Eenadu Business

ఇయర్-ఎండ్ అతిపెద్ద సేల్ ‘ది గ్రాండ్ ట్రెలియన్ సేల్’ను ప్రకటించిన ట్రెల్ – Eenadu Business

ఇయర్-ఎండ్ అతిపెద్ద సేల్ ‘ది గ్రాండ్ ట్రెలియన్ సేల్’ను ప్రకటించిన ట్రెల్



ఇన్ – యాప్ కరెన్సీ ట్రెల్ క్యాష్ ను పరిచయం చేసేందుకు ఫిల్మ్ ఆవిష్కరణ

ముందెన్నడూ లేని విధంగా 6 రోజుల సోషల్ కామర్స్ మెగా షాపింగ్ సేల్



– 100 మిలియన్లకు పైగా యూజర్లకు సౌందర్యం, వ్యక్తిగత సంరక్షణ, ఫ్యాషన్ విభాగాల్లో 600కు పైగా బ్రాండ్లపై 80% వరకు డిస్కౌంట్ పొందేందుకు వీలు

– సేల్ కు ముందుగా ఇన్ – యాప్ కరెన్సీ ట్రెల్ క్యాష్ ఆవిష్కరణ. భారతదేశంలో మొదటిసారిగా యూజర్లు వీడియోలు చూడవచ్చు, క్యాష్ సంపాదించవచ్చు, ‘ది గ్రాండ్ ట్రెలియన్ సేల్’ సందర్భంగా ట్రెల్ షాప్ పై రిడీమ్ చేసుకోవచ్చు.

– ‘ది గ్రాండ్ ట్రెలియన్ సేల్’ సందర్భంగా కంపెనీ కొత్త బ్రాండ్లతో కలుస్తోంది. వెల్లా, స్క్వర్ కోప్జ్, హల్స్ లవ్, బ్యూటీ అండ్ ప్లానెట్, స్వారోవ్ స్కి, స్కెచర్స్ లాంటివి వీటిలో ఉన్నాయి.



భారతదేశ అతిపెద్ద ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ స్టైల్ సోషల్ కామర్స్ ప్లాట్ఫామ్ అయిన Trell తన ఫ్లాగ్ షిప్ ‘ది గ్రాండ్ ట్రెలియన్ సేల్’ ను ప్రకటించింది. ఇది డిసెంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు జరుగనుంది. 100 మిలియన్లకు పైగా యూజర్లకు సౌందర్యం, వ్యక్తిగత సంరక్షణ, ఫ్యాషన్ విభాగాల్లో 600కు పైగా బ్రాండ్లపై 80% వరకు డిస్కౌంట్ పొందేందుకు ట్రెల్ షాప్ పై ‘ది గ్రాండ్ ట్రెలియన్ సేల్’ వీలు కల్పిస్తుంది.

వివిధ రకాల బ్రాండ్లపై 80 శాతం దాకా డిస్కౌంట్ పొందేందుకు ‘ది గ్రాండ్ ట్రెలియన్ సేల్’ వీలు కల్పిస్తుంది. కాల్విన్ కెయిన్, డీకేఎన్ వై, మేబెలిన్, లోరియల్, మానిష్ మల్హోత్రా బ్యూటీ, మామా ఎర్త్, మెకాఫిన్, ప్లమ్, బేర్ అనాటమీ, వావ్ స్కిన్ సైన్స్, బియార్డో, ది మ్యాన్ కంపెనీ, ఏరోపొస్టేల్, యూఎస్ పోలో, ఫ్యాబ్ అల్లే, స్పైకర్, రైజిన్ లాంటివి వీటిలో ఉన్నాయి. ఫ్యాషన్, బ్యూటీ, పర్సనల్ కేర్ విభాగాల్లో సంస్థ మరెన్నో ప్రఖ్యాత బ్రాండ్లతో కలసి పని చేస్తోంది. వెల్లా, స్క్వర్ కోప్జ్, హల్స్ లవ్, స్పైకర్, పెపె జీన్స్, యూఎస్ పోలో వంటివి వీటిలో ఉన్నాయి.

ఇన్ యాప్ కరెన్సీని పరిచయం చేసేందుకు ట్రెల్ క్యాష్ పేరిట ఒక డిజిటల్ ఫిల్మ్ ను కూడా ట్రెల్ ఆవిష్కరించింది. కొనుగోలుదారుల ‘విష్ లిస్ట్’ అనేది ఈ సేల్ కు ముందుగా వారి అభిమాన ఉత్పత్తులను జోడించుకునేందుకు వీలుగా ఉంటుంది. ‘వాచ్ లిస్ట్’ అనేది #ది గ్రాండ్ ట్రెలియన్ సేల్ సందర్భంగా అత్యధిక డిస్కౌంట్లను అందించే ఉత్పాదనలతో కూడిన వీడియోలతో ఉంటుంది. దీన్ని చూడాల్సిందిగా ట్రెల్ కొనుగోలుదారులను ఆహ్వానిస్తోంది.

Previous
Next