Eenadu Business

కరోనా పరిస్థితులపై టీఎస్‌ హైకోర్టు విచారణ – Eenadu Business

కరోనా పరిస్థితులపై టీఎస్‌ హైకోర్టు విచారణ

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. వైద్యారోగ్య, విద్య, శిశు సంక్షేమ శాఖ, జీహెచ్‌ఎంసీ, పోలీసు, జైళ్ల శాఖలు.. హైకోర్టుకు నివేదికలు సమర్పించాయి. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ పట్ల అప్రమత్తంగా ఉన్నామని డీహెచ్‌ శ్రీనివాసరావు కోర్టుకు తెలిపారు. తెలంగాణలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదు కాలేదని.. మూడోదశ కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. నెల రోజుల్లో ప్రభుత్వస్పత్రుల్లో పడకలన్నింటికీ ఆక్సిజన్‌ సదుపాయం కల్పిస్తున్నామని కోర్టుకు డీహెచ్‌ తెలిపారు.

Previous
Next