Eenadu Business

దోమ‌ల నిర్మూల‌న‌ చైత‌న్యంపై మ‌స్కిటోయాప్-4 ల‌క్ష‌ల డౌన్‌లోడ్‌లు – Eenadu Business

దోమ‌ల నిర్మూల‌న‌ చైత‌న్యంపై మ‌స్కిటోయాప్-4 ల‌క్ష‌ల డౌన్‌లోడ్‌లు

ప్ర‌తి సంవ‌త్స‌రం ల‌క్ష‌లాదిమంది అనారోగ్యానికి కార‌ణ‌మ‌వుతూ, మ‌ర‌ణాల‌కు మూల కార‌ణ‌మైన దోమ‌ల నివార‌ణ‌కు జీహెచ్ఎంసీ చేప‌ట్టిన చైత‌న్య వాహిక మ‌స్కిటోయాప్. న‌యాపైసా ఖ‌ర్చులేకుండా మొత్తం 17 ప్ర‌శ్న‌ల‌తో కూడిన మ‌స్కిటో యాప్‌ను ఆగ‌ష్టు 17న జీహెచ్ఎంసీ ప్రారంభించింది. ప్లే స్టోర్ ద్వారా మ‌స్కిటోయాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అందులోని 17 ప్ర‌శ్న‌ల‌కు అన్నింటికి స‌రైన స‌మాధానాలు ఇచ్చిన‌వారికి లాట‌రీ ద్వారా ఒక్కొక్క‌రికి 10వేల రూపాయ‌ల చొప్పున ప‌ది మందికి ల‌క్ష రూపాయ‌ల ఉచిత బ‌హుమ‌తిని కూడా జీహెచ్ఎంసీ అందిస్తోంది. మ‌రే దేశంలోనూ, న‌గ‌రంలోనూ లేన‌టువంటి ఈ వినూత్న మొబైల్ యాప్ ద్వారా హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జల‌ను దోమ‌ల నివార‌ణ ప‌ట్ల చైత‌న్య కార్య‌క్ర‌మాల‌ను జీహెచ్ఎంసీ చేప‌ట్టింది. మ‌స్కిటోయాప్ ప్ర‌వేశ‌పెట్టిన సంవ‌త్స‌రంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు 4,10,000 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌డంతో పాటు ఇందులోని 17ప్ర‌శ్న‌ల‌కు 2,80,250 మంది స‌రైన స‌మాధానాలు కూడా అందించారు. దోమ‌ల వ‌ల్ల క‌లిగే మ‌లేరియా, వ్యాధి నివార‌ణ‌కు సికింద్రాబాద్‌లోనే మందును స‌ర్ రోనాల్డ్ రాస్ క‌నుకొని ప్ర‌పంచానికి అందించారు. ఇట్టి హైద‌రాబాద్ న‌గ‌రంలో దోమ‌ల నివార‌ణ‌కు జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున చైత‌న్య కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది. దీనిలోభాగంగా పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు, కాల‌నీ సంక్షేమ సంఘాలు, మ‌హిళా సంఘాల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశాలు నిర్వహించి దోమ‌ల నివార‌ణ‌, దోమ‌ల వ‌ల్ల సంభ‌వించే వ్యాధుల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. **మ‌స్కిటోయాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేవిధానం** * గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి మ‌స్కిటోయాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. * స్క్రిన్‌పై రిజిస్ట్రేష‌న్ ఫాం క‌నిపిస్తుంది. * మీ పేరు, మొబైల్ నెంబ‌ర్‌, చిరునామాతో పాటు ఇత‌ర వివ‌రాల‌ను నింపాల్సి ఉంటుంది. * ద‌ర‌ఖాస్తు నింపి స‌బ్‌మిట్ చేసిన అనంత‌రం స్క్రీన్‌పై 17 ప్ర‌శ్న‌ల ఫార్మిట్ వ‌స్తుంది. * ఈ 17 ప్ర‌శ్న‌ల‌కు అవును/కాదు అనే స‌మాధానాలు మాత్ర‌మే ఇవ్వాల్సి ఉంటుంది. * 17 ప్ర‌శ్న‌ల‌కు స‌రైన స‌మాధానాలు ఇచ్చ‌న వారికి లాట‌రీ ద్వారా