Skip to content

Eenadu Business

ఈ శీతాకాలంలో బాడీ షాప్ నూతన వెగాన్ అవకాడో శ్రేణితో మీ చర్మాన్ని కాపాడుకోండి

నూతన, పోషకయుక్త అవకాడో బాడీ బటర్ తో విస్తరణ

శీతాకాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయంటే, మీ చర్మానికి మరింత హైడ్రేషన్, పోషణ అవసరమని అర్థం. చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా ఉంచేందుకు బ్రిటిష్ కు చెందిన అంతర్జాతీయ కాస్మటిక్స్, పర్సనల్ కేర్ బ్రాండ్ అయిన ది బాడీ షాప్ తన అవకాడో బాడీ బటర్ ను ఆవిష్కరించి, అవకాడో ఆధారిత బాడీ కేర్ శ్రేణిని మరింతగా విస్తరించింది.

మన ఆరోగ్యానికి మరీ ముఖ్యంగా మన చర్మానికి ఎన్నో ప్రయోజనాలు అందిచే ఒక సూపర్ ఫుడ్ అనే విషయం అందరికీ తెలిసిందే. మోనోఅన్ శాచురేటెడ్, పాలి అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఎ, డి, ఇ విటమిన్లకు సుసంపన్న వనరుగా ఉండే అవకాడో, మన చర్మానికి మాయిశ్చరింగ్, కండీషనింగ్ అందించడంలో ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. చర్మాన్నియూవీ కిరణాల బారినుంచి కాపాడుతుంది. చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది.

ఇందులో ఉపయోగించే పదార్థాల్లో 96% మేర సహజసిద్ధమైనవి. వీటితో బాడీ షాప్ అవకాడో బాడీ బటర్ మీ చర్మానికి నూతనోత్తేజాన్ని తిరిగి అందిస్తుంది. చర్మానికి అవసరమైన మాయిశ్చర్ ను అందిస్తుంది. పొడి బారడం నుంచి, ముడతలు పడడం నుంచి 96 గంటల పాటు దాన్నికాపాడుతుంది. క్రీమీ, పరిమళభరిత బాడీ బటర్ సుస్థిరదాయక విధానాల్లో దక్షిణాఫ్రికా నుంచి సేకరించిన హాస్ అవకాడో ఆయిల్ ను కలిగి ఉంటుంది. అదే ఈ ఉత్పాదనకు గుండెకాయ లాంటిది. కమ్యూనిటీ ఫెయిర్ ట్రేడ్ షీయా బటర్ ఘనా నుంచి, కమ్యూనిటీ ఫెయిర్ ట్రేడ్ బ్రెజిల్ నట్ ఆయిల్ పెరూ నుంచి వస్తాయి. అవి మీ చర్మానికి అవసరమైన మాయిశ్చర్ ను అందిస్తాయి. చర్మాన్ని అంటుకుపోయేదిగా లేదా జిడ్డుగా చేయకుండానే డీహైడ్రేషన్ ను తప్పిస్తాయి.

బాడీ షాప్ అవకాడో శ్రేణి షవర్ క్రీమ్, బాడీ లోషన్ టు ఆయిల్, హ్యాండ్ బామ్, బాడీ స్క్రబ్ లను కూడా కలిగిఉంది. ఉదాహరణకు అవకాడో బాడీ స్క్రబ్ అనేది చర్మపు మృత కణాలను తొలగిస్తుంది. చర్మాన్ని మృదువైందిగా చేస్తుంది. షవర్ క్రీమ్ అనేది పొడి చర్మం కోసం రూపొందించబడింది. చక్కటి షవర్ అను భూతిని అందిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. మీ చేతులు మాయిశ్చరైజ్ అయిఉండేలా చేసేందుకు హ్యాండ్ బామ్ అనేది మీ గోళ్లు, అరచేతులకు తోడ్పడుతుంది. చివరిగా బాడీ షాప్ అవకాడో లోషన్ టు ఆయిల్ అనేది రిఫ్రెషింగ్ లైట్ సెంటెడ్ లోసన్. మృదువైన, కొద్దిపాటి పొడి చర్మం కోసం రూపొందించబడింది. ఇది చక్కటి ప్రకాశత్వాన్ని అందిస్తుంది. ఈ ఉత్పాదనలన్నీ కూడా అవకాడో అందించే ఆరోగ్యాన్ని కలిగి ఉంటాయి. 100% వేగాన్ ఉత్పత్తులు. రీసైకిలబుల్ ప్యాకేజింగ్ లో లభిస్తాయి.

నూతన బాడీ బటర్ అల్యూమినియం లిడ్,  రీసైకిలబుల్ ప్లాస్టిక్ తో తయారైన ప్లాస్టిక్ టబ్ తో  రీసైకిలబుల్ ప్యాకేజింగ్ లో లభిస్తుంది. అంతేగాకుండా అవకాడో సరఫరాదారు జీరో ల్యాండ్ ఫిల్ పాలసీని కలిగిఉంది. అంటే ఆయిల్ ఉత్పాదనకు ఉపయోగించబడిన పళ్లు అన్నీ కూడా కంపోస్ట్ చేయబడుతాయి. అంతేగాకుం డా ఇది వేగన్ సొసైటీచే ధ్రువీకరించబడింది. చర్మపరంగా పరీక్షించబడింది. పర్యావరణాన్ని పరిరక్షించాలనే బ్రాండ్ అంకితభావానికి నిదర్శ గా నిలుస్తుంది.