Eenadu Business

కొల్లూరులో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం* – Eenadu Business

కొల్లూరులో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం*

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఒకేచోట కొల్లూరులో 15,600 డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ భారీ ప్రాజెక్ట్‌ను జీహెచ్ఎంసీ చేప‌డుతోంది. చిన్న‌పాటి న‌గ‌రాన్ని రూపొందించే ఈ మెగా డ‌బుల్ బెడ్‌రూం సిటీ నిర్మాణాన్ని రామ‌చంద్ర‌పురంలోని కొల్లూరు గ్రామంలో నిర్మిస్తోంది. మొత్తం నిరుపేద ల‌బ్దిదారులకు ఉచితంగా నిర్మించ‌నున్న ఈ డిగ్నిటీ హౌజింగ్‌ను కొల్లూరులో 124 ఎక‌రాల స్థ‌లంలో రూ. 1354.59 కోట్ల వ్య‌యంతో 15,660 ఇళ్ల నిర్మాణాన్ని చేప‌డ్తున్నారు. మొత్తం 117 హౌజింగ్ బ్లాకుల్లో ఎస్-9, .ఎస్‌+10, ఎస్‌+11 అంత‌స్థుల్లోనిర్మించనున్న ఈ కాల‌నీని దేశంలోనే ఆద‌ర్శ‌వంత‌మైన, మ‌రెక్క‌డా లేనివిధంగా అన్ని సౌక‌ర్యాల‌తో నిర్మించ‌డం ద్వారా మోడ‌ల్ సిటీగా మారనుంది.

Previous
Next