eenadubusiness.com

ప్రజోపకరమైన నిర్మాణాత్మక పనులు చేపట్టండి, హెచ్ఎండీఎ కమీషనర్

హెచ్ఎండీఎ చెల్లిస్తున్న డెవెలప్మెంట్ డిఫర్మెంట్ చార్జీల నిధులతో ఆయా గ్రామ పంచాయితీలలో ప్రజోపకరమైన నిర్మాణాత్మక పనులు చేపట్టాలని హెచ్ఎండీఎ కమీషనర్ టి. చిరంజీవులు కోరారు. గ్రామ పంచాయతీలు వసూలు చేయాల్సిన అభివృధ్ధి రుసుములను తామే వసూలు చేసి, వారికి నిధులను జారీ చేస్తున్నారని, కాబట్టి ఆ నిధులను సదుపయోగం చేయాలని ఆయన కోరారు. సోమవారం తార్నాకా లోని హెచ్ఎండీఎ కేంద్ర కార్యాలయంలో ఆయన ఔటర్ రింగ్ రోడ్కు కిలో మీటర్ పరిధిలోని గ్రోత్ కారిడార్ ప్రాంతాలలోని గ్రామ పంచాయితలలో చేపట్టిన భవన నిర్మాణాలకు వసూలు చేసిన డెవెలప్మెంట్ డిఫర్మెంట్ చార్జీల మొత్తాలకు సంబంధించిన చెక్కులను పలు గ్రామపంచాయతీ కార్యదర్శులకు అందించారు. కాగా 3 కోట్ల 47 లక్షల 80 వేల 642 రూపాయల నిధులకు చెందిన చెక్కులను 15 గ్రామపంచాయితీల కార్యదర్శులకు జారీచేశారు. ఈ సంధర్భంగా కమీషనర్ మాట్లాడుతూ ఇప్పటికి నాలుగు విడుతలుగా డిఫర్మెంట్ చార్జీల రూపంలో 10 కోట్ల 3 లక్షల 98 వేల 589 రూపాయలు చెల్లించినట్లు చెప్పారు. మొదటి విడుతలో 2 కోట్ల 11 లక్షల 98 వేల 425 రూపాయలు, రెండవ విడుతగ 1కోటి, 52 లక్షల, 81 వేల, 594 రూపాయలు, మూడవ విడుతలో 2 కోట్ల 91 లక్షల 37 వేలు 928 రూపాయలు, మరియు ప్రస్తుతం నాలుగవ విడుతగా 3 కోట్ల 47 వేల 80 లక్షల 642 రూపాయలు చెల్లించినట్లు చెప్పారు. గ్రోత్ కారిడార్ పరిధిలోని ఆదిభట్ల, బౌరంపేట, గౌడవెల్లి, ఇంద్రేశం, కండ్లకోయ, కొల్లూరు, మల్లంపేట, పుప్పాలగూడ, రాంపల్లి, శారదా నగర్, రాజేంద్ర నగర్, కొంగర్ కుర్ద్, కోకా పేట, కొంగర కలాన్, మంగల్ పల్లి, మంచిరేవుల, పెద్ద అంబర్ పేట, నార్సంగి, సుల్తాన్పుర్,ముత్తంగి, దుండిగల్, మల్లమేట, రాంపల్లి, శామీర పేట, రావిర్యాల మొదలకు గ్రామాలున్నాయి.
నేడిక్కడ జారీ చేసిన చెక్కులలో మహేశ్వరం(55 లక్షలు), కీసర(10లక్షల 61 వేలు), అబ్దుల్లాపూర్ మేట్( 10 లక్షలు), శామీర్ పేట ( 33 లక్షలు), పటాన్ చెరువు (67 లక్షలు) కీసర (36లక్షలు) మహేశ్వరం( 24లక్షలు) ,నార్సింగి (12లక్షలు), దుండిగల్ (13 లక్షలు), గండిపేట ( 8 లక్షల 20 వేలు ) గ్రామపంచాయితీలు ఉన్నాయి. కార్యక్రమంలో హెచ్ఎండీఎ సిఎఓ శరత్ చంద్ర మరియు పలువురు గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.