Eenadu Business

సురేఖపై మేయర్, టీఆర్ఎస్లో టిక్కెట్ చిచ్చు – Eenadu Business

సురేఖపై మేయర్, టీఆర్ఎస్లో టిక్కెట్ చిచ్చు

వరంగల్: జిల్లాలో టీఆర్ఎస్‌లో వర్గపోరు బయటపడింది. వచ్చే ఎన్నికల్లో తాను కచ్చితంగా ఎమ్మెల్యే టిక్కెట్ అడుగుతానని, తనకే కాదని, తెలంగాణ ఉద్యమంలో పని చేసిన ప్రతి కార్యకర్తకు ఆ హక్కు ఉందని, తనకు రాజకీయంగా నష్టం కలిగిస్తే ఉగ్రనరసింహ అవతారం ఎత్తుతానని గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్ శనివారం హెచ్చరించారు.
ఆయన ఎమ్మెల్యే కొండా సురేఖపై నిప్పులు చెరిగారు. ఇటీవల సురేఖ తనపై చేసిన విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. తాను 2009 నుంచి ఉద్యమంలో ఉన్నానని చెప్పారు. 2014లో వరంగల్ తూర్పు టిక్కెట్‌ను అధినేత కేసీఆర్‌ను అడిగానని చెప్పారు. కానీ సీఎం ఆదేశాలతో అప్పుడు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశానని చెప్పారు.
????? ??????? ??????????? ?????? ???????????
కొండా సురేఖను తరిమికొట్టే రోజులు ముందున్నాయి
వచ్చే ఎన్నికల్లో కూడా అధనేతను టిక్కెట్ అడుగుతానని నరేందర్ తెలిపారు. ఒక ఇంట్లో మూడు ఎమ్మెల్యే టిక్కెట్లు అడిగితే తప్పులేదు కానీ నేను ఒకటి అడిగితే తప్పా అని కొండా సురేఖపై నిప్పులు చెరిగారు. నాలుగేళ్లుగా నిరాధరణకు గురైన అంశం కొండా సురేఖకు హఠాత్తుగా రాత్రికి రాత్రి గుర్తుకు వచ్చిందని విమర్శించారు. సురేఖను తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు.
?? ?????? ????? ????? ??????? ????????
నా త్యాగం వల్లే కొండా సురేఖకు టిక్కెట్
తాను త్యాగం చేస్తే వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే టికెట్‌ కొండా సురేఖకు వచ్చిందని నరేందర్ అన్నారు. పార్టీకి, నగర ప్రజలకు నష్టం కలిగిస్తే నరసింహావతారం ఎత్తుతానని చెప్పారు. తనను నమ్ముకున్న కార్యకర్తల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు. టీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెండ్ చేసే అధికారం సురేఖకు గానీ, తనకు గానీ లేదన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా పేరుగాంచిన ఓరుగల్లు మహానగర ప్రజల మధ్య స్వార్థ రాజకీయాల కోసం చిచ్చు పెట్టడం ఎంతవరకు సమంజసం అన్నారు.
30 ???? ?????? ???????? ??????? ????
30 ఏళ్ల రాజకీయ అనుభవమని గొప్పలు కాదు
30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని గొప్పలు చెబుతున్న కొండా సురేఖ అక్కకు చట్టాలు, కోర్టులు ఇచ్చిన ఉత్తర్వుల గురించి తెలియవా అని నరేందర్ ప్రశ్నించారు. చట్టసభల్లో సభ్యురాలిగా ఉంటూ చట్టాలను గౌరవించకపోతే ఎలా అన్నారు. ఓ గద్దె నిర్మాణ పనులు నిలిపివేయడంలో ఎవరి పాత్ర లేదన్నారు. కానీ ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ముప్పై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వారు మూడేళ్ల తన అనుభవం చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
??????????? ??????? ???? ?? ?????? ?????????
చంద్రబాబుతో పోల్చడం వల్ల నా స్థాయి పెరిగింది
తనకు అండగా ఉండేవారిని కుక్కలుగా సంబోధించడం బాధాకరం అని నరేందర్ అన్నారు. టీఆర్ఎస్‌ను కాపాడేందుకు కుక్కలా కాపలా ఉంటానని, తేడాలు వస్తే మాత్రం నరసింహావతారమే అన్నారు. కొండా సురేఖ భాష మార్చుకోవాలని హితవు పలికారు. రాజకీయల్లో బచ్చా అని కామెంట్‌ చేశారని, అవును ఆమె కంటే చిన్నపిల్లాడినేనని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోల్చి మాట్లాడడంతో తనస్థాయి పెరిగిందన్నారు. సైగ చేస్తే నా ఇల్లు కూల్చుతారని ఎమ్మెల్యే అన్నారని, మీరు ఎందరికి ఇలా నష్టం చేశారో అందరికీ తెలుసునని మండిపడ్డారు.
?????? ??????, ????????? ?????? ????
తాను ఇక్కడే పుట్టానని, చచ్చేదాకా ఇక్కడే ఉంటానని నరేందర్ అన్నారు. తాను ఇక్కడ ఒంటరిగానే తిరుగుతున్నానని, ముందు, వెనుక కార్లు, జీపులతో తిరగడం లేదన్నారు. తూర్పు నియోజకవర్గం ప్రజలు చైతన్యవంతులని, అప్రజాస్వామికంగా, స్వార్థ రాజకీయాలు చేసేవారికి సరైన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. కాగా, కార్పొరేటర్లు శారదా జోషి, రిజ్వానా షమీమ్‌, పార్టీ నేతలు మసూద్‌, సురేశ్‌జోషి సస్పెన్షన్లను సీఎం కేసీఆర్‌ చూసుకుంటారని చెప్పారు.

Previous
Next