eenadubusiness.com

ఇంటి తనిఖీని విప్లవాత్మకంగా మార్చడం: ఇంటి తనిఖీ కోసం కొత్త పరిశ్రమ ప్రమాణాలను నిర్దేశించడానికి కలసి పని చేయనున్నPropChk మరియు ఐఐటీ రూర్కీ  

 

 ఐఐటీ రూర్కీ సహకారంతో అభివృద్ధి చేయబడిన PropChk ప్రాపర్టీ ఇన్ స్పెక్షన్ చెక్‌లిస్ట్, ప్రోటో కాల్స్ అత్యున్నత విద్యా ప్రమాణాలు, పరిశ్రమ నైపుణ్యాన్ని ప్రతిబింబించేలా ఈ సహకారం నిర్ధారిస్తుంది

 ప్రాక్టికాలిటీ, కావలసిన అవుట్‌పుట్ మధ్య సమతుల్యతను తీసుకురావడానికి తనిఖీ చెక్‌లిస్ట్‌ లోని వివిధ అంశాల కోసం టోలరెన్స్ పరిమితులను రీకాలిబ్రేట్ చేయడంలో విలువైన దృక్పథాలను ఈ కార్యక్రమం ద్వారా ఈ రెండు సంస్థలు పొందాయి.

 భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్-ఎనేబుల్డ్ హోమ్ ఇన్‌స్పెక్షన్ స్టార్టప్ PropChk, ఇంటి తనిఖీలను ధ్రువీకరించడానికి పరిశ్రమ ప్రమాణాలను స్థాపించడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీతో కలసి దేశంలో ఈ తరహాలో మొదటిదైన సహకారాన్ని రూపొందించింది. సమగ్ర ప్రోటోకాల్‌ల ద్వారా ఆస్తుల భద్రత, నాణ్యతకు హామీనిస్తూ, భారతీయ రియల్ ఎస్టేట్ పరిశ్రమ లోని ప్రామాణిక మార్గదర్శకాలలోని అంతరాన్ని పూరించడానికి ఈ అద్భుతమైన భాగస్వామ్యం ప్ర యత్నిస్తుంది.

కాంట్రాక్టర్లు, డెవలపర్లు, బిల్డర్లు, తుది వినియోగదారులకు సంబంధించి పాశ్చాత్య దేశాలలో పరిశ్రమ ప్రమాణా లు బాగా స్థిరపడ్డాయి. భారతదేశంలో అటువంటి నిబంధనల లేకపోవడం వల్ల ఆస్తుల భద్రత,  నిర్మాణ నిబం ధనలకు కట్టుబడి ఉండటంలో అవకతవకలకు వీలు ఏర్పడింది. ఉదాహరణకు, యునైటెడ్ స్టేట్స్,  భారత దేశాన్ని పోల్చుదాం. భారతదేశ జనాభాలో నాలుగింట ఒక వంతు జనాభా ఉన్న అమెరికా 5,000 కంటే ఎక్కు వ ఇంటి తనిఖీ కంపెనీలు, 30,000 కంటే ఎక్కువ లైసెన్స్ పొందిన హోమ్ ఇన్‌స్పెక్టర్‌లను కలిగి ఉండగా, భారతదేశంలో ఇంటి తనిఖీ పరిశ్రమ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ధ్రువీకరించబడిన ప్రమాణాలు లేవు. ఈ ఒత్తిడి అంతరాన్ని గుర్తించి, PropChk, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – రూర్కీ (సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్‌లో నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది) ప్రాపర్టీల నిర్మాణ నాణ్యతను అంచనా వేయడానికి బలమైన పునాదిని అభివృద్ధి చేయడం ద్వారా దీనిని పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఈ భాగస్వామ్యంపై తన అభిప్రాయాలను పంచుకుంటూ, PropChk  సీఈఓ,  సహ వ్యవస్థాపకుడు సౌరభ్ త్యాగి మాట్లాడుతూ, ‘‘ఐఐటీ రూర్కీతో మా భాగస్వామ్యం రియల్ ఎస్టేట్ రంగంలో అపూర్వమైన విజయాన్ని సూచి స్తుంది. మేం అగ్రశ్రేణి విద్యాసంస్థతో చేతులు కలపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం, పేరు ప్రఖ్యాతులు పొందిన ఐ ఐటీ రూర్కీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఈ వినూత్న వెంచర్‌కు చక్కటి ఎంపిక. ఈ తరహాలో మొదటి సహకా రంగా ఈ భాగస్వామ్యం అనేది శ్రేష్ఠత పట్ల మా అచంచలమైన నిబద్ధతను, ఇంటి తనిఖీ రంగంలో ప్రామాణిక ప్రో టోకాల్‌లను స్థాపించాలనే మా సంకల్పాన్ని ప్రదర్శిస్తుంది. ఈ ప్రోటోకాల్‌లు ఈ రంగంతో ముడిపడిన వారంద రికీ నమ్మకమైన బెంచ్‌మార్క్‌ గా పనిచేస్తాయి. భారతదేశం అంతటా ఉన్న ఆస్తుల భద్రత, నాణ్యతకు హామీ ఇ స్తాయి. ఈ మైలురాయి దేశవ్యాప్తంగా ఇంటి ఇంటీరియర్‌ల ప్రమాణాలను పెంపొందించడంలో గణనీయమైన పు రోగతిని సూచిస్తుంది. ఈ పురోగతి అనేది మా నాయకత్వానికి, ఇంటి తనిఖీ పరిశ్రమలో మెరుగుదల కోసం ని రంతర డ్రైవ్‌కు అనుగుణంగా ఉంటుంది. మా అంతిమ లక్ష్యం భారతీయ నిర్మాణ రంగంలో విప్లవాత్మక మా ర్పులు చేయడం, ఆవిష్కరణలు, ఆలోచనా నాయకత్వంలో మేం అగ్రగామిగా ఉండేలా చూసుకోవడం’’ అని అ న్నారు.

