Eenadu Business

ఎంపి క‌విత పిలుపుకు స్పందించిన బాబా ఫ‌సియుద్దీన్‌ – Eenadu Business

ఎంపి క‌విత పిలుపుకు స్పందించిన బాబా ఫ‌సియుద్దీన్‌

స్వీయ ర‌క్ష‌ణ‌తో పాటు కుటుంబ స‌భ్యుల సంక్షేమార్థం ద్విచ‌క్ర‌వాహ‌నాలను న‌డిపేవారు విధిగా హెల్మెట్ ధ‌రించాల‌ని పార్ల‌మెంట్ స‌భ్యురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత పిలుపు మేర‌కు హెల్మెట్ ధ‌రించి త‌న డివిజ‌న్‌లో ద్విచ‌క్ర‌వాహ‌నంపై డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్‌ తిరిగారు. త‌న డివిజ‌న్‌లో ద్విచ‌క్ర‌వాహ‌నంపై ప‌ర్య‌టిస్తాన‌ని ఫ‌సియుద్దీన్ తెలిపారు. రాఖీ పండగ సందర్బంగా సోదరులు రక్షణ హెల్మెట్ ధరించాలన్న ఎంపి కవిత ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన డిప్యూటి మేయ‌ర్ హెల్మెట్ ధ‌రించిన ఫోటోను ట్వీట్ చేయ‌గా ఈ ట్వీట్‌ను అభినందిస్తూ ఎంపి కవిత రి- ట్వీట్ చేశారు.

Previous
Next