Eenadu Business

తెలంగాణ‌లో స్మార్ట్ మీట‌ర్ల ఉత్ప‌త్తి యూనిట్‌ – Eenadu Business

తెలంగాణ‌లో స్మార్ట్ మీట‌ర్ల ఉత్ప‌త్తి యూనిట్‌

*స్మార్ట్ మీట‌ర్లను ఉత్ప‌త్తి చేసే చైనాకు చెందిన హ్యాంగ్జో స‌న్ రైజ్ టెక్నాల‌జీ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చింది. ప్ర‌భుత్వం భూమి కేటాయిస్తే రూ.**100* *కోట్ల పెట్టుబ‌డిని పెట్ట‌డానికి సంసిద్ధ‌త‌ను వ్య‌క్తం చేసింది. గురువారం హ్యాంగ్జో స‌న్ రైజ్ టెక్నాల‌జీ కంపెనీ* *వైస్ ప్రెసిడెంట్ యాంగ్ గ్వాంగ్‌**, **డైరెక్ట‌ర్ డేవిడ్ లియాంగ్ టీఎస్ ఐఐసీ చైర్మ‌న్ గ్యాద‌రి బాల‌మ‌ల్లుతో ప‌రిశ్ర‌మ భ‌వ‌న్‌లో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా చైనా కంపెనీ ప్ర‌తినిధులు తెలంగాణ నూత‌న పారిశ్రామిక విధానం(టీఎస్‌ఐపాస్‌) గురించి తెలుసుకొని బాగుంద‌ని కితాబిచ్చారు. స్మార్ట్ మీట‌ర్ల త‌యారీకి సంబంధించి త‌మ‌కు జ‌ర్మ‌నీ**, **ఇండోనేషియా**, **తైవాన్ దేశాల్లో యూనిట్లు ఉన్నాయ‌ని తెలిపారు. స్మార్ట్ విద్యుత్ మీట‌ర్లు**, **స్మార్ట్ వాట‌ర్ మీట‌ర్లు**, **స్మార్ట్ గ్యాస్ మీట‌ర్ల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు చెప్పారు.* *ప్ర‌పంచ వ్యాప్తంగా త‌మ కంపెనీ ఉత్ప‌త్తుల‌కు మంచి మార్కెటింగ్‌**, **డిమాండ్ ఉంద‌ని పేర్కొన్నారు. పరిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ఇండియాలో తెలంగాణ రాష్ట్రం సుర‌క్షిత‌మైనందున ఇక్క‌డ స్మార్ట్ మీటర్ల ఉత్ప‌త్తి యూనిట్‌ను నెల‌కొల్పేందుకు సంసిద్ధంగా ఉన్నామ‌ని హ్యాంగ్జో స‌న్ రైజ్ టెక్నాల‌జీ కంపెనీ ప్ర‌తినిధులు బాల‌మ‌ల్లుకు వివ‌రించారు. **10* *ఎక‌రాల స్థ‌లాన్ని కేటాయిస్తే తెలంగాణ‌కు చెందిన పారిశ్రామిక‌వేత్త‌ల భాగ‌స్వామ్యంతో స్మార్ట్ మీటర్ల ఉత్ప‌త్తి యూనిట్‌ను ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. రెండు ద‌శ‌ల్లో రూ.**100* *కోట్ల పెట్టుబ‌డులు పెడ‌తామ‌ని**, **త‌మ యూనిట్ ఏర్పాటుతో వెయ్యి మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని చైనా కంపెనీ ప్ర‌తినిధులు టీఎస్ ఐఐసీ చైర్మ‌న్‌కు వివ‌రించారు. స్మార్ట్ మీట‌ర్ల ఉత్ప‌త్తి యూనిట్ ఏర్పాటు విష‌యాన్ని సీఎం కేసీఆర్‌**, **ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ మంత్రి కేటీఆర్ ద్ర‌ష్టికి తీసుకువెళ్లి రాష్ట్రంలో స్థ‌లాన్ని కేటాయించేలా చూస్తాన‌ని చైనాకు చెందిన హ్యాంగ్జో స‌న్ రైజ్ టెక్నాల‌జీ కంపెనీ ప్ర‌తినిధుల‌కు టీఎస్ ఐఐసీ చైర్మ‌న్ గ్యాద‌రి బాల‌మ‌ల్లు హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా భేటీలో తెలంగాణ పారిశ్రామికవేత్త‌ల స‌మాఖ్య‌(టీఐఎఫ్‌) అధ్య‌క్షుడు కే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.

Previous
Next