ప్రొఫెసర్ భూపిందర్ సింగ్, డాక్టర్ దీక్షిత్ ప్రమేయం, సహకారం ఈ కార్యక్రమాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించాయి. సివిల్ ఇంజనీరింగ్‌లో, ప్రత్యేకించి నిర్మాణాత్మక అంశాలలో వారి అనుభవ సంపద మా చెక్‌లిస్ట్, ప్రోటోకాల్‌లను అభివృద్ధి చేయడానికి అపారమైన విలువను జోడించింది. వారి నైపుణ్యం, వారికి అందించిన పరిశ్రమల ఫీడ్‌బ్యాక్‌తో కలిపి, బిల్డర్లు, కాంట్రాక్టర్లు విస్తృ తంగా ఆమోదించే సమగ్ర మార్గదర్శకాలకు దారితీసింది’’ అని అన్నారు.

ఈ భాగస్వామ్యం చెప్పుకోదగ్గ విజయం ఐఐటీ రూర్కీలో జరిగిన వర్క్‌ షాప్‌. సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెం దిన ప్రొఫెసర్ భూపిందర్ సింగ్, డాక్టర్ దీక్షిత్ దీన్ని పర్యవేక్షించారు. PropChk అభివృద్ధి చేసిన ప్రాపర్టీ ఇన్‌స్పె క్షన్ చెక్‌లిస్ట్, ప్రోటోకాల్‌లకు సంబంధించి పరిశ్రమ వాటాదారుల నుండి విలువైన ఇన్‌పుట్‌ను సేకరించడం దీని ప్రాథమిక లక్ష్యం. తనిఖీ చెక్‌లిస్ట్‌ లోని వివిధ అంశాలకు ఆమోదయోగ్యమైన పరిమితులను సర్దుబాటు చేయ డంలో, ఆచరణాత్మకత, ఆశించిన ఫలితాల  సామరస్య సమ్మేళనాన్ని నిర్ధారించడంలో ఈ ఫీడ్ బ్యాక్ కీలక పాత్ర పోషించింది.

