Eenadu Business

జగన్.. రిజర్వేషన్లకు వ్యతిరేకమా ? – Eenadu Business

జగన్.. రిజర్వేషన్లకు వ్యతిరేకమా ?

కాపు రిజర్వేషన్లు సాధ్యం కావన్న జగన్పై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. కాపు జాతి రిజర్వేషన్లపైన వ్యతిరేకతా ? లేక రిజర్వేషన్లపైనే వ్యతిరేకతా ? స్పష్టం చేయాలని ముద్రగడ డిమాండ్ చేశారు. తమ కులానికి రిజర్వేషన్ కల్పించే వారికే తమ ఓట్లు పడతాయని ముద్రగడ పద్మనాభం అన్నారు. తమను వంచించే వారిని గుర్తించి వారందరినీ వచ్చే ఎన్నికల్లో దూరం పెడతామని, దీనికోసం వ్యూహాలు రచించుకుంటున్నామని చెప్పారు. కాపు ఉద్యమం పుట్టిన జిల్లాలో.. ఉద్యమ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ద్వారా.. వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి.. తమ జాతిని అవమానించారని ముద్రగడ పద్మనాభం విమర్శించారు.

కాపు రిజర్వేషన్లు సాధ్యం కావన్న జగన్పై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. కాపు జాతి రిజర్వేషన్లపైన వ్యతిరేకతా ? లేక రిజర్వేషన్లపైనే వ్యతిరేకతా ? స్పష్టం చేయాలని ముద్రగడ డిమాండ్ చేశారు. తమ కులానికి రిజర్వేషన్ కల్పించే వారికే తమ ఓట్లు పడతాయని ముద్రగడ పద్మనాభం అన్నారు. తమను వంచించే వారిని గుర్తించి వారందరినీ వచ్చే ఎన్నికల్లో దూరం పెడతామని, దీనికోసం వ్యూహాలు రచించుకుంటున్నామని చెప్పారు. కాపు ఉద్యమం పుట్టిన జిల్లాలో.. ఉద్యమ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ద్వారా.. వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి.. తమ జాతిని అవమానించారని ముద్రగడ పద్మనాభం విమర్శించారు. పదవీకాంక్షతోనే జగన్ తమ జాతిని అవమానిస్తున్నారని అన్నారు. జగన్మోహన్రెడ్డి.. తమ కులానికి చెందిన నేతలతో విపరీతంగా ఖర్చు చేయిస్తూ.. వారి కుటుంబాలను ఆర్పేస్తున్నారని ముద్రగడ పద్మనాభం విమర్శించారు. జగన్ పాదయాత్ర ఖర్చులతో అప్పులపాలవుతున్న కుటుంబాలు.. ఆత్మహత్యలు చేసుకోవాలా అని ప్రశ్నించారు.

Previous
Next