eenadubusiness.com

గ్లోబల్ మార్కెట్ కోసం భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రక్కును ఆవిష్కరించిన ట్రెసా మోటార్స్

  • వాణిజ్య వాహన పరిశ్రమ అంతర్జాతీయ శక్తిగా భారతదేశాన్ని మార్చేందుకు ట్రెసా మోటార్స్ నిబద్ధతను ప్రదర్శించడం ఈ ఆవిష్కరణ లక్ష్యం.
  • ప్రస్తుత దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా ప్రాథమిక ఈవీ కాంపోనెంట్ తయారీకి తాను కీలక సహకారం అందించేదిగా ఉండేందుకు బ్రాండ్ కృషి చేస్తుంది.

బెంగుళూరు, జూలై 2023: ట్రెసా మోటార్స్ తన మొదటి ఎలక్ట్రిక్ ట్రక్ మోడల్ V0.1ని ఆవిష్కరించింది, ఇది తన అద్భుతమైన యాక్సియల్ ఫ్లక్స్ మోటార్ ప్లాట్‌ఫామ్: FLUX350పై నిర్మించబడింది. గ్లోబల్ మార్కెట్కోసం రూపొందించబడిన ఈ ఆవిష్కరణ, మధ్యస్థ, భారీ ఎలక్ట్రిక్ ట్రక్కుల కోసం పారిశ్రామిక డిజైన్, యాక్సియల్ ఫ్లక్స్ పవర్‌ట్రెయిన్, సురక్షితమైన బ్యాటరీ ప్యాక్‌లపై ట్రెసా మోటార్స్ విప్లవాత్మక స్వీకరణను ప్రదర్శిస్తుంది. ఈ అభివృద్ధి ఆవిష్కరణ పట్ల ట్రెసా అచంచలమైన నిబద్ధతకు, స్థిరమైన రవాణా పరిష్కారాల ద్వారా నడిచే భవిష్యత్తు కోసం సంస్థకు గల దృష్టికి నిదర్శనంగా నిలుస్తుంది.

ప్రస్తుతం, భారతదేశంలో2.8 మిలియన్ ట్రక్కుల సముదాయం ఉంది. ఇది 60% ఉద్గారాలకు దోహదపడడం అనేది మధ్యస్థ, భారీ ట్రక్కులలో సున్నా ఉద్గారాలను సాధించిన అత్యంత అవసరాన్ని చాటి చెబుతోంది. 2024లో రానున్న వాహన స్క్రాపేజ్ విధానం, పెరుగుతున్న ఇంధన ఖర్చులతో, మధ్యస్థ, భారీ ఎలక్ట్రిక్ ట్రక్కుల వైపు దృష్టి పెట్టేందుకు సమయం ఆసన్నమైంది. ట్రెసా మోటార్స్ సంప్రదాయ డీజిల్ ట్రక్కులకు సురక్షితమైన, వినూత్నమైన, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను అందించడం ద్వారా ఈ పరివర్తనకు నాయకత్వం వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ట్రెసా మోటార్స్ భారతదేశపు2.8 మిలియన్ ట్రక్కులను ఎలక్ట్రిక్‌గా మార్చడానికి ప్రయత్నిస్తోంది.

ట్రెసా ట్రక్కుల ప్రధాన అంశంFLUX350 అని పిలువబడే దాని యాక్సియల్ ఫ్లక్స్ మోటార్ సాంకేతికతలో ఉంది.ఇది 350kW వరకు నిరంతర శక్తిని అందిస్తుంది.ఈ రకమైన పవర్ అవుట్‌పుట్‌తో ట్రెసా మాత్రమే భారతీయ ఓఈఎంగా నిలిచింది. యాక్సియల్ ఫ్లక్స్ మోటార్లు వాటి కాంపాక్ట్ పరిమాణం, లైట్ వెయిట్ స్వభావానికి ప్రసిద్ధి చెందాయి. ప్రపంచంలో యాక్సియల్ ఫ్లక్స్ మోటార్స్ తయారీసంస్థలు కొన్ని మాత్రమే ఉండగా, పూర్తిగా భారతదేశంలోనేఅభివృద్ధి చేయబడిన ఈ సాంకేతికత గ్లోబల్ ఇన్నోవేషన్‌లో ట్రెసా మోటార్స్‌ను ముందంజలో ఉంచుతుంది.

