eenadubusiness.com

ఆశాస్కూల్‌పిల్లల సంక్షేమం,స్కూల్‌ల ఆధునీకరణ కోసం రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్అవగాహన ఒప్పందం

ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఆశాస్కూల్‌పిల్లల సంక్షేమం,స్కూల్‌లఆధునీకరణకోసంరెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్అవగాహన ఒప్పందం

సికింద్రాబాద్,దిల్లీ, పుణె,బెంగళూరు, లక్నో, ఉధంపుర్‌లలోసుమారు 1200 మంది ప్రత్యేక సామర్థ్యం ఉన్న పిల్లల కోసం రెలిగేర్ఈ స్కూల్‌కు సంపూర్ణ మద్దతును అందిస్తోంది

  • ముఖ్యమైన సహకారం ద్వారా డిసెంబరు 2022లో దిల్లీలోని ఆశా స్కూల్‌తో ప్రారంభమైన ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (AWWA) తోసహకారం కార్యక్రమంలోపుణె,బెంగళూరు, లక్నో, సికింద్రాబాద్,ఉధంపుర్‌లలోని స్కూల్‌లు కూడా ఉన్నాయి.
  • ఇందులో పాఠ్యాంశాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల శ్రేయస్సు మొదలైనవి ఉంటాయి.
  • రెలిగేర్ విద్యార్థులకు వారి ఇంటర్న్‌షిప్, శిక్షణ తర్వాత ఉపాధి అవకాశాలను కూడా అందిస్తుంది

Hyderabad, నవంబర్ 2023:న్యూదిల్లీ,పుణె,బెంగళూరు, లక్నో, సికింద్రాబాద్,ఉధంపుర్‌లలోని  ఆశా స్కూల్‌లు ఆధునీకరణ, సమగ్ర అభివృద్ధిద్వారా ప్రత్యేక సామర్థ్యం గల పిల్లల సంక్షేమం పట్లరెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (REL), ఏడబ్ల్యూడబ్ల్యూఏతమ దీర్ఘకాల నిబద్ధతను ఈరోజు ప్రకటించాయి. ప్రత్యేక సామర్థ్యం గల పిల్లల సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం దేశవ్యాప్తంగా ఏడబ్ల్యూడబ్ల్యూఏద్వారా32 ఆశా స్కూల్‌లు నిర్వహించబడుతున్నాయి. ఆశా స్కూల్‌లు భారతదేశంలోని వివిధ నగరాల్లో సుమారు 1200 మంది పిల్లలను పోషిస్తున్నాయి, ఇందులో సైనిక సిబ్బంది, సైనిక దళాల మాజీ సిబ్బంది పిల్లలు 500 మంది, పౌర నేపథ్యం నుండి 500 మంది పిల్లలు ఉన్నారు.

డిసెంబర్ 2022- ఏప్రిల్ 2023 మధ్యకాలంలో REL మరియు AWWA మధ్య  సహకారం ప్రారంభించబడింది.న్యూదిల్లీ, పుణె,బెంగళూరు, లక్నో, సికింద్రాబాద్, ఉధంపుర్‌లలో REL ద్వారా ఆశా స్కూల్‌ల ఉన్నతి, ఆధునీకరణ కోసం అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది. దిల్లీలోని ఆశా స్కూల్‌కి ఒక రూపాన్ని అందించడం కోసం REL ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలో ముఖ్యమైన మౌలిక సదుపాయాల పెంపుదల చేపట్టింది. ఇతర నగరాల్లోని స్కూల్‌లను కూడా అప్‌గ్రేడ్ చేయడంలో గణనీయమైన పురోగతి సాధించబడింది.

ఢిల్లీలోని ఆశా స్కూల్‌ ఆధునీకరణకు సాక్ష్యంగా ఉన్న సహకారం మొదటి దశ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. దిల్లీలో అమలు చేయబడిన మాడ్యూల్-ఆధారిత విధానాన్ని ప్రతిబింబిస్తూ, పాఠ్యాంశాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఇతర స్కూల్‌ల్లోని అధ్యాపకుల సామర్థ్యాలతో సహా వివిధ జోక్యాల ద్వారా REL సంపూర్ణ మద్దతును అందిస్తుంది. రవాణా సౌకర్యాలు, వృత్తిపరమైన మార్గదర్శకత్వం,ప్లేస్‌మెంట్, ఇంటర్న్‌షిప్ సహాయం అందించడంతో పాటు విద్యార్థుల వైద్య, పోషకాహార అవసరాలతో ఈ స్కూల్‌లకు మద్దతు ఇవ్వాలని కూడా రెలిగేర్ భావిస్తోంది.

