వచ్చే నెలలో విడుదల కానున్న ‘ఆడీ క్యూ5’ కార్ల బుకింగులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఎక్కడైనా ఆడీ డీలర్‌షిప్‌లలో రూ.రెండు లక్షలు చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చు. రెండు లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్న ఈ కారు 370 ఎన్‌ఎం టార్క్ వద్ద 249 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. వెనుకభాగంలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు సహా మొత్తం 8 ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చారు. ఆడీ పార్క్ అసిస్ట్, కంఫర్ట్ కీ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. సరికొత్త క్యూ5 ఎస్‌యూవీని విడుదల చేయనున్న ఆడీ.. భారత్‌లో విక్రయాలను పెంచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. వాహనాలు బీఎస్-6లోకి మారిన సందర్భంగా గత ఏడాది క్యూ3, క్యూ7 సహా పాత క్యూ5 కార్ల విక్రయాలను నిలిపివేసింది. గత ఏడాది ఆడీ 1,639 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల విక్రయాల్లో 115 శాతం వృద్ధి నమోదైంది.