ప‌ది మందికి ఒకొక్క‌రికి ప‌ది వేల రూపాయ‌ల చొప్పున న‌గ‌దు బ‌హుమ‌తుల‌ను జీహెచ్ఎంసీ అందిస్తుంది. కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్స్‌బులిటీ ప‌థ‌కంలో భాగంగా ఈ న‌గ‌దు బ‌హుమ‌తుల‌ను అందిస్తారు. **మ‌స్కిటోయాప్ ద్వారా అడిగే ప్ర‌శ్న‌లు ఇవే…** 1. దోమ జీవిత కాలం సుమారు నెల రోజులు మాత్ర‌మే – అవును/ కాదు 2. ఆడ‌దోమ త‌న నెల రోజుల జీవిత కాలంలో వెయ్యి గుడ్ల‌ను పెడుతుంది – అవును/ కాదు 3. కేవ‌లం ఒక దోమ సంవ‌త్స‌ర కాలంలో కోట్లాది దోమ‌ల ఉత్ప‌త్తికి అన‌గా మాన‌వ జ‌నాభా కంటే అధికంగా దోమ‌ల ఉత్ప‌త్తికి కార‌ణ‌మ‌వుతుంది – అవును/ కాదు 4. గుడ్డు స్థాయి నుండి దోమ స్థాయికి రావ‌డానికి దోమ‌ల జీవ‌న చ‌క్రం 8 నుండి 10రోజులు ప‌డుతుంది – అవును/ కాదు 5. నీరు నిల్వ ఉన్న ప్ర‌దేశాల్లో దోమ‌లు గుడ్లు పెట్ట‌వు – అవును/ కాదు 6. పారుతున్న నీటిలో దోమలు గుడ్లు పెట్ట‌డం ద్వారా డెంగ్యు, మ‌లేరియా వ్యాధుల‌కు కార‌ణ‌మ‌వుతాయి – అవును/ కాదు 7. కుండ‌లు, కూల‌ర్లు, డ్ర‌మ్ములు, సిమెంట్ ట్యాంక్‌లు, న‌ల్లా గుంత‌లు, మూసి ఉండ‌ని సంపులు, ఓవ‌ర్‌హెడ్ ట్యాంక్‌ల‌లో దోమ‌లు ఉత్ప‌త్తి కార‌ణంగా డెంగ్యు వ్యాధి సోకుతుంది. – అవును/ కాదు 8. ప్ర‌తి శుక్ర‌వారాన్ని డ్రైడేగా పాటించ‌డం, నీటి నిల్వల‌ను తొల‌గించ‌డం ద్వారా డెంగ్యు, మ‌లేరియా కార‌క దోమ‌ల‌ను నియంత్రించ‌వ‌చ్చు – అవును/ కాదు 9. ఇళ్ల ప‌రిస‌ర ప్రాంతాలు, పైక‌ప్పులో వృథాగా ఉండి ఉప‌యోగించ‌ని వ‌స్తువుల తొల‌గింపు ద్వారా డెంగ్యు కార‌క దోమ‌ల వ్యాప్తిని నియంత్రించ‌వ‌చ్చు – అవును/ కాదు 10. లార్వా ద‌శ‌లో నిర్మూలించ‌డం ద్వారా దోమ‌ల వ్యాప్తిని నియంత్రించ‌వ‌చ్చు – అవును/ కాదు 11. గంబూసియా చేప‌ల ద్వారా దోమ‌ల గుడ్లు, లార్వాల అభివృద్దితో పాటు దోమ‌ల వ్యాప్తి పెరుగుతోంది. – అవును/ కాదు 12. సెప్టిక్ ట్యాంక్‌ల‌పై ఉన్న చిమ్నీ పైప్‌ల‌ను మేష్ ద్వారా క‌ప్ప‌క‌పోవ‌డం దోమ‌ల వ్యాప్తికి కార‌ణ‌మ‌వుతాయి – అవును/ కాదు 13. మ‌లేరియా ప్యారాసైట్‌ను క‌నుగొన్న నోబెల్ అవార్డు గ్ర‌హిత స‌ర్ రోనాల్డ్ రాస్ సికింద్రాబాద్‌లో ప‌నిచేశారు. – అవును/ కాదు 14. డ్రెయిన్‌లు, చెరువులలో ప్లాస్టిక్, వ్య‌ర్థప‌దార్థాలు వేయ‌డం ద్వారా మురుగునీరు నిలిచి దోమ‌ల వ్యాప్తికి కార‌ణ‌మ‌వుతాయి. – అవును/ కాదు 15. ఆడ‌, మ‌గ దోమ‌లు రెండు కూడా అంటువ్యాధుల వ్యాప్తికి కార‌ణ‌మ‌వుతాయి. – అవును/ కాదు 16. దోమ‌తెర‌లు వాడ‌డం ద్వారా దోమ‌కాటు నుండి, దోమ‌ల ద్వారా వ‌చ్చే వ్యాధుల నుండి ర‌క్షించుకోవ‌చ్చు. – అవును/ కాదు 17. ప్ర‌పంచంలో అత్య‌ధికంగా మాన‌వుల మ‌ర‌ణానికి కార‌ణ‌మ‌య్యే ప్ర‌మాద‌క‌ర‌మైన జంతువు దోమ‌. సంవ‌త్స‌రానికి 7,25,000మంది దోమ కాటు వ‌ల్ల మృతిచెందుతున్నారు. – అవును/ కాదు

Previous
Next