విద్యార్థులను ఆర్థికంగా స్వతంత్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, రెలిగేర్ ఇంటర్న్‌షిప్, శిక్షణ అవకాశాలనునిర్వహించడం ద్వారా వారిని క్రమానుగతంగా వ్యాపార సంస్థలకు పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తుంది. వారి శిక్షణ తర్వాత, రెలిగేర్ భారతదేశంలోని 100 స్థానాల్లో విస్తరించి ఉన్న రెలిగేర్ గ్రూప్ కంపెనీలలో ఉపాధిని కూడా అందిస్తుంది.

ఈ కార్యక్రమం గురించి ఏడబ్ల్యూడబ్ల్యూఏఅధ్యక్షురాలు శ్రీమతి అర్చన పాండే మాట్లాడుతూ, ‘‘ఆరు ఆశాస్కూల్స్ కోసం మా దీర్ఘకాలిక సహకారాన్ని ప్రకటించినందుకు మేం సంతోషిస్తున్నాం.దీనిని ఇతర ఆశా స్కూల్స్లకు కూడా విస్తరించాలని మేం ఆశిస్తున్నాం. ఈ స్వల్ప వ్యవధిలో సాధించిన పురోగతి రెండు భాగస్వామ్య సంస్థల ఉదాత్త ఉద్దేశాలకు నిదర్శనం. ప్రత్యేక సామర్థ్యం ఉన్న పిల్లలకు ఆశా స్కూల్ లు ఆశాకిరణం. నేర్చుకునే అభయారణ్యం. వారికి అత్యుత్తమమైన సౌకర్యాలు, అవకాశాలను అందించడమే మా నిబద్ధత, తద్వారా వారు తమ సామర్థ్యాన్ని గ్రహించి, సమాజంలో తమదైన ముద్ర వేయడానికి వీలు కల్పిస్తుంది’’ అని అన్నారు.ఆశా స్కూల్‌ల విజయాలు,ఏడబ్ల్యూడబ్ల్యూఏప్రయత్నాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రత్యేకంగా సంక్షేమాన్ని గురించి ప్రస్తావించారు. ‘‘అశక్తులైన పిల్లలు ఎల్లప్పుడూ మా సంస్థ ప్రధానంగా దృష్టి పెట్టే అంశాల్లో ఒకటిగా ఉంటారు.ఏడబ్ల్యూడబ్ల్యూఏచేపట్టిన ఈ కార్యక్రమానికి రెలిగేర్సమర్థంగా మద్దతు ఇచ్చింది. ఈ సహకారం ఈ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తుంది’’ అని అన్నారు.

ఈ కార్యక్రమం గురించి రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ డాక్టర్ రష్మీ సలుజామాట్లాడుతూ, “ఆశా స్కూల్స్ అభివృద్ధికి తోడ్పాటు అందించడం మాకు సంతోషంగా ఉంది. రెలిగేర్‌లో, మేంమా సేవలు అందించే చోట కమ్యూనిటీలపై సానుకూల ప్రభావాన్ని సృష్టించాలని మేం విశ్వసిస్తాం. ప్రత్యేక సామర్థ్యం గల పిల్లలను శక్తివంతం చేసే ఆశా స్కూల్‌ల ప్రయత్నానికి దోహదపడే అవకాశంగా ఈ కార్యక్రమాన్ని మేం భావిస్తున్నాం. ఈ స్కూల్‌లు పిల్లలను వారుతమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి వీలు కల్పిస్తూ అద్భుతంగా మార్గనిర్దేశం చేస్తాయి. ఈ పిల్లల విద్య, శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడం ద్వారా, వారికి, మన సమాజానికి మంచి భవిష్యత్తును సృష్టించాలని మేం ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

‘‘మా అనుబంధం ద్వారామేం పరిశ్రమలోని మా తోటివారికి కూడా ఒక ఉదాహరణగా నిలుస్తున్నాం, వారు పిల్లల కోసం సమగ్ర సమాజాన్ని నిర్మించడంలో సహకరించగలరు’’ అని అన్నారు.

డిసెంబరు 2022లో ఆశా స్కూల్ దిల్లీతో ప్రారంభమైన సహకారం, పుణె,బెంగళూరు, లక్నో, సికింద్రాబాద్,ఉధంపుర్‌లోని స్కూల్‌లను మరింత కవర్ చేయడానికి విస్తరించబడింది. ఈ భాగస్వామ్యాన్ని ఇతర స్కూల్‌లకు కూడా విస్తరించే యోచనలో ఉన్నారు.