eenadubusiness.com

ఉడిపి స్వామీజీకి విష ప్రయోగం, మృతి: పోలీసు కస్టడీలో మహిళ, భారీగా నగలు, రాత్రి అక్కడే !

కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా కలకలంరేపిన ఉడిపి అష్ట్రమఠాలలో ఒకటైన శీరూరు మఠం శ్రీ లక్ష్మివర తీర్థ స్వామీజీ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఉడిపి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఏడు ప్రత్యేక బృందాలతో కేసు విచారణ చేస్తున్నారు. స్వామీజీతో సన్నిహితంగా ఉంటూ రాత్రి మఠంలో ఉన్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
????? ???? ?
రమ్యా ఎవరు ?
శీరూరు మఠాధిపతి శ్రీ లక్ష్మివర తీర్థ స్వామీజీ అనుమానాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఉడిపి పోలీసులు బ్రహ్మావర ప్రాంతంలో నివాసం ఉంటున్న రమ్యా శెట్టి అనే మహిళను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. ఆమె భారీగా నగలు వేసుకుని ఫోటోలు తీసుకున్న విషయం వెలుగు చూడటంతో మఠం భక్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
????? ?? ??? ?
మఠంలో ఏం పని ?
శీరూరు మఠానికి నిత్యం రమ్యా శెట్టి వస్తోందని, శ్రీ లక్ష్మివర తీర్థ స్వామీజీకి ఆహారం, భోజనం తీసుకువస్తోందని మఠం సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. రమ్యా శెట్టి కారులో వస్తోందని, కారు మాత్రం మఠంకు దూరంగా పెడుతోందని, స్వామీజీతో మాత్రం గదిలో చాల సమయం మాట్లాడుతుందని అక్కడి సిబ్బంది పోలీసులకు చెప్పారు.
?????? ????? ????
రాత్రి మఠంలో మకాం
శిరిసికి చెందిన రమ్యా శెట్టి ప్రస్తుతం బ్రహ్మావర ప్రాంతంలో నివాసం ఉంటోంది. రమ్యా శెట్టితో పాటు ఆమె తల్లి మఠంకు వస్తోందని అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతే కాకుండా రమ్యా శెట్టి చాల సందర్బంల్లో రాత్రిపూట మఠంలొనే ఉన్నారని అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిసింది.
???? ?????????? ????? ??????
సీసీ కెమెరాల్లో రమ్యా శెట్టి
మూడు రోజుల క్రితం రమ్యా శెట్టి మఠంకు వచ్చి శ్రీ లక్ష్మీవర తీర్థ స్వామీజీకి భోజనం ఇచ్చారని, రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు వెళ్లారని అక్కడి సిబ్బంది పోలీసులకు చెప్పారు. రమ్యా శెట్టి మఠంకు వచ్చి వెళ్లిన సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. రమ్యా శెట్టిని పోలీసులు అదపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మఠంలోని వంట మనిషి, స్వామీజీ వ్యక్తిగత సిబ్బందిని పోలీసులు విచారణ చేస్తున్నారు.
???????? ????????? ????
స్వామీజీ చెప్పింది నిజం
శీరూరు మఠాధిపతి లక్ష్మీవర తీర్థ స్వామీజీ మరణం వెనుక ఇద్దరు మహిళల హస్తం ఉంటుందని ఉడిపి ప్రధాన దేవాలయం మఠాధిపతి శ్రీ పేజావర స్వామీజీ ఆరోపించారు. ఇప్పుడు పోలీసులు సైతం రమ్యా శెట్టిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. శ్రీ లక్ష్మీవర తీర్థ స్వామీజీ, రమ్యా శెట్టి మద్య ఎమైనా గొడవలు జరిగి విష ప్రయోగం జరిగిందా ? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.