eenadubusiness.com

5ఏళ్లలో 12 నగరాల్లో విస్తరణ ప్రణాళికను చేపట్టిన ఫిజిక్స్ వాలా (PW)

‘‘ఢిల్లీలో తన మొదటి ఆఫ్‌లైన్ ఇఎస్‌సి (ESE), గేట్ (GATE)&ఎస్ఇఎస్ సెంటర్‌

ఈ కేంద్రం అందిస్తున్న రెండు ప్రత్యేక కోర్సులలో ESE, GATE & SES2025 1-ఏడాది ఫౌండేషన్ కోర్సు మరియు ESE ప్లస్, GATE & SES 2025 1-ఏడాది ఫౌండేషన్ కోర్సు ఉన్నాయి.

 

భారతదేశంలోని ప్రముఖ ఎడ్-టెక్ ప్లాట్‌ఫారమ్ఫిజిక్స్ వాలా (PW),పోటీ పరీక్షల శిక్షణ విధానాన్ని మార్చే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసింది. తన కేంద్రాల విసక్తరణ విస్తరణలో భాగంగా,కంపెనీ తన మొట్టమొదటి ఆఫ్‌లైన్ ESE, GATE & SES (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) కేంద్రాన్ని ఢిల్లీలోని సాకేత్‌లో ప్రారంభించింది.

యూపీఎస్‌సి (UPSC)నుంచి సీడీఎస్ (CDS), ఎస్‌ఎస్‌సి (SSC)లతో పాటు వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులను సమర్థవంతంగా సిద్ధం చేస్తూ, ఫిజిక్స్ వాలా (PW)తనదైన గుర్తింపు దక్కించుకుంది. సాకేత్‌లో కేంద్రాన్ని ప్రారంభించిన ఫిజిక్స్ వాలా (PW)ఇప్పుడు ఇంజినీరింగ్ ఆశావాహులకు అత్యంత డిమాండ్ ఉన్న పరీక్షESE, GATE మరియు SESలలో విజయం సాధించాలని కోరుకునే అభ్యర్థుల కలలను సాకారం చేసేందుకు తన పరిధిని విస్తరిస్తోంది.

ఇంజినీరింగ్‌ ఔత్సాహికులు రాణించేందుకు సాకేత్ సెంటర్‌లో ఫిజిక్స్ వాలా (PW)రెండు ప్రత్యేక కోర్సులను ప్రవేశపెడుతోంది:

  1. గేట్ 2025 1-ఏడాది ఫౌండేషన్ కోర్సు: రాబోయే ఏడాదికి సిద్ధమవుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు బలమైన పునాదిని అందించేలా ఈ కోర్సును రూపొందించారు.
  2. ESE + GATE + SES 2025 1-ఏడాది ఫౌండేషన్ కోర్సు: 2025లో ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ESE), GATE మరియు SESలో రాణించాలని ఆకాంక్షించే వారి కోసం ఈ కోర్సును రూపొందించారు.

ఈ కోర్సులకు అడ్మిషన్ సెప్టెంబరు 25 నుంచి, తరగతులు డిసెంబర్ 15 నుంచి పారంభం అవుతున్నాయి. సాకేత్ సెంటర్ అధికారికంగా నవంబర్ 15న ప్రారంభమవుతుంది. అభ్యర్థులు నామమాత్రపు రిజిస్ట్రేషన్ రుసుము రూ.5000 చెల్లించి ఫిజిక్స్ వాలా (PW)యాప్ ద్వారా తమ కేంద్రాలను రిజర్వు చేసుకోవచ్చు.

ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏకాగ్రత మరియు లీనమయ్యే అభ్యాస వాతావరణాన్ని అందించేందుకు కొత్త కేంద్రాన్ని ప్రారంభించారు. ఫిజిక్స్ వాలా (PW)సమగ్ర ESE, GATE మరియు SES పరీక్షలకు తయారీ, వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం, అత్యాధునిక విద్యా వనరులను అందిస్తూ, విద్యార్థులను బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అలా చేయడం ద్వారా, ఈ విద్యార్థులు టాప్ స్కోర్‌లను సాధించేందుకు, ఇంజినీరింగ్ రంగంలో ఆశాజనకమైన భవిష్యత్తును పొందేలా తీర్చిదిద్దాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ESE, GATE & SES సెంటర్ ఒక విలక్షణమైన ప్రత్యేకతలో 24-గంటల డౌట్ సపోర్ట్ సదుపాయాన్ని అందించడం. ఈ అమూల్యమైన వనరు లెర్నర్లు తమ సందేహాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇది నిరంతరాయంగా మరియు సుసంపన్నమైన లెర్నింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

ఫిజిక్స్ వాలా ఆన్‌లైన్ సీఈఓ అభిషేక్ మిశ్రా మాట్లాడుతూ, ‘‘ఢిల్లీలో మా మొదటి ESE, GATE & SES సెంటర్‌ను ప్రారంభించడం అనేది లీనమయ్యే లెర్నింగ్ అనుభవాల ద్వారా విద్యార్థులకు సాధికారత సాధించాలనే మా లక్ష్యానికి అనుగుణంగా ఉంది. మేము అంకితమైన కోర్సులతో విజయం కోసం భవిష్యత్ ఇంజనీర్‌లను రూపొందిస్తుండగా, వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం మరియు 24/7 మద్దతును అందిస్తున్నాము. ఈ కేంద్రం 12 నగరాల్లోని 50,000+ విద్యార్థుల జీవితాలను చేరుకునేందుకు మరియు మార్చేందుకు మేము మా ప్రయాణాన్ని ప్రారంభించాము. దీనితో, పలువురు విద్యార్థులకు జ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం, దాన్ని అందుకోవాలని కోరుకునే మనసులను మరింత ప్రభావవంతంగా చేసే మా ప్రయాణాన్ని కొనసాగించాలని మేము వేచి చూస్తున్నాము’’ అని వివరిచాంరు.

సాకేత్ కేంద్రాన్ని నెలకొల్పాలన్న ఈ వ్యూహాత్మక ఎత్తుగడ ఫిజిక్స్ వాలా (PW)ద్వారా ప్రతిష్టాత్మకమైన విస్తరణ ప్రణాళిక ప్రారంభం మాత్రమే. రానున్న ఐదు ఏళ్లలో ఫిజిక్స్ వాలా (PW) 12 వేర్వేరు నగరాలలో 18 కొత్త విద్యా కేంద్రాలను రూ.120 కోట్ల పెట్టుబడితో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా 50,000+ కన్నా ఎక్కువ మంది విద్యార్థుల విద్యా అవసరాలను తీర్చుతూ, తన విద్యా పరిధిని మరియు ప్రభావాన్ని విస్తరించడం అంతిమ లక్ష్యంగా నిర్దేశించుకుంది.