ఈ సందర్భంగా ఐఐటీ రూర్కీకి చెందిన డాక్టర్ భూపిందర్ సింగ్ మాట్లాడుతూ, “PropChk చేపట్టిన ఈ కార్యక్రమం భారతదేశ నిర్మాణ పరిశ్రమకు ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది. ఐఐటీ రూర్కీ దేశంలో సివిల్ ఇంజనీరింగ్,  ఆర్కిటెక్చర్‌కు మార్గదర్శక విద్యాసంస్థ అయినందున, ఈ గొప్ప ప్రయత్నంలో PropChkకి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని భావించింది. భారతీయ నిర్మాణ పరిశ్రమ కోసం ప్రాపర్టీ తనిఖీ ప్రక్రియను ప్రామాణీకరించడానికి మా సామర్థ్యంతో మేం చేయగలిగినదంతా చేస్తున్నాం. పరిశ్రమ, విద్యాసంస్థల మధ్య ఇటువంటి భాగస్వా మ్యాలు గొప్ప ఫలితాలను అందిస్తాయి’’ అని అన్నారు.

ఐఐటీ రూర్కీ సహకారంతో రూపొందించబడిన ప్రాపర్టీ ఇన్‌స్పెక్షన్ చెక్‌లిస్ట్, ప్రోటోకాల్‌లు, ఇండియన్ బిల్ట్ ఎన్వి రాన్‌మెంట్‌లో ఉన్న విభిన్న కారకాలు, ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రత్యేకంగా అనుకూలీకరించబ డ్డా యి. భారతదేశ నిర్మాణ పద్ధతులతో ప్రమాణాల సమకాలీకరణ ద్వారా, రియల్ ఎస్టేట్ రంగంలో ప్రయోజనకర మైన మార్పును తీసుకురావడంలో PropChk, ఐఐటీ రూర్కీ నాయకత్వం వహిస్తున్నాయి. వారి ప్రయత్నా లు దేశవ్యాప్తంగా ప్రామాణికమైన ప్రోటోకాల్‌లను విస్తృతంగా స్వీకరించి, అనుసరించే భవిష్యత్తును స్థాపించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

PropChkతో భాగస్వామ్యం గురించి ఐఐటీ రూర్కీకి చెందిన డాక్టర్ ఆంజనేయ దీక్షిత్ మాట్లాడుతూ,  “ఈ గొప్ప కార్యక్రమానికి గాను PropChkతో అనుబంధం మాకెంతో సంతోషం. సౌరభ్ కూడా ఐఐటీ రూర్కీ పూర్వ విద్యార్థి,  ఆయన ఈ భావనతో మమ్మల్ని సంప్రదించినప్పుడు, మా జ్ఞానం, నైపుణ్యంతో ఈ ప్రయత్నానికి సహకరించడం దేశం పట్ల మా బాధ్యత అని మేం భావించాం. మేం అభివృద్ధి చేస్తున్న చెక్‌లిస్ట్‌ లు, ప్రక్రియలు బాగా చర్చించ బ డ్డాయి. దీన్ని మేం పూర్తి అవగాహనతో మేం  సమ్మిళిత (చేకూర్పు) ప్రక్రియగా ఉంచుతున్నాం. ఇందులో భా గంగా పరిశ్రమ వాటాదారులందరి అభిప్రాయాలు సేకరించి తగిన విధంగా ప్రాసెస్ చేయబడుతాయి.  PropChk కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను,  వారు భారత దేశంలో మరింత వ్యవస్థీకృత నిర్మాణ రంగానికి అర్ధవంత మైన సహకారం అందించగలరని నమ్ముతున్నాను.

భాగస్వామ్యంలో భాగంగా, PropChk, ఐఐటీ రూర్కీ రియల్ ఎస్టేట్ పరిశ్రమకు, ఆస్తి తనిఖీలలో పాల్గొనే సంబం ధితులందరికీ ప్రయోజనం చేకూర్చడానికి చురుకుగా పని చేస్తాయి. వివిధ అంశాలకు టాలరెన్స్ పరిమితుల ను నిర్వచించడం ద్వారా, పరిశ్రమ ప్రమాణాలుగా చేర్చడం కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)కి స మర్పించగల బెంచ్‌మార్క్‌ లను ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ సంచలనాత్మక చర్య భారతీయ రియల్ ఎస్టేట్ ఆవరణ వ్యవస్థలో ఇంటీరియర్‌ల నాణ్యతకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది, వినియోగదారుల విశ్వాసాన్ని, ఈ రంగంలో  భద్రతను పెంచుతుంది.