eenadubusiness.com

సిరీస్ – బి ఫండింగ్ లో రూ.262 కోట్లు సేకరించిన ప్రొపెల్డ్


పూర్తి స్థాయి డిజిటల్ రుణ ప్రక్రియల ద్వారా కస్టమైజ్డ్ లోన్ ఉత్పాదనలను అందించడంతో విద్యార్థుల ట్యూషన్ ఫీజు అందుబాటును అధికం చేసేందుకు విద్యాసంస్థలతో కలసి పని చేస్తున్న ప్రొపెల్డ్
ఈ రౌండ్ ద్వారా సేకరించిన నిధులు వివిధ వయస్సులకు చెందిన విద్యార్థుల వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు, విద్యాసంస్థల అవసరాలకు తగినట్లుగా వ్యూహాత్మకంగా నూతన ఉత్పాదనలను ప్రవేశపెట్టేందుకు వినియోగించబడుతాయి.
అప్ గ్రాడ్, అన్ అకాడమీ, వేదాంటు వంటి భాగస్వాములతో కలసి ఎడ్ టెక్, అప్ – స్కిల్లింగ్ మార్కెట్ లో అగ్రగామిగా ఉన్న నేపథ్యంలో సంస్థ ఇప్పుడు పాఠశాలలు, కోచింగ్, యూనివర్సిటీ విభాగాలపై దృష్టి పెట్టింది. అలెన్, ఆకాశ్, మౌంట్ లిటెరా జీ స్కూల్, కాకతీయ స్కూల్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్స్, హైదరాబాద్ లోని ఇతర ప్రఖ్యాత విద్యాసంస్థలతో ఇప్పటికే భాగస్వామ్యాలు కుదుర్చుకుంది.

విద్యాసంబంధిత ఫిన్ టెక్ ప్లాట్ ఫామ్ ప్రొపెల్డ్ బి సిరీస్ ఫండింగ్ లో రూ.262 కోట్లు సేకరించింది. వెస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్ తో పాటుగా ప్రస్తుత ఇస్వెస్టర్లు అయిన స్టెల్లారిస్ వెంచర్ పార్ట్ నర్స్, ఇండియా కోషియెంట్ దీనికి సారథ్యం వహించాయి. 2017లో ఐఐటి మద్రాస్ కు చెందిన ముగ్గురు బిభు ప్రసాద్ దాస్, విక్టర్ సేనాపతి, బ్రిజేష్ సామంతరే లచే ప్రొపెల్డ్ నెలకొల్పబడింది. ఈ సంస్థ ఇప్పటికే 550కి పైగా విద్యాసంస్థలచే భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. ప్రస్తుతం ఇది రూ.600 కోట్ల మేరకు వార్షిక రుణాలు అందించే దిశలో ఉంది.

ప్రస్తుత ఫండింగ్ రౌండ్ తో ప్రొపెల్డ్ వివిధ విభాగాల్లో తన రుణాల మంజూరు ను అధికం చేసుకు నేందుకు, రుణాలు తీసుకునే వారికి, భాగస్వామ్య సంస్థలకు యూజర్ అనుభూతిని మెరుగుపరిచే లా తన టెక్ సామర్థ్యాలను పెంచుకునేందుకు యోచిస్తోంది.


ఈ సందర్భంగా ప్రొపెల్డ్ సహవ్యవస్థాపకులు, సీఈఓ బిభు ప్రసాద్ దాస్ మాట్లాడుతూ, ‘‘సంప్రదాయ క ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు పొందలేకపోయిన విద్యార్థుల చదువు కలలను మేం నిజం చేయగలుగుతున్నాం. ఇప్పటి వరకూ నగరంలో యాక్టివేట్ చేసిన భాగస్వామ్య విద్యాసంస్థల నుంచి గణనీయ స్పందన పొందగలుగుతున్నాం. వ్యాపార నమూనాపై, మార్కెట్ లో అవకాశాలపై ఇది మా నమ్మకాన్ని పెంచింది’’ అని అన్నారు.