eenadubusiness.com

: ఫేక్‌ యాప్‌లకు గూగుల్‌ చెక్‌!

మన అవసరాలకు తగ్గట్టు ఫోన్‌ను రకరకాల యాప్‌లతో నింపేస్తుంటాం. వాటిని వివిధ రకాల ఫ్లాట్‌ఫాంల నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నా, ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు ప్రధాన వేదిక మాత్రం గూగుల్‌ ప్లే స్టోర్‌. అయితే ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్నా, అవి ఎంత భద్రమైనవో చెప్పలేం. అలాంటి వాటి మీద ఇప్పుడు గూగుల్‌ దృష్టి సారించింది.
ఆండ్రాయిడ్ ప్యాకేజ్(ఏపీకే) ఫైల్స్‌కు గూగుల్‌ ఒక మెటాడేటాను అనుసంధానం చేసింది. దీంతో ప్లేస్టోర్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకొనే యాప్‌ల ప్రామాణికతను తెలుసుకొనేందుకు ఇది సహకరిస్తుంది. ఒకరకంగా ఇది డిజిటల్ హక్కుల నిర్వహణకు సంబంధించిందే. అలాగే కాపీరైట్ సమాచారాన్ని వినియోగించడాన్ని నిరోధిస్తుంది. ‘భవిష్యత్తులో గూగుల్ ప్లేస్టోర్‌ ఆమోదించిన ఛానల్స్‌ నుంచే ఈ యాప్స్‌ను పొందొచ్చు. అలాగే నెట్‌ అందుబాటులో లేకపోయినా కావాల్సిన యాప్‌ ప్రామాణికతను కూడా తెలుసుకోవచ్చు. ఆ సమయంలో షేర్‌ చేసిన యాప్‌లను ప్లే లైబ్రరీలో యాడ్ చేసుకొని ,ఆన్‌లైన్‌లోకి వచ్చిన తరవాత వాటిని అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇది వినియోగదారులకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది’ అని గూగుల్ డెవలపర్స్‌ వెల్లడించారు. ఈ కొత్త విధానం మీద దృష్టి సారించడానికి భద్రత ఒక కారణం కాగా, డెవలపర్లు తమ యాప్‌లను ఎక్కువమందికి చేరేలా సాయపడాలనే ఉద్దేశం మరో కారణం.
‘డెవలపర్ల యాప్‌లు ఎక్కువ మందికి చేరేలా గూగుల్ సహకరిస్తుంది. డేటా ప్లాన్‌లు అధిక ధర ఉండే దేశాల్లో, కనెక్టివిటీ తక్కువగా ఉండే దేశాల్లో పీర్‌ టు పీర్‌ షేరింగ్ సర్వసాధారణంగా ఉంటుంది.