర్ కాన్సెప్ట్‌లపై వారి పట్టును మెరుగుపరుస్తూ, వారి మానసిక శ్రేయస్సుకు మద్దతు ఇస్తుంది.
విద్యార్థులు సందేహాలను మల్టిపుల్ మోడ్‌లలో (టెక్ట్స్, ఇమేజ్, స్పీచ్) దాఖలు చేయడంతో పాటు, టెక్ట్స్ మరియు వీడియో ఫార్మాట్‌లలో ప్రతిస్పందనలను స్వీకరించవచ్చు. ఇది రియల్ టైమ్‌లో చాలా సందేహాలను పరిష్కరిస్తుంది. ఇది గత 10-గంటల టర్న్‌అరౌండ్ సమయం కన్నా గణనీయమైన వృద్ధిని, అకడమిక్ విచారణల కోసం 94% సంతృప్తి శాతాన్ని కలిగి ఉంది. మాన్యువల్ విధానాలు అందించలేని రెస్పాన్స్‌లలో ఏఐగురు ఏకరూపత, ఊహాజనితతను అందిస్తుంది. ఏఐట్యూటర్‌కు ఇప్పటికే 1.5 మిలియన్ల కన్నా ఎక్కువ మంది విద్యార్థులను కలిగి ఉన్నారు. సంస్థ ప్రస్తుత ప్రొడక్ట్ అయిన “సందేహాన్ని అడగండి” కన్నా 3x ఎక్కువ ఎంగేజ్‌మెంట్‌లను ఏఐగురు కలిగి ఉంది.
సహాయక్: ఏఐఆధారితమైన స్మార్ట్ కంపానియన్
స్టడీ సహాయక్ విద్యార్థుల నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా అనుకూల పద్ధతులు, పునర్విమర్శ మరియు బ్యాక్‌లాగ్ క్లియరెన్స్ వంటి అంశాలతో సహా విద్యార్థులకు వ్యక్తిగతీకరించిన అభ్యాసాన్ని సులభతరం చేస్తుంది. నిర్దిష్ట సబ్జెక్టులు, అధ్యాయాలతో సహా విద్యార్థులు తమ అభ్యాస అవసరాలను ఎంచుకునే సౌలభ్యాన్ని కలిగి ఉంటారు. ఈ ఎంపికల ఆధారంగా, స్టడీ సహాయక్ ప్రతి విద్యార్థి కోసం వ్యక్తిగతీకరించిన అభ్యాసాన్ని రూపొందిస్తుంది. విద్యార్థుల అభ్యాస ప్రయాణానికి మద్దతుగా వీడియోలు, అభ్యాస ప్రశ్నలు వంటి అనుకూలీకరించిన కంటెంట్ సిఫార్సులు అందిస్తుంది.
ఎన్‌సీఈఆర్‌టీ పితారా
ఎన్‌సీఈఆర్‌టీ పితారావివిధ రకాల ఎన్‌సీఈఆర్‌టీ (NCERT)పాఠ్యపుస్తకాల నుంచి ఒకే ఎంపిక ప్రశ్నలు, బహుళ ఎంపిక ప్రశ్నలు, ఖాళీలను పూరించండి వంటి ప్రశ్నలను రూపొందించేందుకు జెన్ ఏఐను ప్రభావితం చేస్తుంది. దీనితో విద్యార్థులు తమ చదువుల్లోని అంతరాలను రియల్ టైమ్‌లో భర్తీ చేస్తుంది. ఇది పూర్తిగా సెల్ఫ్- పేస్‌ను కలిగి ఉండడంతో, విద్యార్థులు తమ సౌలభ్యం మేరకు పితరాను ప్రయత్నించి పూర్తి చేయవచ్చు. వారు ఎక్కడ ఉన్నారనే దానితో సంబంధం లేకుండా, తమకు ఇచ్చిన సమయ వ్యవధి ఎంత అని కాకుండా చదువుకునేందుకు ఇవి అవకాశాన్ని కల్పిస్తుంది.
