eenadubusiness.com

మిలీనియల్స్ కు క్యాపిటల్ మార్కెట్లను పరిచయం చేయడం

ప్రభాకర్ తివారీ, సీజీఓ, ఏంజెల్ వన్ లిమిటెడ్

దేశ మొత్తం జనాభాతో పోలిస్తే, ఈక్విటీ ఇన్వెస్ట్­మెంట్స్ లో గణనీయ అంతరం ఉంది. ప్రస్తుతం భారతదేశ జనాభాలో 7% మాత్రమే ఈక్విటీ మార్కెట్లకు యాక్సెస్ కలిగిఉన్నారు. ఇది చైనాలో 14%గా, అమెరికాలో 65% గా ఉంది. దేశంలో 65% జనాభా పట్టణేతర ప్రాంతాల్లో నివసిస్తోంది. ఈ సమూహంలోకి ఈక్విటీ మా ర్కెట్ల భావన పెద్దగా చొచ్చకెళ్లలేదు. వివిధ అసెట్ తరగతుల్లో ప్రజల చురుకైన పాత్ర ద్వారా ఈ అంతరాన్ని తగ్గించవచ్చు.

గత కొన్నేళ్లుగా భారతీయ స్టాక్ మార్కెట్ విస్తృత శ్రేణికి చెందిన మదుపరుల పెట్టుబడులతో ఉరకలు వేస్తోం ది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు సంబంధించి మదుపరులలో వేగంగా చోటు చేసుకుంటున్న ఒక విశిష్టత ఏమిటంటే, మిలీనియల్స్ పోషిస్తున్నపాత్ర. 2020 క్యాలెండర్ సంవత్సరంలో భారతదేశంలో డిమ్యాట్ ఖాతా లు 10 మిలియన్లకు పెరిగాయి. ఇన్వెస్టర్ ఖాతాలు పెరిగేందుకు యువ మదుపరులు ప్రధాన చోదకశక్తిగా ఉన్నారు.

ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడంపై మిలీనియల్స్ కనబరుస్తున్న ఆసక్తి భారతీయ క్యాపిటల్ మార్కెట్లను మరింత విస్తృతం చేయనుంది. సంప్రదాయక తక్కువ రిస్క్, తక్కువ ప్రతిఫలాలను అందించే పెట్టుబడుల నుంచి మదుపును ఇది వైవిధ్యీకృతం చేయనుంది. అధునాతన సాంకేతికతలతో నూతనతరం స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు స్మార్ట్ ఇన్వెస్టర్ల కమ్యూనిటీలను నిర్మిస్తున్నాయి. దిగువ పేర్కొన్న కీలక అంశాలు స్మార్ట్ ఇన్వెస్టర్ల కమ్యూనిటీలకు తోడ్పడుతున్నాయి, వేగవంతం చేస్తున్నాయి.

నూతన తరం సాంకేతికతల స్వీకరణలో మిలీనియల్స్

ఫిన్ టెక్ విప్లవాత్మక శకంలో అసెట్ మేనేజ్ మెంట్, ఇన్వెస్ట్ మెంట్స్, సెక్యూరిటీ అనాలిసిస్, పోర్ట్ ఫోలియో డైవర్సిఫికేషన్ లను అధునాతన యాప్స్ ద్వారా స్మార్ట్ ఫోన్ ద్వారా నియంత్రించవచ్చు. మిలీనియల్స్అధునాతన సాంకేతికతలను స్వీకరించే స్వభావం కలిగిఉన్నందున తమ పెట్టుబడులు పని చేసేలా చేసేందుకు వారు వినూత్న విధానాలను కనుగొంటున్నారు. రిస్క్ రహిత ఆస్తులతో పోలిస్తే తక్కువ కాలంలోనే ఎదుగగలుగుతున్నారు.

విశ్వసనీయ సమాచారంతోనే ఇన్వెస్ట్­మెంట్ నిర్ణయాలు తీసుకుంటున్న మిలీనియల్స్

టిప్స్ పై ఆధారపడకుండా, పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేందుకు ముందుగా విశ్వసనీయ సమాచారాన్ని మిలీనియల్స్ కోరుకుంటున్నారు. ఫండమెంటల్, అనాలిస్­లకు సులభ యాక్సెస్ అందించే అధునాతన ఉపకరణాలు (నూతన తరం బ్రోకరేజ్ హౌస్ లు అందించేవి) లభ్యం కావడంతో ముందెన్నడూ లేనంతగా ఇన్వెస్ట్ మెంట్ నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ అంతా కూడా వేగవంతం, విశ్వసనీయమైందిగా మారింది.

