Eenadu Business

‘సైరా’.. 35 రాత్రుల సవాల్ ముగిసింది: రత్నవేలు – Eenadu Business

‘సైరా’.. 35 రాత్రుల సవాల్ ముగిసింది: రత్నవేలు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న హిస్టారికల్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇటీవలే ఓ భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. రత్నవేలు సినిమాటోగ్రఫీలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా 35 రోజుల షెడ్యూల్‌ పూర్తయిన సందర్భంగా రత్నవేలు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సెట్‌లో తీసిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు.
‘‘35 రాత్రుల సవాలుతో కూడిన షెడ్యూల్‌ పూర్తయింది. వర్షంలో బ్రిటిష్‌ సైనికులకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. అద్భుతమైన నిర్మాణ విలువలతో భారీ యాక్షన్‌ సన్నివేశాల్ని తెరకెక్కించాం. అతి తక్కువ కాంతిలో షూటింగ్‌ జరిగింది.. అద్భుతం. ‘సైరా’..’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్‌కి చెందిన గ్రాగ్ పావెల్ పని చేశారు. రత్నవేలు షేర్‌ చేసిన పిక్‌ని చూస్తే ఎలాంటి వాతావరణంలో షూటింగ్‌ జరిగిందో అర్థమవుతుంది. ఈ పిక్‌లో చీకటిలో గుర్రాలపై వెళ్తున్న వ్యక్తులు కనిపించారు. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుధీర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Previous
Next