- గొప్ప పనితీరు: గత ఏడాది ఇదే కాలంలో అమ్ముడైన 1,765 యూనిట్లతో పోలిస్తే ప్రస్తుతం 3,474 కొత్త కార్లు డెలివరీ చేయబడ్డాయి
- ఆడి అప్రూవ్డ్: గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ‘ప్లస్’ 53% వృద్ధిని సాధించింది
- EV యజమానుల కోసం పరిశ్రమ మొట్టమొదటి చొరవ: 750కు పైగాఛార్జర్‌లతో ‘myAudiConnect’ యాప్‌లో ‘Charge my Audi’
- ఆడి క్లబ్ రివార్డ్స్ ప్రోగ్రామ్: ఒక సంవత్సరంలో 20kకు పైగా కస్టమర్‌లు అప్లికేషన్‌లో రిజిస్టర్ చేసుకున్నారు
- స్థానికంగా ఉత్పత్తి చేయబడిన కార్ల పూర్తి శ్రేణి: ఆడి Q3, ఆడి Q3 స్పోర్ట్‌బ్యాక్, ఆడి A4, ఆడి A6, ఆడి Q5 మరియు ఆడి Q7
- కొత్త ఎలక్ట్రిక్ కారు ప్రవేశం: సంవత్సరం ద్వితీయార్థంలో ఆడి Q8 ఇ-ట్రాన్
ఆడి, జర్మన్ లగ్జరీ కార్ల తయారీదారు,బలమైన డిమాండ్, లగ్జరీ కార్ల విభాగంలో వృద్ధి, పరివర్తన చెందుతున్న జనాభా ఆలోచనలు మరియు అనుకూలమైన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దాని బలమైన అమ్మకాల పనితీరును కొనసాగించింది.బ్రాండ్ జనవరి – జూన్ 2023 కాలంలో 3,474 కార్లను డెలివరీ చేసింది , గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 97% వృద్ధిని నమోదు చేసింది.
మిస్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్, హెడ్, ఆడి ఇండియా, ఇలా అన్నారు,“సరఫరా సవాళ్లు మరియు పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు ఉన్నప్పటికీ సంవత్సరం మొదటి అర్ధభాగంలో మా పనితీరుసంవత్సరం విజయవంతమైన ద్వితీయార్థానికి పునాది వేసింది.మా వాల్యూమ్ మోడల్స్ ఆడి Q3, ఆడి Q3 స్పోర్ట్‌బ్యాక్, ఆడి Q5, ఆడి A4 మరియు ఆడి A6లకు బలమైన డిమాండ్ ఉంది.మా అగ్రశ్రేణి కార్లు ఆడి Q7, ఆడి Q8, ఆడి A8 L, ఆడి S5 స్పోర్ట్‌బ్యాక్, ఆడి RS5 స్పోర్ట్‌బ్యాక్, ఆడి RS Q8 మరియు ఆడి RS ఇ-ట్రాన్ GT కూడా
వాటి సంఖ్యలో పెరుగుడలను చూపిస్తున్నాయి.”
ఆడి అప్రూవ్డ్: ప్లస్ (ప్రీ-ఓన్డ్ కార్ల వ్యాపారం) 2023 మొదటి ఆరు నెలల్లో 53% వృద్ది చెందింది. భారతదేశంలో ఆడి ఇండియా తన ప్రీ-ఓన్డ్ కారు వ్యాపారం ఆడి అప్రూవ్డ్: ప్లస్ విస్తరణను కొనసాగిస్తుంది.దేశంలోని అన్ని ప్రధాన హబ్‌లలో,ప్రస్తుతం ఇరవై మూడు ఆడి అప్రూవ్డ్: ప్లస్ సౌకర్యాలతో దాని కార్యకలాపాలను కొనసాగిస్తుంది. బ్రాండ్ విస్తరించడంలో భాగంగా 2023 చివరి నాటికి ఇరవై ఏడుకు పైగా ప్రీ-ఓన్డ్ కార్ సౌకర్యాలను కలిగి ఉంటుంది.
విద్యుదీకరణ వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్తూ, ఆడి ఇండియా ఇటీవల EV యజమానుల కోసం పరిశ్రమ-మొదటి చొరవ – ‘myAudiConnect’ యాప్‌లో ‘Charge my Audi’ ను ప్రకటించింది.ఇది వన్-స్టాప్ సొల్యూషన్, ఇది ఆడి ఇ-ట్రాన్ కస్టమర్‌లకు ఒక యాప్‌లో బహుళ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పార్టనర్‌లకు యాక్సెస్ ఇస్తుంది. ప్రస్తుతం ఆడి ఇ-ట్రాన్ యజమానులకు ‘ఛార్జ్ మై ఆడి’లో 750కు పైగాఛార్జ్ పాయింట్‌లు అందుబాటులో ఉన్నాయి, కొన్ని నెలల్లో మరికొన్ని జోడించబడతాయి.
ఆడి ఇండియా ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో: ఆడి A4, ఆడి A6, ఆడి A8 ఎల్, ఆడి Q3, ఆడి Q3 స్పోర్ట్‌బ్యాక్, ఆడి Q5, ఆడి Q7, ఆడి Q8, ఆడి S5 స్పోర్ట్‌బ్యాక్, ఆడి RS5 స్పోర్ట్‌బ్యాక్, ఆడి RS Q8, ఆడి ఇ-ట్రాన్ 50, ఆడి ఇ-ట్రాన్ 55, ఆడి ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ 55, ఆడి ఇ-ట్రాన్ GT మరియు ఆడి RS ఇ-ట్రాన్ GT.