గణనీయంగా మెరుగుపడిన ఇన్వెస్ట్ మెంట్ సేవల నాణ్యత

స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్­మెంట్స్ యావత్ ప్రక్రియ అంతా కూడా గత దశాబ్ది కాలంలో సంపూర్ణంగా మార్పు చెందింది. 360 డిగ్రీల మార్పును చవిచూసింది. ఎఐ, బ్లాక్ చెయిన్ ట్రేడింగ్ వాతావరణాన్నిమెరుగుపరిచే అవకాశాలను కల్పించాయి. వేగవంతమైన సెటిల్మెంట్స్, రియల్ టైమ్ మానిటరింగ్, మెరుగైన దృక్పథాలు, మెరుగుపర్చబడిన సెక్యూరిటీ చర్యలు వంటివి చోటు చేసుకున్నాయి. వీటికి తోడుగా, బ్రోకర్లు చేపట్టిన కార్యకలాపాల పారదర్శకత అనేది క్లయింట్లకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన సేవలను అందించేందుకు వీలు కల్పించింది. నూతన తరం కస్టమర్ తో అత్యున్నత స్థాయి విశ్వాసాన్ని నెలకొల్పేందుకు అది దారి తీసింది.

మార్కెట్లు, కంపెనీలు, స్టాక్స్ కు సంబంధించిన రీసెర్చ్, డేటా మరింతగా అందుబాటులోకి

అనలిటిక్స్ కారణంగా సమాచారం, రీసెర్చ్ లభ్యత, నాణ్యత ఊహించని స్థాయిలో అధికమైపోయాయి. మిలీని యల్స్ ఇప్పుడు ప్రైమరీ, టెక్నికల్ అనాలిసిస్, అలాంటి సమాచారం విశ్లేషణకు అపరిమిత యాక్సెస్ పొంద గలుగుతున్నారు. అంతేగాకుండా బ్రోకరేజ్ సంస్థలు అందించే 1) స్మాల్ కేస్ : ప్రి డిఫైన్డ్ బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ 2) స్ట్రీక్: సరళీకరించబడిన టెక్నికల్ అనాలిసిస్ 3) సెన్సిబుల్ : సరళీకరించబడిన ఆప్షన్ ట్రేడింగ్ వంటి పలు థర్డ్ పార్టీ సేవలు ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయబడ్డాయి. స్టాక్ ట్రేడింగ్ అనుభూతిని మెరుగుపరిచేందుకు గాను క్లయింట్లకు అందించబడుతున్నాయి.

మొత్తం మీద పరిస్థితుల్లో (ఆర్థిక) ప్రభావం

తక్కువ వడ్డీరేటు కాలం, దీర్ఘకాలానికి ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సంబంధించి పాజిటివ్ సెంటిమెంట్ కలగలసి ఆశావహ దృక్పథంతో కూడిన మిలీనియల్స్ ను ముందుకు తీసుకెళ్తున్నాయి. భారతీయ ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్ లో ఈ తరగతి మదుపరులు విశ్వాసం కలిగిఉన్నారు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ మెంట్స్ పై దీర్ఘకాలిక ధోరణిని అనుసరించేందుకు సిద్ధంగా ఉన్నారు. మార్కెట్లో అనిశ్చితి, హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ మిలీనియల్స్ అలాంటి రిస్క్­ను ఎదుర్కొనేందుకు విస్తృత శ్రేణి సాంకేతిక ఆధారిత రిస్క్ మేనేజ్­మెంట్ టూల్స్ ను ఉపయోగించే వీలుంది.

ముగింపు

వివిధ ఇన్­స్ట్రుమెంట్స్ ద్వారా కోట్లాది మిలీనియల్స్ భారతీయ స్టాక్ మార్కెట్లలో మదుపు చేస్తున్నారు. ఈ తరగతి మదుపరులు మరింత విద్యావంతులు, ఈక్విటీ మదుపులోని హెచ్చుతగ్గులను మరింతగా అర్థం చేసుకోగలిగిన వారు. మార్కెట్ పై తమ అవగాహనను మెరుగుపర్చుకునేందుకు ఆసక్తితో ఉన్నారు. పెట్టు బడి నిర్ణయం తీసుకునేందుకు విశ్వసనీయ సమాచారాన్ని పొందేందుకు అందుబాటులో ఉన్న సాంకేతికత లను అత్యుత్తమంగా ఉపయోగించుకోగలుగుతారు. దేశంలోని ఈ స్మార్ట్ ఇన్వెస్టర్ల కమ్యూనిటీ రిటైల్ ఇన్వె స్టర్ల పరిస్థితిని సానుకూలంగా సంఘటితం చేయనుంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్­మెంట్స్ పై ఎలాంటి సందేహా లకు తావు లేని విధంగా నూతన తరం ఇన్వెస్టర్లను ఈ తరం సృష్టించనుంది.