Eenadu Business

హైదరాబాద్‌ చేరుకున్న కమల దళపతి అమిత్‌ షా – Eenadu Business

హైదరాబాద్‌ చేరుకున్న కమల దళపతి అమిత్‌ షా

*బ‌హిరంగ మూత్ర‌విస‌ర్జ‌న చేస్తే జ‌రిమానాల విదింపు*
*ప్రెస్‌నోట్‌: 2* హైద‌రాబాద్‌న‌గ‌రంలో బ‌హిరంగ మూత్ర‌విస‌ర్జ‌న‌ను నివారించ‌డంతో పాటు రోడ్ల‌పై చెత్త‌ను వేయ‌కుండా ఉండేందుకు న‌గ‌ర‌వాసుల‌ను చైత‌న్య‌ప‌ర్చ‌డంతో పాటు ఈ విష‌యంలో మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. 2019 అక్టోబ‌ర్ 2వ తేదీ నాటికి స్వ‌చ్ఛ భార‌త్ ల‌క్ష్యాన్ని సాధించాల‌న్న స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌పై న‌గ‌ర‌వాసుల్లో ప్ర‌వ‌ర్థ‌న సంబంధిత మార్పుల‌ను తేవ‌డానికి ఇప్ప‌టికే పెద్ద ఎత్తున చైత‌న్య‌, అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించింది. అయిన‌ప్ప‌టికీ ర‌హ‌దారుల‌పై బ‌హిరంగంగా మూత్ర‌విస‌ర్జ‌న చేయ‌డం, రోడ్ల‌పై చెత్త‌ను వేసే బాద్య‌తార‌హితంగా ప్ర‌వ‌ర్థించేవారికి క్లీనింగ్ చార్జీల పేరిట జ‌రిమానాలు విధించాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం న‌గ‌రంలో 382 ప‌బ్లిక్ టాయిలెట్లు, మ‌రో 74 ప‌బ్లిక్ టాయిలెట్లు, 24 షీ-టాయిలెట్లు నిర్మాణంలో ఉన్నాయి. గాంధీగిరి ద్వారా న‌గ‌రంలోని పెట్రోల్ పంపులు, హోట‌ళ్లు, రెస్టారెంట్లలోని టాయిలెట్లను న‌గ‌ర ప్ర‌జానికం ఉప‌యోగించుకునేలా ఒప్పించ‌డ‌మే కాకుండా సంబంధిత యాజ‌మ‌న్యాలు ఉచితంగా టాయిలెట్‌ను ఉప‌యోగించుకునే అవ‌కాశం ఉంద‌నే బోర్డుల‌ను కూడా ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 259 పెట్రోల్ బంక్‌లు, 257హోట‌ళ్లు, రెస్టారెంట్లు త‌మ టాయిలెట్ల‌ను ఉప‌యోగించుకునేందుకు లిఖితపూర్వ‌కంగా అంగీక‌రించాయి. న‌గ‌రవాసుల‌కు పెద్ద సంఖ్య‌లో టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చిన‌ప్ప‌టికీ టాయిలెట్ల‌ను ఉపయోగించకుండా ప‌లువురు రోడ్ల‌పైనే బ‌హిరంగ మూత్ర‌విస‌ర్జ‌న‌కు పాల్ప‌డుతున్నారు. వీరిప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు క్లీనింగ్ చార్జీల పేరిట జ‌రిమానాల‌ను విధించాల‌ని స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ స్ప‌ష్టం చేసింది. అదేవిదంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇంటింటి నుండి త‌డి, పొడి చెత్త‌ను విడివిడిగా సేక‌రించడానికి 44ల‌క్ష‌ల డ‌స్ట్‌బిన్‌ల‌ను ఉచితంగా అందించిన‌ప్ప‌టికీ చెత్త‌ను రోడ్ల‌పైనే వేస్తున్నారు. బాద్య‌తార‌హితంగా రోడ్ల‌పై చెత్త‌వేసేవారికి కూడా జ‌రిమానాలు విధించాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిప్యూటి క‌మిష‌న‌ర్లు, మెడిక‌ల్ ఆఫీస‌ర్ల‌కు ఆదేశాలు జారీచేసిన‌ట్టు జీహెచ్ఎంసీ స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ విభాగం అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ మ‌నోహ‌ర్ తెలిపారు. ——————————————————————————————————–

Previous
Next