eenadubusiness.com

1008 కళాశాలతో సాయి పూజ

దేశంలో మునుపెన్నడూ చేయని‌ విధంగా మొదటిసారిగా సాయిబాబా వారిని 1008 కలశాలతో అభిషేకించుకోవడం ఒక బృహత్తర కార్యక్రమమని రాష్ట్ర సాంఘిక‌ సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. గురుపూర్ణిమ ను పురస్కరించుకుని గుల్ మొహర్ పార్కు నేతాజీ నగర్ లోని శ్రీ షిరిడీ సాయినాధుని ఆలయంలో భారతీయ బ్రాహ్మణ సేవా సమితి వారి సహకారంతో ఆలయ నిర్వాహకులు రాఘవేందర్ జోషి‌ ఆధ్వర్యంలో గురువారం దేశంలోని అన్ని పుణ్య నదీ జలాలతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు రాగం సుజాత, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దంపతులు పాల్గొని 1008 కలశాభిషేకాన్ని ప్రారంభించారు. శ్రీ షిరిడీ‌ సాయిబాబా‌ వారి శత సంవత్సర సమాధి ఉత్సవ గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ మాదవానంద సరస్వతి స్వామి‌ వారి ఆశీస్సులతో సాయినాథునికి పవిత్ర నదీ జలాలతో అభిషేకాలు నిర్వహించడం శుభప్రదమని అన్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడి సాయిబాబా ఆలయం ప్రసిద్ధి గాంచనున్నట్లు చెప్పారు. నిత్య పూజలందుకుంటున్న సాయినాథుని దివ్యాశిస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అంతకుముందు లింగాకారంలో ప్రదర్శించిన 1008 కలశాలకు వేదపండితుల మంత్రోచ్ఛరణలతో పూజలు నిర్వహించారు. రాగం సుజాతనాగేందర్ యాదవ్ దంపతులు కలశాలతో ఊరేగింపుగా వెళ్లి సాయినాథునికి అభిషేకం జరిపారు‌. ఇలాంటి విశేష కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరంగా ఉందని చెప్పారు. సాయినాథున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అనిరుద్ యాదవ్, నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు బేరి రాంచందర్ యాదవ్, ఆలయ ప్రధానార్చకులు జోషి రాఘవేందర్ శర్మ, సాయిబృందం సభ్యులు,‌ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.