’’ట్రెసా మోడల్ V0.1 అధికారిక ఆవిష్కరణ ప్రయాణం, మా యాక్సియల్ ఫ్లక్స్ మోటార్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధి అనేవి అసాధారణమైన వాటి కంటే తక్కువేమీ కాదు‘‘అని ట్రెసా మోటార్స్ వ్యవస్థాపక సీఈఓరోహన్ శ్రవణ్ అన్నారు. “మా ఆవిర్భావం నుండి చాలా జరిగింది. మేం చాలా సవాళ్లను అధిగమించాం. ఈ రోజు, ట్రెసా బృందంలో చేరిన పరిశ్రమలోని అత్యంత గౌరవనీయమైన, అనుభవజ్ఞులైన కొంతమంది సంస్థ ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి నాకు మద్దతుగానిలిచారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.  ట్రెసాలోని టీమ్ అంతా తమ కెరీర్‌లో (భారతదేశం, జర్మనీ, యూఎస్, జపాన్‌లో) 200 కంటే ఎక్కువ రకాల ట్రక్కులను రూపొందించి, తయారు చేశారు. గతంలో వీరు 2 మిలియన్లకు పైగా యూనిట్లను విక్రయించారు!” అని అన్నారు.

ANSYS, MATLABలో నెలల తరబడి ఇంటెన్సివ్ సిమ్యులేషన్‌లు తయారీ ప్రక్రియను ప్రారంభించే ముందు వందలాది పరామితులను చక్కగా తీర్చిదిద్దేందుకు నిర్వహించబడ్డాయి. ఈ కఠినమైన విధానమే ఫస్ట్ ప్రిన్సిపు ల్స్ తో ఉత్పత్తుల రూపకల్పన, ఇంజనీరింగ్‌లో ట్రెసా మోటార్స్ నిబద్ధతను ప్రదర్శిస్తుంది.

ట్రెసా మోటార్స్ ప్రారంభం అనేది భారతదేశం కోసం వ్యవస్థాపకుడి ఆశయాన్ని నెరవేర్చడానికి ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. ట్రెసా మోటార్స్ వ్యవస్థాపకుడు రోహన్ శ్రవణ్ ఇలా వ్యాఖ్యానించారు, “రాబోయే సంవత్సరాల్లో భారతదేశం ఈవీలకు గ్లోబల్ పవర్‌హౌస్‌గా మారే అవకాశం ఉంది. ట్రెసా మోటార్స్‌తో, ఈ ఆశయాన్ని సాకారం చేసుకోవడానికి, భారతదేశాన్ని ప్రపంచ రవాణా ఉత్పాదనల్లో అగ్రగామిగా నిలబెట్టడానికి మేం నిశ్చయించుకున్నాం” అని అన్నారు.

ట్రెసా మోటార్స్ మీడియం, హెవీ ఎలక్ట్రిక్ ట్రక్కులు, వాణిజ్య వాహనాల పరిశ్రమలో ఒక ప్రధాన పురోగతిని సూచిస్తాయి. ఇది సాటిలేని శక్తి, సామర్థ్యం, పర్యావరణ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ మేడ్ ఇన్ ఇండియా ఉత్పా దన స్థానిక ప్రతిభను పెంపొందించడానికి, ఆర్థిక వృద్ధిని నడపడానికి బ్రాండ్ యొక్క బలమైన నిబద్ధతను చాటి చెబుతుంది. ఈ ప్రారంభంతో, ట్రెసా మోటార్స్ భారతదేశం,విదేశాలలో ఎలక్ట్రిక్ వాహనాల ల్యాండ్‌స్కేప్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ట్రెసా మోటార్స్ 2023 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో మోడల్ V భౌతిక ఆవిష్కరణను నిర్వహించనుంది.