అలఖ్ ఏఐకాకుండా, విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచేందుకు ఫిజిక్స్‌వాలాదిగువ పేర్కొన్న వినూత్న సాంకేతిక ప్రొడక్ట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది:
కమ్యూనిటీ లెర్నింగ్
విద్యను మరింత ఆకర్షణీయంగా, ఉత్తేజకరమైనదిగా చేసేందుకు,ఫిజిక్స్‌వాలాతమ అభిమాన ఉపాధ్యాయులు, బ్యాచ్‌మేట్‌లతో ప్రత్యక్ష అభ్యాస సెషన్‌ల కోసం బ్యాచ్-స్పెసిఫిక్ చర్చా సమూహాలను, ‘‘బ్యాటిల్ గ్రౌండ్’’ను కలిగిన సహకార అభ్యాస వాతావరణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. విద్యార్థులకు విద్యను ఆకర్షణీయమైన, ఆనందదాయకమైన అనుభవంగా మార్చేందుకు, అభ్యాసాన్ని ఒక ఉత్తేజకరమైన విధానంగా మార్చేందుకు ఈ చొరవను తీర్చిదిద్దింది.
తక్కువ డేటా మోడ్‌తో యాక్సెసిబిలిటీని పెంచారు
ఫిజిక్స్ వాలా డేటా వినియోగాన్ని 80-90% తగ్గించడం ద్వారా, అదే ఉపన్యాస వ్యవధిని నిర్వహించడం ద్వారా తన ప్లాట్‌ఫారమ్ డిజిటల్ లెర్నింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. ఈ పురోగమనం విద్యార్థులను వారి ప్రస్తుత డేటా ప్యాకేజీల పరిమితుల్లో పెద్ద మొత్తంలో ఉపన్యాసాలతో నిమగ్నమవ్వడానికి అనుమతిస్తుంది. డేటా పరిమితులు మించిపోతాయనే ఆందోళన లేకుండా వారి విద్యా వినియోగాన్ని సమర్థవంతంగా పెంచుతుంది. మెరుగైన డేటా సామర్థ్యం అదనపు విద్యా కంటెంట్‌కు విద్యార్థుల అందుబాటును మెరుగుపరచడమే కాకుండా ఎక్కువ అభ్యాస అవకాశాలను కూడా అందిస్తుంది.
‘‘లెర్న్‌ఓఎస్ తపస్య మోడ్’’తో ఫోకస్డ్ లెర్నింగ్
లెర్న్ ఓఎస్ అనేది విద్యార్థుల కోసం డిజిటల్ పరధ్యానాన్ని తగ్గించేందుకు రూపొందించిన ఆండ్రాయిడ్ లాంచర్. అకడమిక్ ఫోకస్, ఉత్పాదకతకు ప్రాధాన్యతనిచ్చేలా రూపొందించారు. ఇది ‘‘తపస్య మోడ్’’ కలిగి ఉంటుంది. ఇది వినియోగదారులు ఎంచుకున్న వ్యవధి కోసం అపసవ్య యాప్‌లను బ్లాక్ చేసేందుకు అనుమతిస్తుంది. దృష్టి మరల్చగల యాప్‌లను దూరంగా ఉంచడం ద్వారా ఫోకస్డ్ స్టడీ సెషన్‌లను ప్రారంభిస్తుంది. విద్యార్థులు స్ట్రీక్‌లతో పురోగతిని ట్రాక్ చేసుకుంటూ, బ్యాడ్జ్‌లను సంపాదించుకుంటూ, లీడర్‌బోర్డ్‌లలో పోటీపడవచ్చు.
విద్యలో నూతన శకాన్ని ప్రారంభించడంపై, సీఈఓ మరియు ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు, అలఖ్ పాండేమాట్లాడుతూ, “నేడు, మేము విద్యలో కొత్త ఉదయాన్ని ప్రారంభించేందుకు శిఖరం వద్ద నిలబడి ఉన్నాము. ‘‘విద్యలో నూతన యుగం’’ (పఢాయీ కా నయా అందాజ్) అనేది ఒక ఇతివృత్తం కన్నా ఎక్కువ; ప్రతి విద్యార్థికి విద్యను మరింత వ్యక్తిగతీకరించడం, ప్రభావవంతం చేయడం మరియు ఆకర్షణీయంగా చేయడం, సంప్రదాయ సరిహద్దులను అధిగమించే అభ్యాస అనుభవాన్ని అందించడమే మా నిబద్ధత. ఈ కార్యక్రమాల పరివర్తనమా నమ్మకానికి నిదర్శనం. విద్యకు ఉన్న శక్తి, విద్యార్థులు విజయవంతం కావడానికి అవసరమైన సాధనాలతో శక్తివంతం చేయడానికి మేము నిబద్ధతను కలిగి ఉన్నాము’’ అని వివరించారు.
ఈ సంచలనాత్మక కార్యక్రమాలతో, ఫిజిక్స్ వాలా విద్యకు సంబంధించిన నూతన శకంలోకి ఛార్జ్ చేసేందుకు సిద్ధంగా ఉంది.