eenadubusiness.com

వెయ్యి మొక్క‌లు నాటిన బ‌ల్దియా

కె.టి.ఆర్ జ‌న్మ‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఆస్కిలో జీహెచ్ఎంసి వెయ్యి మొక్క‌లు నాటింది. కె.టి.ఆర్ 42వ జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న జ‌న్మ‌రాశి మ‌క‌ర రాశికి సంబంధిచి జిట్రేగి మొక్క‌ల‌ను 42 నాటిన‌ట్లు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలిపారు. . రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు జ‌న్మ‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని బంజారాహిల్స్ ఆస్కిలో న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ఆధ్వ‌ర్యంలో జీహెచ్ఎంసీ హ‌రిత‌హారాన్ని పెద్ద ఎత్తున నిర్వ‌హించింది. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక స‌దుపాయాల సంస్థ ఛైర్మ‌న్ బాల‌మ‌ల్లు, ఎస్సీ డెవ‌ప‌ల్‌మెంట్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ పిడ‌మ‌ర్తి ర‌వి, ఎమ్మెల్సీ బాల‌సాని ల‌క్ష్మినారాయ‌ణ‌, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జనార్థ‌న్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ వ‌నాలు రావాలి కోతులు పోవాలే అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుప‌చ్చ రాష్ట్రంగా రూపొందించేందుకుగాను ప్ర‌భుత్వం చేప‌ట్టిన హ‌రిత‌హారంలో 300కోట్లకు పైగా మొక్క‌లు నాటుతున్నామ‌ని తెలిపారు. మొక్క‌లు నాట‌డ‌మే కాకుండా వాటిని బ్ర‌తికేలా శ్ర‌ద్ద వ‌హించాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ మాట్లాడుతూ హైద‌రాబాద్ నగ‌రంలో 40ల‌క్ష‌ల మొక్క‌ల‌ను నాటాల‌నే ల‌క్ష్యంతో ముందుకు పోతున్నామ‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు 9ల‌క్ష‌ల మొక్క‌ల‌ను నాటడం జ‌రిగింద‌ని చెప్పారు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని హ‌రిత‌న‌గ‌రంగా తీర్చిదిద్దాల‌నే మంత్రి కె.టి.ఆర్ ఆశ‌యాల‌ను అనుగుణంగా మొక్క‌ల‌ను నాటుతున్నామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా మొక్క‌లు నాటిన వారిలో జోన‌ల్ క‌మిష‌న‌ర్ భార‌తిహోలీకేరి, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ కృష్ణ‌, కార్పొరేట‌ర్ మ‌న్నె క‌విత‌, ఆస్కి రిజిస్ట్రార్ వినోద్‌రాయ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.